HYD: నగరంలోని బీఆర్‌కే భవన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ప్రయాణీకులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవాలని పోలీసులు పేర్కొన్నారు. బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. ఈక్రమంలో ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో బీఆర్‌కే భవన్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Locations: Hyderabad
-
మెడికల్ షాప్‌పై డ్రగ్ కంట్రోల్ దాడులు
HYD: ముషీరాబాద్ జమిస్తాన్‌పురాలో న్యూ అల్ శిఫ మెడికల్ షాపుపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా షాపు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, రూ.25వేల విలువైన 35 రకాల మందులు, యాంటీబయాటిక్స్, అల్పరోజాలం, అబార్షన్ కిట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు సద్దాం హుస్సేన్‌పై డీసీఏ కేసు నమోదు చేసింది.
-
ఫిలింనగర్‌లో 19ఏళ్ల యువతి అదృశ్యం
HYD: ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీనగర్ బస్తీలో నివసించే వసంత(19) అనే యువతి అదృశ్యమైంది. తల్లిదండ్రులు చంద్రయ్య, రేఖ పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండలేక బాధపడిన వసంత, పనిమీద బయటకు వెళ్తున్నట్లు చిన్నమ్మకు చెప్పి వెళ్లిపోయింది. ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రయ్య అన్న కొడుకు విజయ్‌పై అనుమానం వ్యక్తంచేస్తూ కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు గాలింపు చేపట్టారు.
-
సమీకృత గురుకులాలు.. వేగంగా అడుగులు!
HYD: తెలంగాణలో నాణ్యమైన విద్య, నైపుణ్యాల కోసం ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ఇండియా సమీకృత పాఠశాలల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం స్థలాల ఎంపికపై దృష్టి సారించింది. ఒక్కో పాఠశాలకు రూ.200కోట్లతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 5-25ఎకరాల ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. మహేశ్వరం, షాద్‌నగర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. రెండు, మూడు నెలల్లో 29నియోజకవర్గాల్లో స్థలాల ఎంపిక చేసి శంకుస్థాపన జరుపనున్నట్లు అధికారులు తెలిపారు.
-
కాంగ్రెస్ నాయకురాలు కన్నుమూత
HYD: అడ్డగుట్టకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సులోచన అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారని టీపీసీసీ కేకేసీ సికింద్రాబాద్ డీసీసీ ఛైర్మన్ గంటా రాజు సాగర్ తెలిపారు. కాంగ్రెస్‌కు అంకితభావంతో పనిచేసిన సులోచన, కష్టకాలంలోనూ పార్టీని వీడలేదని, ఆమె లేనిలోటు తీర్చలేనిదని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆదం సంతోష్ సంతాపం తెలిపి, ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
-
ఇకపై హైదరాబాద్‌లో సేఫ్‌గా రోడ్డు దాటొచ్చు
HYD: హైదరాబాద్ నగరంలో పాదచారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ GHMC కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో 86 కొత్త ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదే కాకుండా 500 కొత్త బస్ షెల్టర్లు కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతమున్న 23 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను ప్రకటనలకు వాడుకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈచర్యలు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, పాదచారుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తాయని అధికారులు భావిస్తున్నారు.
-
అత్తను చంపిన అల్లుడు
మేడ్చల్: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటుచేసుకుంది. మైసమ్మ గుట్ట కాలానిలో నివాసం ఉంటున్న బాబురావు(32) ఆర్ధిక ఇబ్బందుల కారణంగా అత్త మందుల బుజ్జి (43) మొబైల్‌ను అమ్మాడు. దీంతో అల్లుడిని అత్త ఎందుకు అమ్మావని ప్రశ్నించడంతో గొడవపడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గొంతు నులిమి హత్య చేశాడు.ఘటన స్థాలాన్నికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కేసీఆర్‌కు మద్దతుగా అడ్డగుట్ట గులాబీ శ్రేణుల ర్యాలీ
HYD: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా అడ్డగుట్టలో బీఆర్ఎస్ కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు బీఆర్‌కే భవన్‌కు భారీగా తరలివచ్చారు. కాళేశ్వరం జల కళతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఆమె పేర్కొన్నారు.
-
26న గోల్కొండ తొలి బోనం
HYD: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఆషాఢ మాసం బోనాల వేడుకలు జూన్ 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జులై 24న ముగుస్తాయని ఆయన తెలిపారు. బోనాల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసిందని, 28ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
-
అక్రమ షెడ్ నేలమట్టం చేసిన హైడ్రా
HYD: బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లోని నాలాను ఆనుకొని ఉన్న అక్రమ షెడ్‌ను హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో నేలమట్టం చేశారు. జలమండలి అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించిన 12 గంటల్లోనే చర్యలు పూర్తయ్యాయి. స్థానికులు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేస్తుండగా, షెడ్ యజమాని మాత్రం నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని ఆరోపించారు.