
Locations: Hyderabad
-
బస్టాప్ వద్ద యువతి అదృశ్యం
HYD: సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాప్ వద్ద రోజా అనే యువతి అదృశ్యమైంది. మెదక్ జిల్లాకు చెందిన నాగేశ్, భార్య లలిత, కోడలు రోజాతో కలిసి JBSకు వెళ్లేందుకు రేతిఫైల్‌కు వచ్చాడు. బస్సు ఎక్కే సమయంలో రోజా కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో నాగేశ్ గోపాలపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. SI వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
స్కూళ్ల రీఓపెన్‌తో నగరంలో సందడి
HYD: నేడు స్కూళ్ల రీఓపెన్ సందర్భంగా హైదరాబాద్ నగరం సందడిగా మారింది. స్కూల్ గేట్లకు ‘WELCOME’ తోరణాలతో స్వాగతం పలికారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడాయి. అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో అక్షింతలు, పూలు చల్లి విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. రెండు నెలల తర్వాత కలిసిన మిత్రులను విద్యార్థులు ఆప్యాయంగా పలకరిస్తూ తరగతి గదుల్లోకి వెళ్లారు. -
పెరిగిన బంగారం ధరలు
బంగారం ధర మరోసారి రూ.లక్ష దాటింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,210 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,08,700 పలుకుతోంది. డాలర్ స్వల్పంగా బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. -
నటి కల్పికపై కేసు నమోదు
నటి కల్పికపై కేసు నమోదైంది. ఇటీవల పిజ్రం పబ్బుకు వెళ్లిన ఆమె.. అక్కడ హల్‌చల్ చేశారు. పబ్బులోని ప్లేట్లను విసిరివేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం వంటివి చేశారు. దీంతో పబ్బు యాజమాన్యం ఆమెపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
VIDEO: HYDలో నదులను తలపించిన రోడ్లు
TG: హైదరాబాద్‌లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో రహదారులు
నదులను తలపించాయి. భారీగా వరద నీరు చేరడంతో ఉదయాన్నే వాహనాదారులు ప్రయాణానికి ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
‘భూభారతి అవగాహన సదస్సులో సమస్యలు పరిష్కరించుకోవాలి’
మేడ్చల్: భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ భూ భారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొని వెంటనే పరిష్కరించుకోవాలని ఘట్కేసర్ తహసీల్దార్ డీఎస్ రజినీ తెలిపారు. ఘట్‌కేసర్ మండల పరిధి మర్రిపల్లిగూడలో జరిగిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఆమె పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ పావని జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ కడపొల్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
-
దారి దోపిడి.. ఐదు లక్షలు దోచుకున్న దుండగులు
మేడ్చల్: పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో దారిదోపిడి జరిగింది. సాయిబాబా కిరాణా షాపు యజమాని దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు గన్ చూపించి బెదిరించి ఆయన వద్ద ఉన్న రూ.5 లక్షల నగదును దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పెట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రపంచ స్నూకర్‌కు వాచ్‌మన్ తనయుడు
ప్రపంచ జూనియర్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు శ్రీకాంత్ బరిలో దిగనున్నాడు. ఈనెల 19 నుంచి 24 వరకు బహ్రెయిన్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన జాతీయ స్నూకర్ టోర్నీలో సత్తాచాటిన 18 ఏళ్ల శ్రీకాంత్‌కు భారత జట్టులో చోటు లభించింది. హైదరాబాద్ ఖాజాగూడలోని తెలంగాణ క్యూ స్పోర్ట్స్ సంఘం వాచ్‌మన్ మురళి, కార్యాలయంలో శుభ్రత పనులు చేసే ఎల్లమ్మ దంపతుల కుమారుడే శ్రీకాంత్.
-
నేడు విద్యుత్‌లో సరఫరాలో అంతరాయం
HYD: చందానగర్ సెక్షన్ పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏపీ ఎన్జీవో కాలనీ, వైశాలినగర్, శారదానగర్ కాలనీల్లో విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మదీనాగూడ మెయిన్ రోడ్డు, ప్రణం హాస్పిటల్ ఏరియా, కృష్ణ కాలనీ, మదీ నాగూడ విలేజ్ సరఫరా నిలిపేస్తారు.
-
కాలనీ సమస్యలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు
HYD: అత్తాపూర్ లక్ష్మీ నగర్ కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. జోనల్ కమీషనర్ వెంకన్నతో కలిసి ఆయన లక్ష్మీనగర్ కాలనీలో పర్యటించారు. దోమల సమస్య, రోడ్డు వెడల్పు, మూసి పరివాహకంలో భవన వ్యర్థాల డంపింగ్ వంటి సమస్యలను ఆర్‌డబ్ల్యూఎస్ ప్రతినిధులు వివరించారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమీషనర్‌లను ఆదేశించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.