Locations: Hyderabad

  • ఆ ఏరియాల్లో.. విద్యుత్‌ సరఫరా బంద్!

    HYD: మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ADE పరిధిలోని పలుప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌సరఫరాలో అంతరాయం కలుగుతోందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. ఉ.9నుంచి మ. 12గంటల వరకు మున్సిపల్‌ పార్క్‌, హిందూ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. మ. 2నుంచి సా 5గంటల వరకు 11కేవీ జెక్‌ కాలని, గ్రిన్‌ ల్యాండ్స్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.

     

     

  • క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

    మేడ్చల్: వరుసకు సోదరులైన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి మృతి చెందారు. ఈ ఘటన జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. దుర్గాప్రసాద్‌(11), సుబ్రమణ్యం(8) ఆడుకునేందుకు బయటికెళ్లిన తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అరుంధతినగర్‌లోని క్వారీ గుంతల్లో  మృతదేహాలు తేలినట్లు గుర్తించారు.
  • మహిళా స్వయం సహాయక సంఘాలు

    HYD: గ్రేటర్‌ హైదరాబాద్‌, నగర శివారు మున్సిపాలిటీల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళాశక్తి క్యాంటీన్లు, ధాన్యం సేకరణ కేంద్రాలు, విద్యార్థుల యూనిఫాం కుట్టుపని, విద్యుత్‌ బస్సులు, సౌరవిద్యుత్‌ ప్లాంట్లలో మహిళలను భాగస్వాములను చేస్తూ బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక ఎదుగుదలకు మద్దతిస్తోంది. 18ఏళ్ల నుంచి సంఘాల్లో చేర్చాలని స్త్రీ,శిశు సంక్షేమశాఖ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లకు సూచించింది.
  • హైదరాబాద్‌లో పరిస్థితి ఇదీ!

    హైదరాబాద్‌లో గత రాత్రి భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లు అన్ని జలమయం అయ్యాయి. పలుచోట్ల వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయి. అత్యధికంగా ముషీరాబాద్‌లో 41.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హిమాయత్‌నగర్‌లో 36.5, ఓయూలో 33.8, హయత్‌నగర్‌ 32.8, ఉప్పల్‌ 30.5, సరూర్‌నగర్‌, నాంపల్లి 24.3, ఖైరతాబాద్‌ 23.8, మల్కాజిగిరిలో 21.8 మి.మీట్లర్ల వర్షం కురిసింది. వర్ష సూచనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

  • నీటి కాలుష్య నివారణకు జలమండలి చర్యలు

    HYD: హైదరాబాద్‌లో వర్షాకాలంలో నీటి కాలుష్యం నివారణకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. పాత పైపులైన్లలో మురుగు, వ్యర్థాలు కలవడంతో ఫిర్యాదులు వస్తున్నాయి. తవ్వకాల సమయంలో పాడైన భారీ పైపులైన్లను గుర్తించిన జలమండలి ఇవి నీటి వృథా, కలుషిత జలాల సమస్యకు కారణమవుతున్నట్లు తెలిపింది. డ్రైనేజీ, మంచినీటి పైపులైన్లలో లీకేజీల వల్ల మురుగు చేరుతుండటంతో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతోంది.
  • వ్యభిచార ముఠా గుట్టురట్టు

    HYD: బాపూజీ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడిచిన వ్యభిచార ముఠాను బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. సప్తమి గ్రాండ్ హోటల్‌లో అనుమతులు లేకుండా ఓయో రూములు ఏర్పాటు చేసి మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆకస్మిక దాడులు చేపట్టారు. ముగ్గురు నిర్వాహకులు, ఒక విటుడు, ఒక మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తిరుపతి రాజు, ఎస్ఐ నాగేంద్ర బాబు తెలిపారు.
  • చికిత్స పొందుతూ ఒకరి మృతి

    HYD: ఐదు రోజుల క్రితం సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్ వద్ద భర్తతో గొడవపడి అలియాబేగం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన ఆమె తండ్రి మహ్మద్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు తెలిపారు. సీఐ సాయీశ్వర్ గౌడ్ ఆదేశాలతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
  • హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

    హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. హయత్‌నగర్‌, ఉప్పల్‌, కోఠి, తార్నాక, సికింద్రాబాద్‌ బంజారాహిల్స్‌, అమీర్‌పేట, సనత్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

  • అప్రమత్తంగా ఉండండి: GHMC

    TG: GHMC పరిధిలో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉండడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. ఇబ్బందికర పరిస్థితులు వస్తే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ 040- 21111111కి కాల్ చేయాలని ఆమె సూచించారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

     

  • హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం!

    TG: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వ‌ర్షం పడుతుంది. ఘట్‌కేస‌ర్‌, పోచారం, మేడిపల్లి, ఉప్ప‌ల్, బోడుప్పల్, నాచారం, మౌలాలీ, ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్ న‌గ‌ర్ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. కాసేప‌ట్లో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.