మేడ్చల్: పీర్జాదిగూడలో ఎస్‌ఎన్‌డీపీ పనులను ప్రభుత్వం పునః ప్రారంభించింది. ముఖ్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల వరద నీటి కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్‌ఎన్‌డీపీ పనులు పూర్తి చేసి శాశ్వతంగా పరిష్కరిస్తుందని, గత ప్రభుత్వం ప్రజల కష్టాలను విస్మరించి ఎస్‌ఎన్‌డీపీ పనులను గాలికి వదిలేసిందన్నారు. పనులు తిరిగి ప్రారంభం అవ్వడానికి కృషి చేసిన నేతలకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Locations: Hyderabad
-
డబల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే
HYD: కంటోన్మెంట్ 2వ వార్డు, రసూల్ పురలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఎమ్మార్వో, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించినా కూడా పనులు ఆలస్యమవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
-
గోల్డ్ లోన్ కార్యాలయం ప్రారంభం
మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తన గోల్డ్ లోన్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బీజేపీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి హాజరై ప్రారంభించారు. మాజీ ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. యాజమాన్యానికి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.
-
‘భూ భారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం’
మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపల్ మార్పల్లిగూడెంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, MRO రజిని పాల్గొన్నారు. భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి, అధికారులకు అందజేయాలని రైతులకు సూచించారు. భూ భారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తుందని, రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్లి భూసమస్యలు పరిష్కరిస్తుందన్నారు.
-
బస్ ఛార్జీల పెంపుపై ఏబీవీపీ ధర్నా
మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ బస్ డిపో ఎదురుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఉప్పల్ జిల్లా, నగర శాఖ ఆధ్వర్యంలో బస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. బస్ ఛార్జీల పెంపును రద్దు చేసి, విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఉప్పల్ నగర కార్యదర్శి సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.
-
‘మా ఇళ్లను తొలగించవద్దు’
మేడ్చల్: తూముకుంట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. “మా ఇళ్లను తొలగించవద్దు” అని రాసిన ప్లకార్డులతో బాధితులు హాజరై, తమ నివాసాలను కాపాడాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి, SDC ULC అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్
HYD: డ్రగ్స్ రవాణాపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేసిన్నట్టు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. కేశవరావు, జైరాం అనే ఇద్దరిని అరెస్ట్ చేసిన్నట్టు తెలిపారు. వారి నుంచి 1కోటి 20 లక్షల విలువైన 20 కేజీల హాష్‌ఆయిల్ సీజ్ చేశామని తెలిపారు.
-
‘నాణ్యతలో రాజీ లేకుండా ఇళ్ల నిర్మాణం’
HYD: రసూల్‌పురాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలించారు. ఎమ్‌ఆర్‌ఓ పాండు నాయక్, గృహ నిర్మాణ శాఖ అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించినప్పటికీ పనులు ఆలస్యమవడంపై అసహనం వ్యక్తం చేశారు. నాణ్యతలో రాజీలేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఏఈ మహేష్, ఈఈ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
-
క్యాబ్ డ్రైవర్‌పై దాడికి యత్నం
HYD: ఆసిఫ్‌నగర్‌లో ఈ నెల 8వ తేదీ రాత్రి క్యాబ్ డ్రైవర్‌కు కత్తి చూపి ఫోన్ దోపిడీ చేసిన ఇద్దరు దొంగలను ఆసిఫ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్, మరొకరు మేజర్‌గా ఏసీపీ విజయ్ శ్రీనివాస్ తెలిపారు. వారి నుంచి సెల్‌ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులను రిమాండ్‌కు తరలించారు.
-
మంగ్లీ బర్త్‌డే పార్టీలో సినీ ప్రముఖులు
చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి సింగర్ మంగ్లీ ఇచ్చిన బర్త్‌డే పార్టీలో దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి పార్టీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసులు రిసార్ట్‌పై దాడులు నిర్వహించారు. విదేశీ మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విందులో పాల్గొన్న 48 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు.