HYD: ఇటీవల కాలంలో పక్షులను పెంచుకోవడంలో నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. పిచ్చుకలు, రామచిలుకలు తదితర పక్షులను ఇంట్లో పెంచుకుని వాటితో సమయాన్ని గడిపేస్తున్నారు. పెంపుడు జంతువులకు మనసు ఉంటుందని, భావోద్వేగాలు వ్యక్తమవుతాయని జోవన్నా బర్గర్ రాసిన ది ప్యారట్ హూ ఓన్స్ మీది స్టోరీ ఆఫ్ ఏ రిలేషన్‌షిప్ అధ్యయనంలో తెలిపారు.
Locations: Hyderabad
-
‘విధుల్లో అప్రమత్తంగా ఉండాలి’
రంగారెడ్డి: విధుల్లో అప్రమత్తంగా ఉండాలని శంషాబాద్ జోన్ డీసీపీ బి.రాజేశ్ అన్నారు. గత నెల 24న హెడ్‌కానిస్టేబుల్ డి.విజయ్ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని జోన్ పోలీసు సిబ్బంది రూ.15 లక్షలు జమ చేశారు. శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులకు డీసీపీ చెక్కు అందజేశారు.
-
వెలికితీత పనులు తిరిగి ప్రారంభం
HYD: గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌లో జాంసింగ్ వేంకటేశ్వరస్వామి మెట్లబావి వెలికితీత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిధులు లేక ఏడాదిన్నరగా నిలిచిపోయిన ప్రక్రియ ప్రస్తుతం తెరపైకి వచ్చింది. బావిని వెలికితీసేందుకు రూ.40లక్షలు మంజూరు చేశారు. ఆగస్టులో గ్రేటర్ అధికారులు పనులు చేపట్టి దాదాపు 40 అడుగుల లోతులో బావిని కనుక్కొన్నారు.
-
ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా స్నాతకోత్సవం
మేడ్చల్: గుండ్లపోచంపల్లిలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. కళాశాల కార్యదర్శి జె. త్రిశూల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యా ప్రయాణం ఇక్కడితోటే ఆగకూడదని పై చదువులు చదవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థుల భవిష్యత్తు మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ జె.నర్సింహారెడ్డి, కార్యదర్శి జె.త్రిశూల్‌రెడ్డి, కోశాధికారి జె త్రిలోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని యువకుడు మృతి
మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని బాసురేగడి గ్రామంలో గుర్తు తెలియని యువకుడు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో యువకుడు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు యువకుడిని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
-
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు
మేడ్చల్: ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముడిచింతలపల్లి మండలంలోని పోతారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు పోశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయన్నారు. ఈకార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
-
హైదరాబాద్‌కు హాలీవుడ్, బాలీవుడ్ రావాలి: సీఎం రేవంత్
సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో.. ‘‘హాలీవుడ్ అంటే అమెరికా, బాలీవుడ్ అంటే ముంబై అంటారు. ఆ రెండింటినీ హైదరాబాద్‌కు తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు సినీ పరిశ్రమకు అన్ని విషయాల్లో అండగా ఉంటాం. రైజింగ్ తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్‌లో చిత్ర పరిశ్రమకూ ఒక చాప్టర్ పెడతాం’’ అని తెలిపారు.
-
కూచిపూడి నృత్య ప్రదర్శన
మేడ్చల్: ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డాన్స్ టీచర్ శ్రావణి ప్రియా శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో మహా గణపతి, కొలువైతివారంగా సాయి, చక్కని తల్లికి, మాధవ కేశవా, జతిస్వరం, మండూక శబ్దం, రామాయణం నృత్య రూపకం అంశాలను కొందరు ప్రదర్శించి మెప్పించారు. ప్రముఖ నాట్య గురువర్యులు కళానిపుణ రవి కూచిపూడి విచ్చేసి కళాకారులను అభినందించారు.
-
మంగ్లీపై దుష్ప్రచారం సరికాదు
HYD: లాలాగూడ రైల్వే క్యారేజ్ వర్క్‌షాప్ సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ కోశాధికారి భుక్యా శ్యామ్ రావు జానపద గాయని మంగ్లీపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంజారా యువతిగా ఆమె ఎదుగుదలను ఓర్చలేని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. -
పిస్తా హౌస్ ప్రారంభోత్సవం
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలో పిస్తా హౌస్‌ను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వజ్రేష్ యాదవ్ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గం అన్ని విధాలుగా వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.