Locations: Hyderabad

  • వన మహోత్సవంలో జీహెచ్ఎంసీ

    HYD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవానికి జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులు, సెంట్రల్ మీడియన్స్, ఖాళీస్థలాలు, కాలనీ పార్కుల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అత్యధికంగా కూకట్‌పల్లి జోన్ పరిధిలో 6.25లక్షలు, శేరిలింగంపల్లిలో 6లక్షలు, ఎల్బీనగర్ 4.53 లక్షలు, చార్మినార్‌లో 3.24 లక్షలు, సికింద్రాబాద్ 3లక్షలు, ఖైరతాబాద్‌లో 2.5లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన మొక్కలను జీహెచ్ఎంసీ నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి.

     

  • ప్యారడైజ్‌ ఫ్లైఓవర్‌పై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

    HYD: సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ ఫ్లైఓవర్‌ పైకి వేగంగా దూసుకెళ్లిన ఇన్నోవా కారు  డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు డివైడర్‌పైకి దూసుకొచ్చి ఆగి ఉన్న ఇన్నోవాను ఢీకొట్టింది. కార్లలోని ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. రెండు కార్లు ఢీకొనడంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రమాదానికి గురైన రెండు కార్లను తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు.

  • ఆ ఏరియాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత

    HYD:ఆజామాబాద్‌ డివిజన్‌, హైదరాబాద్‌ సిటి-1 పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్‌ తెలిపారు. టూరిస్ట్‌ హోటల్‌ 11కేవీ విద్యుత్‌‌ఫీడర్ పరిధిలో ఉదయం 10నుంచి 11 వరకు,భోలక్‌పూర్‌ పరిధిలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, రెడ్‌రోజ్‌ పరిధిలో ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు,ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పరిధిలో ఉదయం 10.30నుంచి 11గంటల వరకు కరెంట్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోందన్నారు.

  • శ్రీగంధం చెట్ల నరికివేత..నలుగురు అరెస్ట్

    HYD: శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను నరికి బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే పార్థీ గ్యాంగ్‌ కన్ను నగరంపై పడింది. 23 మందితో కూడిన గ్యాంగ్‌ సభ్యులు 20 రోజుల క్రితం నగరానికి వచ్చి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిమ్స్‌మేతో పాటు జూబ్లీహిల్స్‌లో ఓ ఇంట్లో పెంచుకుంటున్న గంధపు చెట్లను నరికేశారు. వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకొని పారిపోతుండగా జూబ్లీహిల్స్‌ పోలీసులు నలుగురు మహిళలను అదుపులో తీసుకున్నారు.

  • భారీగా తగ్గిన చికెన్ ధరలు

    HYDలోని చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్. మార్కెట్‌లో చికెన్‌ ధరలు భారీగా తగ్గాయి. గత వారం కిలో మాంసం రూ.250 వరకు పలికింది. శనివారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. విత్‌ స్కిన్‌ KG రూ.173, స్కిన్‌లెస్‌ KG రూ.196గా నిర్ణయించారు. నగరంలోని హోల్‌సేల్‌ షాపులు, రిటైల్‌ షాపుల్లో నిర్ణయించిన ధరకు రూ.5నుంచి రూ.10వరకు వ్యత్యాసం ఉంటుంది. దుకాణాల్లో డజన్‌ గుడ్లు రూ.72 చొప్పున విక్రయిస్తున్నారు.

  • కేటీఆర్‌పై కేసు నమోదు

    TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • పబ్‌లపై ఎస్‌ఓటీ దాడులు.. గంజాయి పట్టివేత

    HYD: గచ్చిబౌలిలోని పబ్‌లపై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. SLN టెర్మినల్ మాల్‌లో ఉన్న పబ్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నలుగురు వ్యక్తులు గంజాయి సేవించినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.

     

  • OU పరిధి వివిధ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారు

    HYD : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొ.శశికాంత్‌ తెలిపారు. మాస్టర్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఆర్‌,ఐడీ) మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌, ఎంఈడీ మొదటి, మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)(ఐడీ,ఐ,డీ,హెచ్‌ఐ,ఏఎస్టీ) మూడు సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలను ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

     

  • క్యాండిల్ ర్యాలీ

    మేడ్చల్: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి క్యాండిల్ ర్యాలీలో కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు. అనంతరం మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

  • బార్లకు లాటరీ ప్రక్రియ పూర్తి.. జీహెచ్ఎంసీ పరిధిలో అధిక స్పందన

    HYD: తెలంగాణ రాష్ట్రంలో 28 కొత్త బార్లకు గాను ఆబ్కారీ శాఖ లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసింది. నార్సింగ్‌లోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని నాలుగు బార్లకు మరో 148 దరఖాస్తులు అందాయి. మొత్తం 28 బార్లకు 3,668 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.