
Locations: Hyderabad
-
యువకుడు అదృశ్యం
HYD: ఆరోగ్య పరీక్షల నిమిత్తం బోయిన్‌పల్లిలోని NIEPD అండ్ NIMH హాస్పిటల్‌కు తీసుకువచ్చిన సైదాబాద్ బాలుర వసతి గృహంకు చెందిన పంకజ్(19) అదృశ్యమయ్యాడు. వసతిగృహం సూపర్ వైజర్ రాసూరి కిరణ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికీ ఆచూకీ లభించలేదని పత్రికా ప్రకటనలో వెల్లడించామని కార్ఖాన ఎస్ఐ నరేష్ తెలిపారు. ఫోటోలోని వ్యక్తిని గుర్తించినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఉచిత శిక్షణకు ఆహ్వానం
HYD: OU సివిల్ సర్వీసెస్ అకాడమీలో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఓయూలో చదువుతున్న విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ (ప్రిలిమ్స్), గ్రూప్-1, 2తో పాటు ఇతర పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
-
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్-సాగర్ రింగురోడ్డు వద్ద విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో భారీగా మంటలు చెలరేగి ఇద్దరు సజీవదహనం అయ్యారు. అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
‘టెంకాయ తలసాని’.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు!
HYD: సనత్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ‘‘సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది’ అని బేగంపేట్ పాటిగడ్డలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సొమ్ముతో శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు చేయిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, తాము చేపిస్తున్నామని టెంకాయ తలసాని చెప్తున్నాడని వ్యంగంగా ఫ్లెక్సీపై రాసుకొచ్చారు.
-
‘ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలి’
HYD: ఆషాఢ మాస బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆషాడ మాస బోనాల కోసం దేవాలయాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని దేవాలయాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.
-
జూదం ఆడుతున్న 12 మంది అరెస్ట్
మేడ్చల్: పెట్ బషీరాబాద్ పోలీసులు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరయంజాల్‌లో సాయి గీత ఆశ్రమం వద్ద జూదం ఆడుతున్నారన పక్క సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులో మొత్తం 6 నాణ్యాలతో పాటు రూ.1,78 వేల నగదు, 16 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
‘పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తా’
మేడ్చల్: మేడ్చల్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ పీసరి మహిపాల్ రెడ్డి కలిశారు. టీపీసీసీ కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మహిపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
ఘనంగా చేగువేరా జయంతి కార్యక్రమం
మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏఐఎస్‌ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ డిపోలోని జిల్లా కార్యాలయంలో చేగువేరా 97వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. నాయకులు చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి, చిన్నబాబు, ఎండీ అన్వర్, హరీష్, అరవింద్, శశికుమార్, మహేష్, శ్రీహరి, సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్య
HYD: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జనప్రియ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రతీయేట ఆరు బ్రహ్మకమలాలు పూస్తాయి
రంగారెడ్డి: వనస్థలిపురం డివిజన్‌లోని హుడా సాయి నగర్ కాలనీలో సూదం పద్మ సాగర్ ఇంట్లో రెండు బ్రహ్మకమలాలు విరబూశాయి. ఈ సందర్భంగా పద్మ సాగర్ మాట్లాడుతూ.. ప్రతీయేట ఇంట్లో దాదాపు ఆరు బ్రహ్మకమలాలు పూస్తాయని తెలిపారు. అరుదైన ఈ పుష్పం మా ఇంట్లో విరబూయడం ఆనందంగా ఉదన్నారు.