Locations: Hyderabad

  • భార్యను హత్య చేసిన భర్త

    మేడ్చల్: జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని కార్మిక నగర్‌లో అశోక్(36) తన భార్య సౌందర్య(32)ను ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. మద్యం సేవించి, అక్రమ సంబంధం నెపంతో ఆమెను చిత్రహింసలు గురిచేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

  • పిల్లలకు రాయితీ పై డీఈఓ ఆదేశాలు

    HYD: హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 50% వరకు ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) ఆర్. రోహిణి యాజమాన్యాలను కోరారు. దానికి సంబందించిన ఉత్తర్వులను ఆమె విడుదల చేశారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స (హెచ్‌యూజే-టీడబ్ల్యూజేఎఫ్) ఈ అభ్యర్థనపై డీఈఓ సానుకూలంగా స్పందించడంపై హెచ్‌యూజే అధ్యక్షులు బి. అరుణ్ కుమార్, తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. 
  • పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

    మేడ్చల్: కాప్రా సర్కిల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాండాల శివకుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అభ్యునతి కోసం పని చేస్తున్న నాయకుడు శివకుమార్ గౌడ్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోని ఉన్నత పదవులకు చేరాలని అన్నారు. 
  • ఘోర రోడ్డు ప్రమాదం..

    రంగారెడ్డి: యాచారం మండలంలోని మాల్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగార్జునసాగర్‌ రహదారిపై కారును బస్సు ఢీకొట్టిన ఈఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఏడుగురు స్నేహితులు వైజాగ్ కాలనీకి విహారానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి కారును బస్సు ఢీకొంది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

  • క్రీడా పాఠశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం

    HYD: తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వతరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు జూన్‌ 7నుండి జూన్‌ 15న సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్‌లైన్‌ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

  • వేద పాఠశాలలో ప్రవేశాలు ప్రారంభం

    HYD: శ్రీరామభద్ర వేద సంస్కృత పాఠశాలలో 2025-26వ విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12 సంవత్సరాలున్న వటువులకు మాత్రమే అడ్మిషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. పాఠశాలలో చేరదలుచుకున్న వారు 99855 59791 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ప్రవేశాలకు ఈ నెల 30 చివరి తేదీగా పేర్కొన్నారు.

  • నాలా ఆక్రమణలపై హైడ్రా చర్యలు

    HYD: హైదరాబాద్‌లోని పాట్నీ నాలాపై అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్‌తో కలిసి నాలాను సందర్శించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 70 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలా 15-18 అడుగులకు కుంచించుకుపోయింది. నాలా విస్తరణ, ముంపు సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

  • సికింద్రాబాద్‌ నుంచి గంగా-రామాయణ పుణ్యక్షేత్ర రైలు

    HYD: భారత్‌ గౌరవ్‌ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. యాత్రికులు వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌లను సందర్శించవచ్చని వివరించారు.ఈరైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌నుంచి బయలుదేరి కాజీపేట్‌, వరంగల్‌, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్‌, స్టేషన్‌లలో ఆగుతుందన్నారు. ఈనెల 22 రాత్రి 10.30 గంటలకు రైలు తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటుందన్నారు.

  • మహా నగరానికి ‘వన’హారతి

    HYD:మహానగరంలో వనమహోత్సవానికి కార్యాచరణ సిద్ధమైంది. మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలోని 42 నర్సరీల్లో భారీఎత్తున మొక్కలు సిద్ధం చేశారు. అందులో పండ్లు, ఇతర అన్ని రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. త్వరలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఇవి నాటనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సాధారణ పౌరులకు ఇవి పంపిణీ చేయనున్నారు.

  • అంతర్జాతీయ సినీసిటీగా హైదరాబాద్‌.. డీపీఆర్‌ సిద్ధం చేయండి

    హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినీసిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధం చేయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. సినీరంగంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.శ్రీధర్ బాబుతో కూడిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమైంది. సినిమా షూటింగ్‌లకు పోలీసు, ఫైర్, మున్సిపాలిటీ తదితర శాఖల అనుమతులన్నీ సింగిల్‌విండో పద్ధతిలో అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.