మేడ్చల్: తూంకుంట మున్సిపల్ కార్యాలయంలో శామీర్‌పేట్ తహశీల్దార్ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. భూ భారతితో భూ సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, ఆర్ఐ రాఘవ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మధుసుధన్ తదితరులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
దైవ దర్శనాలకు ప్రత్యేక బస్సులు
HYD: ప్రసిద్ధ దేవాలయాలకు మియాపూర్-1 డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు డిపో మేనేజర్ మోహన్‌రావు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు మియాపూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయల్దేరి దర్శనాల అనంతరం మరుసటి రోజు రాత్రి 10 గంటలకు మియాపూర్ డిపో చేరుకుంటుందని తెలిపారు. ఇందుకుగానూ ఒక్కొక్కరికి రూ.2000 ఛార్జీ వసూలు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకబస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.
-
అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు రవాణా
మేడ్చల్: అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న డీసీఎంని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి మహారాష్ట్రకు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న డీసీఎంలో నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నారని పక్క సమాచారంతో ఓఆర్‌ఆర్‌పై తనిఖీలు చేసి 1600 కిలోల నకిలీ పత్తి విత్తనాలు బుధవారం పట్టుకున్నారు. డీసీఎంతో పాటు డ్రైవర్ హనుమంతును అదుపులోకి తీసుకుని మేడ్చల్ పోలీసులకు అప్పగించారు.
-
శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్
మేడ్చల్: హబ్సిగూడ డివిజన్ రవీంద్ర నగర్ కాలనీలో వర్షాకాలం ముందస్తు పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ కక్కిరేని చేతన హరీష్ పర్యవేక్షించారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కాలనీలో పేరుకుపోయిన చెత్తచెదారం, చెట్ల కొమ్మలు, కార్మికులతో శుభ్రం చేయించారు. వర్షాకాలంలో వర్షపు నీరుసాఫీగా వరద కాలువలోకి వెళ్లే విధంగా చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు ఏఎమ్‌హెచ్‌ఓ చందిన, కాలనీ అధ్యక్షులు నరసింహా పాల్గొన్నారు.
-
‘ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య’
మేడ్చల్: కీసర మండలంలోని వన్నీగూడ, కీసర, కీసరదాయరలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మండల విద్యాధికారి జమదగ్ని మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడ చేర్పించి ఉజ్వల భవిష్యత్తుకు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ముత్యం,తదితరులు పాల్గొన్నారు.
-
రోటవేటర్ కింద పడి 11ఏళ్ల బాలిక మృతి
రంగారెడ్డి: చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో ఫామ్‌హౌస్ మామిడి తోటలో రోటవేటర్ నడుపుతుండగా 11 ఏళ్ల అక్షిత ప్రమాదవశాత్తు చిక్కుకొని మరణించింది. 6వ తరగతి పూర్తి చేసిన అక్షిత, తన మేనమామ రాజు నడుపుతున్న ట్రాక్టర్‌పై తమ్ముడితో కూర్చుండగా, అదుపు తప్పి కిందపడి రోటవేటర్‌లో చిక్కుకుంది. మృతదేహాన్ని చేవెళ్ల ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
ఎల్లమ్మ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం: ఎమ్మెల్యే
HYD: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని జులై 1న వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆలయ అధికారులు ఆయనను కలిసి ఆహ్వానలేఖ అందజేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని, జూన్ 14న అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్
మేడ్చల్: రామంతపూర్ డివిజన్ ఆర్టీసీ కాలనీలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం 18వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు కార్పొరేటర్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని, వేడుకలను విజయవంతం చేశారు.
-
రొమ్ము క్యాన్సర్‌పై అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ఉపాసన
HYD: ఫ్యూజీఫిల్మ్ ఇండియా ‘త్వరగా గుర్తించండి-త్వరగా పోరాడండి’ నినాదంతో నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన క్యాంపెయిన్‌ను సీఎస్‌ఆర్‌లో భాగంగా ప్రారంభించింది. అపోలో సీఎస్‌ఆర్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి అవగాహన కల్పించడం కీలకమని, సమాచార లోపం, వనరుల కొరత వల్ల మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
-
మంత్రి తుమ్మలను కలిసిన ఇంఛార్జ్
మేడ్చల్: టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులైన కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రమేష్ పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని, కష్టపడి పనిచేసి పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు రమేష్‌కి సూచించారు.