Locations: Hyderabad

  • ‘వరద నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణ సిద్ధం’

    HYD: వర్షాకాల అత్యవసర బాధ్యతల అప్పగింతపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పందించారు. నగరంలో 300ప్రాంతాల్లో వరద నీరు నిలిచే సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశామని, గతంలో లేని పర్యవేక్షణ, చెరువులు, నాలాల్లోకి నీటిని మళ్లించే వ్యవస్థను బలోపేతం చేస్తామని రంగనాథ్ తెలిపారు. ఈ వర్షాకాలంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

  • ‘అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి’

    HYD: అంబర్‌పేట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బందితో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ ప్రశాంతి, ప్రవీణ్ కుమార్, మనీషా తదితరులు పాల్గొన్నారు.

  • జూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. 8 మంది అరెస్ట్

    HYD: కంచన్ బాగ్ పీఎస్ పరిధిలోని సీ బ్లాక్ కాలనీలో జూదం ఆడుతున్న స్థావరంపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో పేకాట ఆడుతున్న 8మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ప్లేయింగ్ కార్డులు, నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

  • ‘మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం’

    HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ 4వ వార్డులోని సుమన్ హౌసింగ్ కాలనీలో రూ.12లక్షల నిధులతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ ప్రారంభించారు. కాలనీ వాసులు వీధి దీపాలు, ఓపెన్ జిమ్ కోరారు. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని, ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

  • కృష్ణకాంత్‌ విగ్రహానికి నివాళులర్పించి కంటెస్టెడ్ ఎమ్మెల్యే

    HYD: తెలంగాణ అమరవీరుడు కట్టెలమండి కృష్ణకాంత్ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ 2వ వార్డ్‌లోని ఆయన విగ్రహానికి కంటోన్మెంట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, మాజీ TSBCL ఛైర్మన్ గజ్జెల నగేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మార్కెట్ ఛైర్మన్ TN శ్రీనివాస్‌తో కలిసి కేక్ కట్‌చేసి, కృష్ణకాంత్ తల్లిదండ్రులను శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు నరేష్ మూదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

  • ఇంటి పన్ను, నీటి బిల్లుల వసూళ్లపై ప్రచార కేంద్రాలు

    HYD: బకాయి ఇంటి పన్ను, నీటి బిల్లుల వసూళ్ల కోసం బుధవారం నుంచి వివిధ ప్రాంతాల్లో ప్రచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ప్రకటించారు. ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. లేనియెడల కంటోన్మెంట్ 2006చట్టం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • ఫ్రెండ్ అంటూ.. వైద్యురాలిని టోకరా కొట్టించిన సైబర్‌ నేరగాళ్ల

    HYD: స్నేహితురాలి ఫోన్‌ నెంబర్‌తో మెసేజ్‌ పెట్టి అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ వైద్యురాలిని టోకరా కొట్టించిన సైబర్‌ నేరగాళ్లపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసునమోదు చేశారు. యూసుఫ్‌గూడలో ఉంటున్న డా.వరలక్ష్మికి స్నేహితురాలు డా.మౌనిక పేరుతో మెసేజ్ వచ్చింది. రూ.42వేలు అత్యవసరంగా పంపాలని కోరగా.. డబ్బు పంపిన వరలక్ష్మి, మౌనిక ఫోన్‌హ్యాక్ అయినట్లు తెలిసి సైబర్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

  • రవీందర్ రెడ్డికి మర్రి శశిధర్ రెడ్డి నివాళి

    HYD: ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేసిన టీ రవీందర్ రెడ్డి ద్వాదశ దిన కార్యక్రమంలో శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు పాల్గొని ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేయడంతో పాటు వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీనిచ్చారు.

  • ‘అమ్మ మాట.. అంగన్వాడీ బాట’

    HYD: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి అంగన్వాడీ కేంద్రాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సందర్భంగా జూన్ 10 నుంచి 17 వరకు “అమ్మ మాట.. అంగన్వాడీ బాట” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా బస్తీలలో ఇంటింటికీ తిరిగి, 5 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించేందుకు అడ్మిషన్ డ్రైవ్ చేపడుతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా 5 సంవత్సరాలు దాటిన అంగన్వాడీ చిన్నారులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించనున్నారు.
  • ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

    మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్‌లో ‘ఒక మార్పు అభివృద్ధికి మలుపు’ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పద్మారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. 100రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి, అర్హులైన పేదలకు గృహ సౌకర్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళ్తుంది.