మేడ్చల్: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం మిక్కిలినేని మను చౌదరి జిల్లా కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు వేదోచ్చరణ మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
Locations: Hyderabad
-
సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం
మేడ్చల్: ప్రగతి నగర్‌లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పాల్గొన్నారు. కొత్తగా చేరిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఎంతోమంది మేధావులు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉన్నత స్థానాలను అధిరోహించారు. ప్రభుత్వ పాఠశాలలను చిన్నగా చూడకుండా, తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
-
‘బీసీ జాబితాలో చేర్చాలి’
మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాల వారిని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని ఖైరతాబాద్‌లోని బీసీ కమిషనర్ ఆఫీస్‌లో కమిషనర్‌కు కూకుట్‌పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, నాగేంద్ర, కలిగినీడి ప్రసాద్, అడబాల షణ్ముఖ, పుష్పలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
-
‘వెంటనే పనులు ప్రారంభించాలి’
మేడ్చల్: రామంతపూర్ డివిజన్‌లో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయని వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు కలిసి వినతిపత్రం అందజేశారు. సీసీ రోడ్డు పనులు ఈద్గా నుంచి మార్కండేయ స్వామి గుడి వరకు, నెహ్రు నగర్‌లో స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను మంజూరు చేయాలని కోరారు.
-
‘పేదలకు అండదండగా కాంగ్రెస్ పార్టీ’
మేడ్చల్: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ముస్లీం మైనార్టీ సోదరీలకు సుమారు 200 మందికి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ హాజరై లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండ దండగా ఉంటుందని తెలిపారు.
-
సీఎంను కలిసిన గుర్రం మల్సూర్
HYD: కొత్తగా సీఎం సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా నియమితులైన గుర్రం మల్సూర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
-
‘కుల ధ్రువీకరణ పత్రాలు జాప్యం లేకుండా జారీ చేయాలి’
HYD: విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జాప్యం లేకుండా జారీ చేయాలని కోరుతూ జై భీమ్ మాల మహా సంఘం అధ్యక్షుడు ఆర్. మల్లేష్ ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు మారేడ్‌పల్లి తహసీల్దార్ భీమయ్య గౌడ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసన్న లక్ష్మి, కేపీ రమాదేవి, నర్సింగ్, అమర్, సత్యనారాయణ, భారతి, పాల్గొన్నారు.
-
విజయ డెయిరీలో స్వల్ప ప్రమాదం
HYD: సికింద్రాబాద్ లాలాపేట్‌లోని విజయ డెయిరీలో స్వల్ప ప్రమాదం సంభవించింది. బాదాం మిల్క్ కుక్కర్ ఎయిర్ పోకముందే తెరవడంతో అది గాల్లోకి ఎగిరి ప్రమాదం జరిగింది. దీంతో ఆపరేటర్ రవికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళ సహా మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.
-
డిప్యూటీ సీఎంను కలిసిన నవీన్ మిట్టల్
HYD: విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామితులైన నవీన్ మిట్టల్ శుక్రవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.
-
ఫ్యాషన్ ప్రదర్శన..పాల్గొన్న మేయర్
HYD: మహిళలు జనాభాలో సగం వారు పాలన, ప్రజా జీవితంలోనూ నాయకత్వం వహించేందుకు పోత్సహించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌లో ఓ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రదర్శనను వీక్షించారు.