Locations: Hyderabad

  • కాలనీ అసోసియేషన్ సమావేశం

    మేడ్చల్: నాగోల్ డివిజన్‌లోని శ్రీ సాయి నగర్ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన కాలనీ అసోసియేషన్ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీ సభ్యులు డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో, రాత్రిపూట గంజాయి సేవనం వల్ల భయాందోళన, లక్కీ రెస్టారెంట్ వద్ద అక్రమ పార్కింగ్, నీటి కొరత, విద్యుత్ స్తంభాల దెబ్బతినడం వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
  • స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం

    HYD: రహమత్ నగర్ డివిజన్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్ ఆరోగ్య నగర్‌లోని ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ఇంటి పరిసరాలు, కాలనీలలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కాలుష్య నివారణకు పచ్చదనాన్ని పెంచాలన్నారు. 
  • అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి

    HYD: రహమత్ నగర్ డివిజన్‌లోని సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తన కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. బస్తీ నాయకులు స్థానిక సమస్యలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 
  • కార్యకర్తల సమావేశం, జై బాపు జై భీం పాదయాత్ర

    HYD: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ‘జై బాపు జై భీం జై సంవిధాన్’ పాదయాత్ర, కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  మేయర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జీహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అంశాలపై సూచనలు,సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
  • సీఎంఆర్ఎఫ్ ఆర్థిక చేయూత అందిస్తుంది

    HYD: పేదలకు అపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తోందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. గోల్నాక క్యాంపు కార్యాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 35 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.14.90లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  ప్రజలకు ప్రతి ఏటా సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు.

     

  • ఉచిత ఫైబ్రో స్కాన్ క్యాంప్

    HYD: పెరుగుతున్న ఫ్యాటీ లివర్ రోగులను దృష్టి లో పెట్టుకుని చందానగర్ నిత్య గ్యాస్ట్రొ అండ్ లివర్ కేర్ క్లినిక్‌లో ఉచిత ఫైబ్రో స్కాన్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మందికిపైగా పరీక్షలు చేశారు. ఈ ఫైబ్రో స్కాన్ పరీక్ష వల్ల రోగులకు అతితక్కువ సమయంలో అత్యంత ఖచ్చితత్వంతో కాలెయంలో పెరుగుతున్న కొవ్వును కనిపెట్టే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
  • అభివృద్ధి పనుల పరిశీలన

    మేడ్చల్: మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్ జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఓల్డ్ మల్కాజ్‌గిరిలో నూతన బోరెవెల్ పనులను పరిశీలించారు. మారుతినగర్‌లోని ఓపెన్ గ్రౌండ్‌లో పార్క్ అభివృద్ధి, లైబ్రరీ కోసం గది నిర్మాణం, కమ్యూనిటీ హాల్‌లో అదనపుగది కట్టాలని కాలనీ సమాఖ్యతో కలిసి స్థలాన్ని పరిశీలించి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినర్ లక్ష్మణ్ వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. 
  • కార్యకర్తల సమావేశంలో ఘర్షణ

    HYD: ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా బంజారాహిల్స్ లేక్ వ్యూ బంజారాలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ సంగీత హాజరయ్యారు. విజయ రెడ్డి వర్గం మాట్లాడుతుండగా దానం నాగేందర్ మైక్ పెట్టాలని ఆదేశించడంతో వివాదం చెలరేగింది.
  • ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

    మేడ్చల్: జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి డి.కిరణ్ కుమార్ సూచించారు. జిల్లా కోర్టులో ఆయన మాట్లాడుతూ.. జాతీయ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.
  • దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం

    మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాదం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కృష్ణమూర్తి పంతులు, రాజేశ్వర గురు స్వామి, మాజీ కౌన్సిలర్ స్వామి యాదవ్, అనిల్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.