Locations: Hyderabad

  • బైక్‌ను ఢీకొట్టిన ట్రక్‌.. యువకుడి మృతి

    మేడ్చల్‌: మద్యం మత్తుతో డ్రైవింగ్‌ చేసిన ట్రక్‌ డ్రైవర్‌ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. ఈ ఘటన మేడ్చల్ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఉమానగర్‌లో ఉండే ఉచిత రాంకిషోర్‌(29) విధులకు వెళ్లేందుకు బైక్‌పై వెళ్లగా కిష్టాపూర్‌ రోడ్డులోని ప్రశాంతి వెంచర్‌ వద్ద ట్రక్‌ను తాగిన మత్తులో వాల్మీకి బాలరాజు(26) అజాగ్రత్తగా డ్రైవింగ్‌ చేస్తూ బైక్‌ను ఢీకొట్టగా రాంకిషోర్‌ మృతి చెందాడు.

  • ‘డ్రైనేజీ నీటిని మాణిక్య రెడ్డి కాలనీలోకి కలపొద్దు’

    మేడ్చల్: గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఊర్జిత 2 పక్కన ఉన్న అపార్ట్‌మెంట్ నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని మాణిక్యరెడ్డి కాలనీలోకి కలపొద్దని కోరుతూ కాలనీవాసులు గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో లక్ష్మీ నగర్ కాలనీలోని ఇండ్ల డ్రైనేజీని కలిపారని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్‌కు హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నప్పుడు సెప్టిక్ ట్యాకును నిర్మించుకోవాలన్నారు.

  • కిక్ బాక్సింగ్ పోటీలు

    మేడ్చల్: కూకట్పల్లిలోని లులు మాల్‌లో జ‌రుగుతున్న కిక్ బాక్సింగ్ పోటీలను టీపీపీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పట్టి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ హాజరై ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడ‌ల‌కు ప్రాధాన్యత ఇస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అందుకోసం నిధులు కూడా కేటాయిస్తుంద‌ని చెప్పారు. క్రీడ‌ల వ‌ల్ల శారీకంగా ఆరోగ్యంతో పాటు మాన‌సికంగా ఉల్లాసం ల‌భిస్తుంద‌ని తెలిపారు.

  • బొల్లారం హాస్పిటల్‌లో రక్తదాన శిబిరం

    HYD: ప్రపంచ రక్తదాన దినోత్సవంలో భాగంగా బొల్లారంలోని కంటోన్మెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జనరల్ హాస్పిటల్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బోర్డు సీఈవో మధుకర్ నాయక్ హాజరై రక్తదాన అవశ్యకతను గురించి వివరించారు. శనివారం కూడా ఈ శిబిరాన్ని ఇక్కడే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

  • ఎండు గంజాయి.. ఐదుగురు అరెస్ట్

    మేడ్చల్: ఘాట్కేసర్ ఎక్సైజ్ పీఎస్ పరిధి చెంగిచెర్ల చెరువు సమీపంలో ఎండు గంజాయితో ఐదుగురు వ్యక్తులు పట్టుపడ్డారు. పట్టుపడిన వారిలో వేముల జాన్ బనియన్, మోహన్ వెంకట్, మనీష్ ఉద్యాయ్, జూపల్లి రవితేజ, దాసరి విశాల్ ఉన్నారు. నిందితుల నుంచి 10 కిలోల, 400 గ్రాములు పొడి గంజాయి, కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కి పోలీసులు తరలించారు.

  • ఆసియా కప్ పోటీలకు సీతాఫల్‌మండి యువతి

    HYD: సీతాఫల్‌మండికి చెందిన సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి చేపుర్వ ప్రవళిక ఆసియా కప్ పోటీలకు ఎంపికైంది. చైనాలో నిర్వహించే పోటీలకు తెలంగాణా రాష్టం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా సీతఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రవళికను సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఘనంగా సన్మానించారు.

  • డ్రగ్స్ సరఫరా.. ఇద్దరు నైజీరియన్స్ అరెస్ట్

    హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు నైజీరియన్లు, ముగ్గురు భారత డ్రగ్ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 గ్రాముల కొకైన్, 45 గ్రాముల MDMA, 20 గ్రాములు ఎక్స్టసీ మాత్రలు, రూ.40వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • గుర్తు తెలియని మృతదేహం లభ్యం

    HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 6,  7 ప్లాట్ ఫారాల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు అనారోగ్యంతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఎత్తు 5.5అడుగులు, నలుపు ప్యాంట్, కాకి టీ షర్ట్, బూడిద స్వెట్టర్ ధరించి ఉన్నాడని, ఎడమ ఛాతిపైన SAKSHITHA అని పచ్చ బొట్టు ఉన్నట్లు సీఐ సాయీశ్వర్ గౌడ్ తెలిపారు.

  • వినియోగదారుల వేదిక విజయవంతం

    HYD: బోయిన్‌పల్లి విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో జరిగిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో 21మంది వినియోగదారులు పాల్గొని లూజ్ లైన్స్, పోల్ డ్యామేజ్, HT ఫ్లాగింగ్ బిల్లింగ్, లోడ్ డేరేషన్ తదితర సమస్యలను అధికారులకు నివేదించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఛైర్‌పర్సన్, టెక్నికల్ సిబ్బంది పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు.

  • బడిబాట కార్యక్రమం

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు 127 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి. శివ కుమార్ ఆధ్వర్యంలో గురుమూర్తి నగర్ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాల ఏ మాత్రం తక్కువ కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.