Locations: Hyderabad

  • మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి పట్టివేత

    రంగారెడ్డి: చేవెళ్లలోని త్రిపురా రిసార్ట్‌లో ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్‌డే సందర్భంగా  స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈపార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని భారీగా విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 48మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా..అందులో 9మంది గంజాయి తీసుకున్నట్లు తేలింది. మంగ్లీతో పాటు రిసార్ట్ నిర్వాహకులపై కేసు నమోదైంది.

     

     

     

  • రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి

    మేడ్చల్: ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని, 36 నెలల లీవ్ ఎన్కాష్మెంట్, ఐదునెలల గ్రాట్యూవిటీ ఇవ్వాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్స్ ఫోరం డిమాండ్ చేసింది. రాంసగర్‌లోని లలితనగన్ కమిటీహాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈసందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు .
  • నేటి నుంచి ఆలయ వార్షికోత్సవం

    HYD: మన్సూరాబాద్ పరిధి సాయినగర్ దుర్గాదేవి ఆలయ 20వ వార్షికోత్సవాలు ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండర్ ఛైర్మన్ పోచబోయిన గణేశ్ యాదవ్ తెలిపారు. 11న కలశాభిషేకం, 12న ఉపచార పూజ, 13 అన్నదానం, లలితాసహస్ర నామ పారాయణం ఉంటాయని పేర్కొన్నారు.

  • వ్యర్థాలతో 14 మెగావాట్ల వెలుగులు

    HYD: చెత్త నిర్వహణలో జీహెచ్‌ఎంసీ మరో అడుగు ముందుకేసింది. యాచారంలో 14 మెగావాట్ల వేస్ట్‌-టు-ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. జపాన్‌ సాంకేతికతతో నిర్మితమయ్యే ఈ ప్లాంట్‌ రోజుకు 700టన్నుల చెత్తను ప్రాసెస్‌ చేస్తుంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుపై భారం తగ్గనుంది. ఏడాదిన్నరలో ప్లాంటు అందుబాటులోకి వస్తుందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. బల్దియాకు ఏటా రూ.25 కోట్ల ఆదా కానున్నట్లు అధికారులు తెలిపారు.

  • ప్రజావాణిలో 203 దరఖాస్తులు

    HYD: మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్‌లో నిర్వ హించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 203 అర్జీలు అందాయి. రెవెన్యూ 45, విద్యుత్ 18, హోం 17, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 45, ఇతర శాఖలకు 37, ఇందిరమ్మ ఇళ్లకు 41 విన్నపాలు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించారు.

  • నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

    HYD: నేడు అయ్యప్ప సొసైటీలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు రుచి టిఫిన్ సెంటర్ సమీపంలో, ప్లాట్ నంబర్ 450–490, చందానాయక్ తండా, బాలాజీ టెంపుల్ లైన్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు. సాయంత్రం 3:30 నుంచి 4:30 వరకు రోడ్ నంబర్ 45–55, సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.
  • సఖి సెంటర్ నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం

    మేడ్చల్: కుత్బుల్లాపూర్‌లోని సూరారం సఖి సెంటర్ నుంచి 16, 17 ఏళ్ల ఇద్దరు అమ్మాయిలు కిటికీ గ్రిల్ తొలగించుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న సెంటర్ నిర్వాహకులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అమ్మాయిల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

  • పెరిగిన బంగారం ధరలు

    HYD: గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 820 పెరిగి రూ.98,400కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు 750 పెరిగి రూ.90,200 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,19,100గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే ధరలున్నాయి.

  • సైబర్‌ నేరగాళ్ల రీఫండ్‌ మాయ

    ఫుడ్‌ డెలివరీ యాప్‌ల్లో ఆర్డర్‌ పెట్టేవారే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. యాప్‌లలో ఆహారం ఆర్డర్‌ పెట్టిన తర్వాత రద్దయిందని నకిలీ సందేశాలు పంపిస్తున్న నేరగాళ్లు.. డబ్బు తిరిగి పొందాలంటే(రీఫండ్‌) బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలంటూ లింకులు పంపిస్తున్నారు. నిజమేనని భావిస్తున్న వినియోగదారులు వాటిపై క్లిక్‌ చేసి డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ తరహా హైదరాబాద్‌లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

  • హుస్సేన్ సాగర్‌లో జాతీయ సెయిలింగ్ పోటీల హోరు

    HYD: హుస్సేన్ సాగర్‌లో మరోసారి జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలతో కళకళలాడుతోంది. యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్, యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న మాన్సూన్ రెగట్టా ఛాంపియన్స్ ఘనంగా కొనసాగుతోంది. పలు విభాగంల్లో తెలంగాణ, తమిళనాడు క్రీడాకారులు రెండో రోజూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.