మేడ్చల్: మల్లికార్జున నగర్ గంగపుత్ర సంఘం ప్రతినిధులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆదివారం కలిసి, పవర్ బోరు, ఇతర మౌలిక వసతుల కల్పన కోరుతూ వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే స్వంత నిధులతో సంఘానికి సహాయం అందిస్తానని హామీఇచ్చారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, సంఘం ప్రతినిధులు బాలయ్య, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
బిర్యానీలో కుళ్ళిపోయిన గుడ్డు..
మేడ్చల్: ఉప్పల్ మండలంలో కొన్ని హోటల్స్ యాజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా సమీపంలోని సత్తిబాబు బిర్యానీ సెంటర్‌లో ఓ కస్టమర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో కుళ్లిన కోడిగుడ్డు, దుర్గంధం వచ్చినట్లు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. అనుమతులు లేకుండా నడుపుతున్నా హోటల్స్‌పై చర్యలు తీసుకోవాల్సిన కస్టమర్లు కోరుతున్నారు.
-
బొలెరో, ఆర్టీసీ బస్సు ఢీ.. 36 మేకలు మృతి
TG: రంగారెడ్డి షాద్ నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. షాద్‌నగర్ బైపాస్ రోడ్‌లో మేకల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 36 మేకలు మృతి చెందాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
-
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ
మేడ్చల్: కుత్బుల్లాపూర్ 128చింతల్ డివిజన్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్‌లో మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.హైదరాబాద్ విలీనంతో పాటు దేశంలోని అరాచక శక్తుల ఆటలు కట్టించిన ఘననేత సర్దార్ పటేల్ అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
-
నేడు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
HYD: రాష్ట్రవ్యాప్తంగా నేడు భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలుజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్న, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ ,వికారాబాద్, సంగారెడ్డి, జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
-
ప్రేమ, పెళ్లి పేరుతో మోసం
HYD: ప్రేమ, పెళ్లి అంటూ ఓ యువతితో సహజీవనం చేసి ముఖం చాటేసిన మహేష్(30) అనే యువకుడిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ గాయత్రీహిల్స్‌లో నివసించే యువతితో ప్రేమపేరుతో సహజీవనం చేసి, రూ.14లక్షలు తీసుకుని మోసంచేశాడు. యువతి మణికొండకు మారిన తర్వాత, మహేష్ రూ.5లక్షలు తిరిగి చెల్లించి, మిగిలిన డబ్బు ఇవ్వకుండా పెళ్లికి నిరాకరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
-
కార్తికేయ గార్మెంట్స్ షాపులో అగ్ని ప్రమాదం
మేడ్చల్: కుషాయిగూడ పీఎస్ పరిధిలోని టీజీఐఐసీ కాలనీ కార్తికేయ గార్మెంట్స్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు రూ.2లక్షల విలువ చేసే గార్మెంట్స్ అగ్నిపాలైందని యజమాని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
త్వరలో హౌసింగ్ బోర్డు స్థలాల అమ్మకం
TG: హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాలు, ప్లాట్ల వేలానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్లాట్ల వేలం చేపట్టగా రికార్డుస్థాయిలో ధర పలికింది. ఈమేరకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండురోజుల క్రితం కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్-7లో ఖాళీగా ఉన్న 18 స్థలాలను విక్రయించగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓ ప్లాట్ చదరపు గజం ధర అత్యధికంగా రూ.2.98 లక్షలు పలకడం గమనార్హం.
-
నేటి నుంచి ఆలయ మహోత్సవం
HYD: కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నెంబర్ 2లోని శ్రీ వీరాంజనేయ స్వామి, నీలకంఠే శ్వర స్వామివారి దేవస్థానం 39వ వార్షిక మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మాధికారి జై శంకర్ బాలగోపాల్, దేవస్థానం ఫౌండర్ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. పూజా కార్యక్రమాల్లో పరిసర ప్రాంత భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
-
జూదంపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్టు
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పరిధిలోని దేవరాంజల్‌లో చిత్తు బొత్తు జూదం ఆడుతున్న స్థావరంపై జిల్లా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 12మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.73లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేప్రాంతంలో సాయి గీత ఆశ్రమం ఎదురుగా జూదమాడుతున్న మరో 12మందిపై పేట్‌బషీరాబాద్ పోలీసులు దాడి చేసి నగదు, ఆరు కాయిన్స్ స్వాధీనం చేసుకుని కేసునమోదు చేశారు.