Locations: Hyderabad

  • నటి కల్పికపై మరో కేసు

    HYD: ప్రిజం క్లబ్ వ్యవహారంలో సినీ నటి కల్పికపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే.  ఇన్‌స్టా వేదికగా అసభ్య పదజాలంతో కల్పిక తనని దూషించిందని పేర్కొంటూ కీర్తన అనే యువతి తాజాగా  సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఆధారాలను పోలీసులకు అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

     

     

  • విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి

    HYD: జిల్లాలో విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నాం. ప్రభుత్వ పాఠశాలలు.. అంగన్‌వాడీల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తాం. బస్తీ దవాఖానాల్లో సమయానికి వైద్యులు వచ్చేలా.. మందులు ఉండేలా చర్యలు చేపట్టనున్నాం. నిమ్స్‌ ఆసుపత్రి విస్తరణ.. సనత్‌నగర్‌ టిమ్స్‌ఆసుపత్రి పనులు వేగంగా కొనసాగేలా పర్యవేక్షించనున్నామని హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన దాసరి అన్నారు. నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తన ప్రాధాన్యాలను వివరించారు.

  • ‘జై బాపు జై భీం జై సంవిధాన్’ పాదయాత్ర

    HYD: పాతబస్తీలోని చార్మినార్ నుంచి మదీన ఎక్స్ రోడ్ వరకు ‘జై బాపు జై భీం జై సంవిధాన్’ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో స్థానికంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
  • సమస్యను పరిష్కరిస్తానని హామీ

    మేడ్చల్: సైనిక్‌పూరిలోని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని స్నేహ మిత్ర డైవర్స్ అసోసియేషన్ సభ్యులు కశారు. అనంతరం ఆయనతో మాట్లాడుతూ.. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద 17ఏళ్లుగా ఆటో, వ్యాన్‌లలో పిల్లలను తీసుకెళ్తున్నామని, ఈఏడాది నుంచి స్కూల్ యాజమాన్యం తమ బస్సుల్లోనే రావాలంటూ ఒత్తిడి చేస్తోందని వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే స్పందించి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
  • ‘అంటు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి’

    HYD: వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్​సృజన ఆదేశించారు. నగర ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికెన్​గున్యా వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమలను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తూ జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఉత్తర్వులు జారీ చేశారు.

  • ‘నాలాల పూడికతీత ప‌‌‌‌నులు త్వరగా పూర్తి ​చేయాలి’

    HYD: నాలాల్లో పేరుకుపోయిన చెత్త తొల‌‌‌‌గింపు ప‌‌‌‌నులు త్వరగా పూర్తి ​చేయాలని హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగ‌‌‌‌నాథ్  అధికారులను ఆదేశించారు. నాలాల్లో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలని, నాలా ఆక్రమ‌‌‌‌ణ‌‌‌‌లుంటే తొల‌‌‌‌గించాల‌‌‌‌న్నారు. చింత‌‌‌‌ల్‌‌‌‌బ‌‌‌‌స్తీ మీదుగా సాగే బుల్కాపూర్ నాలా విస్తర‌‌‌‌ణ ప‌‌‌‌నుల‌‌‌‌ను ఆయన ప‌‌‌‌రిశీలించారు. చింత‌‌‌‌ల‌‌‌‌బ‌‌‌‌స్తీలో మూడ్రోజుల క్రితం తొలగించిన నాలా ఆక్రమణల కింద భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించాలన్నారు.

  • ‘భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి’

    HYD: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జులై 1న అమ్మవారి కల్యాణం, 2న రథోత్సవం ఉండడంతో ఏర్పాట్లపై ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

  • దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఆకట్టుకున్న ఎయిర్‌ షో

    హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ ఘనంగా సాగింది. ముఖ్య అతిథిగా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ హాజరయ్యారు. వైమానిక దళంలోని వివిధ విభాగాల్లో  ప్రీ-కమిషనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్‌లు ఇందులో పాల్గొన్నారు. పరేడ్‌ సందర్భంగా విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

  • గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

    HYD: కెపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని అడ్డగుట్ట సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి లోకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మహారాష్ట్ర పర్వానీ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు లోకేష్ వెల్లడించాడు. అతడి వద్ద నుంచి 1.5 కేజీ ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. 
  • బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్

    HYD: పాతబస్తీ లాల్ దర్వాజా ఫూల్బాగ్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో అనుభవజ్ఞులైన వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. స్థానిక ప్రజలకు ఆరోగ్య సేవలను అందించేందుకు బిగ్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది.