HYD: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షాల సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ నాల్గో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ లక్షకోట్లను మింగి ప్రజలపై కోట్ల భారం వేశారన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ప్రకటించి వారికి ధన్యవాదాలు తెలిపారు.
Locations: Hyderabad
-
స్వరూప్‌నగర్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీ
మేడ్చల్: ఉప్పల్ పీఎస్ పరిధిలోని స్వరూప్‌నగర్ కాలనీ రోడ్ నెంబర్.3లో గుర్తుతెలియని దుండగులు రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ప్రశాంత్ ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి ఇంటికి రావడంతో తాళం పగులకొట్టి, ఇంట్లో 20 తులాల బంగారు, 20తులాల వెండి ఆభరణాలు, రూ.20వేల నగదు చోరీ జరిగింది. మరో ఇంట్లో రూ.5వేల నగదు చోరీ అయ్యాయి. రెండు ఇళ్లలో చోరీ జరిగినా ప్రశాంత్ మాత్రమే ఫిర్యాదు చేశాడు.
-
నూతన పాఠశాలను ప్రారంభించిన ఇంఛార్జ్
మేడ్చల్: గాజులరామారం పరిధిలో పీపీ నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ రషీద్ కుమారుడు సయ్యద్ ఇమ్రాన్ నూతనంగా ఏర్పాటు చేసిన ఎఎమ్‌ఎస్ హైస్కూల్‌ను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్‌ఛైర్మన్ లక్ష్మ రెడ్డి, జై రామ్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా స్వామి ఆలయ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, పాల్గొన్నారు.
-
థియేటర్‌లో పాముల కలకలం
HYD: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 35MM థియేటర్ టాయిలెట్ల వద్ద పాములు కలకలం సృష్టిస్తున్నాయి. తరచూ పాములు కనిపించడంతో ప్రేక్షకులు, థియేటర్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. విషయాన్ని యాజమాన్యానికి తెలియజేసినా స్పందించడంలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రజల భద్రతకు సంబంధించి థియేటర్ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
స్వీట్ హౌస్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దేవేందర్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బాలాజీ సీతారాం స్వీట్ హౌస్‌ను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన స్వీట్ హౌస్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో షేక్ జాంగిర్, అనిఫ్ ఫాతీమా, సయ్యద్ ఖాజా మీయ, బోరరాం, కిషోర్, వైష్ణవ్, మహమ్మద్ తౌఫిక్, మహమ్మద్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
-
విద్యుత్ వినియోగదారుల సమావేశం
HYD: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సమావేశం బోయిన్‌పల్లిలోని కార్యాలయంలో నిర్వహించనున్నట్లు డివిజనల్ ఇంజనీర్ గోపాల్ రావు తెలిపారు. శుక్రవారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సమావేశం జరగనుందన్నారు. ఈ సమావేశంలో దీర్ఘకాల సమస్యలు, టెక్నికల్ సమస్యలు, బిల్లులో హెచ్చుతగ్గులు తదితర సమస్యలు అధికారులకు నివేదించాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులకు ఆయన సూచించారు.
-
బర్త్‌డే పార్టీ కోసం వెళ్లి.. యువకుడు మృతి
వికారాబాద్: బషీరాబాద్ మండలానికి చెందని యువకుడు కర్ణాటక సేడం దగ్గర రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. బర్త్‌డే పార్టీ కోసం యువకుడు అతని స్నేహితులతో కలిసి కర్ణాటకకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అక్కడే శవమై కనిపించాడు. వెంట తీసుకెళ్లిన స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
‘సీఎం రేవంత్ నాయకత్వాన్ని మరింత బలపరచాలి’
మేడ్చల్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి మాజీ మేయర్ అమర్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలలో ఒక్కోక్కటిగా అమలు చేస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒక్కటని తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొన్ని సీఎం రేవంత్ నాయకత్వాని మరింత బలపరచాలని అన్నారు.
-
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా కోట నీలిమ
HYD: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కోట నీలిమను బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో సనత్ నగర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బచ్చు రాజ్ కుమార్, హేమంత్ సింగ్ ఠాగూర్, తదితరులు పాల్గొన్నారు.
-
మాంగళ్య షాపింగ్ మాల్ సీజ్
HYD: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్‌ను జీహెచ్‌ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. బహుళ అంతస్తుల భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా మాల్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్ 1955 సెక్షన్ 461(ఏ) కింద ఈ చర్య తీసుకున్నారు. వివరాలు అడిగినప్పటికీ జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. ఈ చర్య స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.