Locations: Hyderabad

  • ఎమ్మెల్యేకు పరామర్శ

    మేడ్చల్: సోమాజిగూడ యశోధ హాస్పిటల్‌లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సతీమణి నీలిమను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్వరగా కోలుకుని జనజీవనంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

  • మైసమ్మ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

    మేడ్చల్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని గత నాలుగు రోజుల నుంచి ప్రతి డివిజన్‌లోని అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మూసాపేట్ డివిజన్‌లోని మైసమ్మ చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు వద్ద నాలా నిర్మాణం చేసేటప్పుడు రిటర్నింగ్ వాల్ ఎత్తు పెంచి దానిమీద బ్రిడ్జి నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు.

  • సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

    HYD: నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసుకున్నానని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అధికారులతో కలసి బేగంపేట్ డివిజన్‌లో పర్యటించిన ఆయన రూ.76లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.48లక్షలతో స్విమ్మింగ్ పూల్ షెడ్ నిర్మాణంతో పాటు ఎస్ఎస్ ఫ్లోరింగ్, పెయింటింగ్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానని చెప్పారు.

  • హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. రోడ్లు జలమయం

    HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాలపై వెళ్తున్న ప్రయాణికులు, వాహనదారులు తడిసి ముద్దయ్యారు. నగరంలోని బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌ బజార్‌, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వరద చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

  • ఉప్పల్‌లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

    మేడ్చల్: పీర్జాదిగూడలోని ఉప్పల్ బస్ డిపో వద్ద ఉప్పల్ ఆర్టీఏ మోటార్ వెహికిల్ ఇన్స్‌స్పెక్టర్ రవిందర్ రెడ్డి అధ్వర్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్కూల్ బస్సులు, వ్యాన్‌ల ఫిట్‌నెస్, వాటి వాలిడిటీ, డ్రైవర్ అర్హత కలిగిన వారేన, ట్రాన్స్‌పోర్ట్ వాహనమేనా అని చెక్ చేశారు. రెండు రోజుల పాటు జరిగిన తనిఖీలో సుమారు 45 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

  • ఉప్పల శ్రీనివాస్‌కు సన్మానం

    మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడిన సందర్భంగా ఉప్పల శ్రీనివాస్‌ను ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉప్పల శ్రీనివాస్ టూరిజం ఛైర్మన్ అనేక సేవలు అందించారని, ప్రజా సమస్యలపై సేవలు అందిస్తూ.. యూఎస్‌జీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల వివాహానికి ఆర్థికంగా తోడ్పడుతున్నారని తెలిపారు.

  • ఆ ఏరియాల్లో విద్యుత్ సరఫరా బంద్..

    HYD: మరమ్మతులు, చెట్ల కొమ్మల కత్తరింపులో భాగంగా శనివారం బోయిన్‌పల్లి సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ADE శ్రీకాంత్ తెలిపారు. ఫిరోజ్‌గూడ ఫీడర్ పరిధిలో 3గంటల పాటు ఉదయం 9.30 నుంచి 12.30, అదే విధంగా బీబీఆర్ హాస్పిటల్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

  • ‘ఆపరేషన్ సిందూర్’ సైనికులకు సన్మానం

    HYD: భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు సైనికులు రవిప్రకాష్, చంద్రలను జనరల్ బజార్‌లోని డేల్ స్కూల్ యాజమాన్యం శుక్రవారం ఘనంగా సన్మానించింది. దేశ రక్షణ కోసం సైనికులు ప్రాణాలను సైతం పణంగా పెడతారని స్కూల్ భాగస్వామి ఎస్. బాలరాజు అన్నారు. సైనికుల దేశభక్తిని విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

  • బల్కంపేట ఎల్లమ్మ మహోత్సవ సమన్వ సమావేశం

    HYD: జూలై1న బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ కళ్యాణ మహోత్సవం, జూలై2న రథోత్సవం జరగనున్నట్లు మహోత్సవ సమన్వ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రతి ఏటా జరుగినట్లే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందన్నారు. కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలు మూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలో భక్తులు వస్తారని పేర్కొన్నారు.

  • ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ మెస్ మూసివేత

    HYD: తార్నాకలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ మెస్‌ను గత రెండు రోజులుగా మూసివేశారని విద్యార్థులు తెలిపారు. నిజాం కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించగా నిధుల కొరత కారణంగా మెస్ మూసివేసినట్లు పేర్కొన్నారు. ఈ కళాశాల అటానమస్ కలిగిన కళాశాల అని, OUకి దానికి ఎలాంటి సంబంధం లేదని వీసీ కుమార్ చెబుతున్నారు. 2 రోజులంగా హాస్టల్లో  ఫుడ్ లేక ఆకలితో అలమటిస్తున్నాము’ అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.