HYD: రాత్రి సమయాల్లో బస్సు సర్వీసులు లేక అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. గ్రేటర్‌లో అర్ధరాత్రి 12.30 గంటల వరకు బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్నా బస్సులు అందుబాటులో ఉండట్లేదని విమర్శలు వస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్‌కు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు రాత్రి 9 దాటిందంటే బస్సులు ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
Locations: Hyderabad
-
స్వచ్ఛంద రక్తదానం గురించి అవగాహన
HYD: ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా ఐబీఎస్ హైదరాబాద్ క్యాంపస్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని ప్రొఫెసర్ మాధవి గరికపార్థి నాయకత్వంలో, క్లబ్ సంకల్ప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి నిలూఫర్ ప్రభుత్వ ఆసుపత్రి, ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్(IDF) భాగస్వామిగా ఉన్నారు. శిబిరం ప్రధాన లక్ష్యం స్వచ్ఛంద రక్తదానం గురించి అవగాహన పెంచడం, సమాజంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఆరోగ్యపరంగా సేవ చేయడం. -
తగ్గిన చికెన్ ధరలు
HYD: మాంసం ప్రియులకు చికెన్ ధరలు ఊరటనిస్తున్నాయి. రెండు వారాలుగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నగరంలో స్కిన్ లెస్ కేజీ రూ.215-220 పలుకుతోంది. విత్ స్కిన్ రూ.200గా ఉంది. అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. విజయవాడలో స్కిన్ లెస్ రూ.240, విశాఖలో రూ.260, బాపట్లలో రూ.200కు విక్రయిస్తున్నారు.
-
అవయవ మార్పిడి కేంద్రాలుగా గాంధీ, నిమ్స్ , ఉస్మానియా
HYD:గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులను అవయవ మార్పిడి కేంద్రాలుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు వంటి ఏ అవయవాన్ని మార్చడానికి పేద, మధ్యతరగతి వారికి
అందుబాటులో ఉండేలా సౌకర్యాలను కల్పిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కో ఆసుపత్రిలో ముగ్గురు చొప్పున నిష్ణాతులైన ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్లను నియమిస్తామని వెల్లడించారు. -
అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్ హెచ్చరిక
రంగారెడ్డి: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ హెచ్చరించారు. మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ శివారు సర్వే నంబర్ 8లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఆయన కూల్చివేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యాపారాలకు అనుగుణంగా కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు.
-
నేడు కంటి వైద్య శిబిరం
HYD: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.11లోని గౌరీశంకర్ కాలనీ కమ్యూనిటీహాల్లో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అడ్వాన్స్‌డ్ ఫోకస్ కంటి ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ అనూజ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
‘ఆపరేషన్ సిందూర్‌తో వాయుసేన శక్తి చూపాం’
HYD: ఆపరేషన్ సిందూర్ భారత వైమానిక దళ సామర్థ్యానికి నిదర్శనమని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 254మంది కేడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో ఆయన రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జీలను) ప్రదానం చేశారు. యువ అధికారులు దేశ సేవకు అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
-
జాతర కోసం భద్రతా ఏర్పాట్ల పరిశీలన
HYD: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర కోసం నిఘాను పెంచాల్సిన అవసరం ఉందని స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వారావు సూచించారు. అదనపు డీసీపీ ఏసీపీ రాంరెడ్డి, ఏసీపీ రామలింగరాజు, ఇన్‌స్పెక్టర్ల నాగేష్, సీతయ్య తదితరులతో కలిసి ఆమె దేవాలయంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అలాగే దేవాలయం చుట్టు పక్కల నుంచి కర్బలమైదాన్ తదితర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
-
డెస్టినేషన్ డైనింగ్‌పై కుర్రకారు మొగ్గు
HYD: నగరవాసుల్లో కొందరు వారం వారం ఏదో ఒక రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడి రుచులను ఇష్టంగా ఆరగిస్తుంటారు. రోజువారీ పని ఒత్తిడి నుంచి ఉపశమనంగా ఫుడ్ మీటప్ గ్రూప్స్, ఫుడీస్ క్లబ్‌లో చేరి తమ అభిరుచులను కొనసాగిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా డెస్టినేషన్ డైనింగ్ ప్రాచుర్యం పొందుతోంది. సిటీ నుంచి కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడి రుచులను ఆస్వాదిస్తున్నారు. పనిలో పనిగా అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించి, సంస్కృతులను తెలుసుకుని మరుపురాని అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు.
-
కొత్త ట్రెండ్‌గా మారుతున్న స్ట్రేంజర్స్ మీట్స్
విశాఖ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ‘స్ట్రేంజర్స్ మీట్స్’కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. కొత్తవారితో మమేకమవడానికి, మనసును ఆహ్లాదపరుచుకోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోడానికి ఇవి వేదికలవుతున్నాయి. ఇందులో పాల్గొనేవాళ్లంతా ఒకరికి ఒకరు తెలియని వారే. వివిధ సంస్థలు వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా వేదికలుగా ఈ మీట్స్‌ను ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తున్నాయనేది ముందుగా ప్రకటిస్తున్నాయి. ఆ ప్రకటనల ఆధారంగా ఆసక్తి ఉన్నవారు కొంత సొమ్ము చెల్లించి పేర్లు నమోదు చేసుకుంటున్నారు.