Locations: Hyderabad

  • హౌసింగ్‌ బోర్డు ప్లాట్ల వేలంలో భారీ ఆదాయం

    మేడ్చల్: కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు స్థలాలకు ఏర్పాటుచేసిన వేలం పాటలో భారీ స్పందన లభించింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని 7వ ఫేజ్‌లోని 18 ప్లాట్లను వేలం వేయగా అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. 7వ ఫేజ్‌లోని ప్లాట్‌ నంబర్‌ 22ను అత్యధికంగా గజానికి  రూ.2.98లక్షల చొప్పున దక్కించుకున్నారు. మొత్తం 18 ప్లాట్‌లలోని 6,236.33 గజాలకు కలిపి 141 కోట్ల 36 లక్షల 89 వేల 100 రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

  • ALERT: మరో 3 గంటల్లో వర్షం

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మరో 3 గంటలు మోస్తరు నుంచి చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం మీర్‌పేట, బడంగ్‌పేట, బాలాపూర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్ల సూచన పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

  • తెలంగాణ గురుకుల ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు

    మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపల్ అంకుషాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి.అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీలత తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు.

  • ‘తెలుగు భాషను కాపాడుకోవాలి’

    HYD: తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారందరిపై ఉందని, మాతృభాష గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. అబిడ్స్‌లో తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలు-2025, వరిష్ట పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
  • సైబర్‌ నేరగాళ్ల కొత్త రకం మోసం

    HYD: సైబర్‌ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెర లేపారు. ట్రేడింగ్‌పై నమ్మకం పెంచి ఓవిద్యార్థిని నుంచి రూ.1.27 లక్షలు కొట్టేశారు. విద్యార్థినిని జీపీ డిస్కషన్‌ 063 గ్రూపులో యాడ్‌ చేసి, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో ఆమె విడతల వారీగా రూ.1,27,354 చెల్లించింది. చివరికి మోసపోయానని తెలుసుకొని బాధితురాలు సిటీ సైబర్‌‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • బోనాలు, మెహ్రరంలో భక్తులకు పూర్తి వసతులు

    HYD: భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పూర్తి వసతులు కల్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌‌వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. బోనాలు, మెహ్రరం పండుగల సందర్భంగా ఆయన డబీర్‌పుర, లాల్‌ దర్వాజలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి, విద్యుత్‌ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని సూచించారు. భక్తులు పరిశుభ్రత పాటించి, వ్యర్థాలను నిర్దేశిత ప్రదేశాల్లో పారవేయాలని కోరారు.
  • మెడికవర్‌లో రోబోటిక్‌ సర్జరీల విజయం

    రంగారెడ్డి: రోగికి మెరుగైన వైద్య సేవలందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో తమ ఆసుపత్రి ముందుంటుందని మాధాపూర్ మెడికవర్‌ హాస్పిటల్స్‌ సీఎండీ డాక్టర్‌ అనిల్‌ కృష్ణ అన్నారు. ఆసుపత్రిలో ఆరు నెలల్లో 500 రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీలను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  రోగి సంరక్షణే లక్ష్యంగా ఉన్నత ప్రమాణాలతో సేవలందిస్తున్నామన్నారు.

  • ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై చర్యలు

    HYD: సుల్తాన్‌ బజార్‌లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకున్నారు. సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌, జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 14 బృందాలు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించి, బ్యాంక్‌ స్ట్రీట్‌, గోకుల్‌చాట్‌ లేన్‌, సుల్తాన్‌ బజార్‌ ఎక్స్‌ రోడ్డు, జైన్‌ మందిర్‌ లేన్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించిన వ్యాపారులను ఖాళీ చేయించారు.

  • మెట్రోలో చిల్లర కష్టాలతో ప్రయాణికుల ఇబ్బందులు

    HYD: మెట్రోరైలు ఛార్జీల పెంపుతో కొత్తసమస్య నెలకొంది. గతంలో రూ.10, 15, 25, గరిష్ఠంగా రూ.60 వరకు ఛార్జీలు ఉండేవి. రూ.5 నాణేల లభ్యతతో చిల్లర పెద్ద సమస్యగా ఉండేదికాదు. ఇటీవల ఛార్జీలు పెంచి, ధరలు రూ.11, 17, 37, 56 రూ.69కి సవరించారు. దీంతో చిల్లరలేక ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు. నగదు చెల్లించి టికెట్‌ కొనేవారికి చిల్లరసమస్యలు ఎదురవుతున్నాయి. మరుగుదొడ్ల వద్ద  చిల్లరలేక అధికంగా తీసుకుంటున్నారని వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు.

  • ‘పాఠశాల పునఃప్రారంభం పండుగ నిర్ణయించాలి’

    HYD: హైదరాబాద్ జిల్లాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలహై ఈ రోజును పండగలా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జూమ్ సమావేశంలో టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అందించాలని, విద్యార్థుల హాజరును FRS ద్వారా నమోదు చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. పాఠశాలలను సందర్శిస్తానని తెలిపారు.