Locations: Hyderabad

  • ప్రచార కేంద్రం ఏర్పాటు

    HYD: పన్నులు, నీటి బిల్లుల వసూళ్ల కోసం గురువారం తిరుమలగిరిలోని ఎంజీ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు. శుక్రవారం 7వ వార్డు, తిరుమలగిరి ఆశా ఆఫీసర్స్ కాలనీ, కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించనున్న ప్రచార కేంద్రాన్ని సందర్శించి, బకాయి బిల్లులు చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

  • గద్దర్ అవార్డ్స్ వేడుక.. దిల్ రాజు ఏమన్నారంటే?

    హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో గురువారం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. 14 ఏళ్ళ తరువాత గద్దర్ అవార్డ్స్ జరుగుతున్నాయి. ఈనెల 14న సా.6గంటలకు అవార్డ్స్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అవార్డు గ్రహీతలకు ఇన్విటేషన్స్ పంపించాము. అందరూ తప్పకుండా గదర అవార్డ్స్ ఫంక్షన్‌కు వచ్చి విజయవంతం చేయండి’’ అని దిల్ రాజు వెల్లడించారు.

  • ‘విద్యతోనే విజ్ఞానం’

    HYD: బడిబాట కార్యక్రమంలో భాగంగా తుకారంగేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం జరిగిన కార్యక్రమంలో అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు నోట్ బుక్స్, యూనిఫారాలను పంపిణీ చేశారు.  ఆమె మాట్లాడుతూ.. విద్యతో విజ్ఞానం, క్రమశిక్షణ ఉన్నత శిఖరాలకు నిచ్చెనలుగా తోడ్పడతాయని విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.

  • భారీగా ఏండీఏంఏ డ్రగ్‌‌ పట్టివేత

    మేడ్చల్: ఉప్పల్ ఎక్సైజ్ పీఎస్ పరిధి బండ్లగూడలో ఏండీఏంఏ డ్రగ్‌‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో వెంకట్ మోహిత్ కుమార్(26) అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 22.3గ్రాముల ఏండిఏంఏ డ్రగ్, బైక్, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • భోజన వర్క్ షాప్ నిర్వహణ

    మేడ్చల్: పాఠశాలల పునఃప్రారంభం అయిన సందర్భంగా అత్వెల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర తెలిపారు. ఈ కార్యక్రమంలో మాణిక్యాలరావు, గడప నవీన్, రాంబాబు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

    మేడ్చల్: క్వారీ గుంతలోని నీటిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని సీఆర్‌పీఎఫ్ అరుంధతి నగర్‌లో చోటుచేసుకుంది. సరదాగా ఆడుకుంటూ దుర్గాప్రసాద్ (11), సుబ్రహ్మణ్యం (8) అరుంధతి నగర్‌లో ఉన్న బండబావి దగ్గర ఉన్న క్వారీలో పడి మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలు వెలికి తీసి, గాంధీ హాస్పిటల్ తరలించారు.

  • ఎమ్మెల్యేను ప్రశంసించిన మాజీ ఎమ్మెల్యే

    HYD: సితాఫల్‌మండిలోని సెట్విన్ కేంద్రం కార్యకలాపాలు ఆదర్శంగా నిలుస్తాయని, యువతకు ఉపాధిని కల్పించేందుకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సితాఫల్‌మండిలోని సెట్విన్ కేంద్రాన్ని మల్లయ్య యాదవ్ గురువారం సందర్శించి పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. రాష్ట్రంలోనే సికింద్రాబాద్ సెట్విన్‌మోడల్‌గా నిలిచేలా ఏర్పాట్లు జరిగాయని ఆయన ప్రశంసించారు.

  • ‘సెల్‌పోన్ ఆటలు వద్దు’

    HYD: సెల్‌పోన్‌లో ఆటలు ఆడోద్దని, మైదానంలో ఆటలతోనే ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం లభిస్తాయని తిరుమలగిరి ఇన్స్‌స్పెక్టర్ నాగరాజు విద్యార్థులకు తెలిపారు. బడుల పునఃప్రారంభం సందర్భంగా తిరుమలగిరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్స్ పల్ ఉమారాణి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీచేశారు. హాజరైన వారికి సైబర్ నేరాలు, పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

  • అధికారులను అడ్డుకున్న ఎమ్మెల్యే

    హైదరాబాద్: అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులను నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎలా కూలగొడతారని అధికారులను ఆయన ప్రశ్నించారు. రెండు రోజులు గడువు ఇవ్వవలసిందిగా అధికారులను కోరగా అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

  • విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేసిన కార్పొరేటర్

    మేడ్చల్: రామంతపూర్ డివిజన్‌లోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.