మేడ్చల్: మల్కాజ్‌గిరి డివిజన్, గౌతమ్ నగర్ డివిజన్‌లలో మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్ బోరెవెల్ పాయింట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి ఇటీవల ఎంపి లాడ్స్‌లో మంజూరు చేయబడిన 8 బోరెవెల్ పాయింట్లు జూలోలజిస్ట్‌కు చూపించారు. ఎక్కడ నీరు పడవోచ్చో జూలోజిస్ట్ ద్వారా మార్క్ చేశారు. గుర్తించిన పాయింట్‌లలో త్వరలో పవర్ బోర్లు వెయ్యనున్నారు. వీటిలో ఓల్డ్ మల్కాజ్‌గిరి,భగత్‌సింగ్ నగర్, హరిజనబస్తి, తదితర బస్తిలు వున్నాయి.
Locations: Hyderabad
-
‘ఆన్‌లైన్‌లో నకిలీ అడ్మిషన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి’
HYD: ఆన్‌లైన్‌లో నకిలీ అడ్మిషన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. కార్పొరేట్, పేరు మోసిన ప్రైవేట్ విద్యా సంస్థల్లో సులభంగా అడ్మిషన్లు అంటూ వచ్చే ప్రకటనలను తొలుత నిర్ధారించుకోవాలని, తొందరపడి ఎలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దని ఆయన తెలిపారు. తెలియని వెబ్‌సైట్లలో అస్సలు ఆర్థిక లావాదేవీలు చేయొద్దని హెచ్చరించారు. కొందరు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మోసగిస్తున్నారని గుర్తుచేశారు.
-
లులు మాల్‌లో లైవ్ బాక్సింగ్ పోటీలు
మేడ్చల్: కూకట్‌పల్లి లులు మాల్‌లో యూఐసీతో కలిసి “లులు యూఐసీ ఫైట్ నైట్-2” బాక్సింగ్ పోటీలు జూన్ 13-15 వరకు జరగనున్నాయి. తొలిసారిగా మాల్‌లో నిర్వహితమవుతున్న ఈ పోటీల్లో 36మంది బాక్సర్లు పాల్గొననున్నారు. 13న ఫేస్ ఆఫ్, 14న కిక్ బాక్సింగ్, 15న మువతాయ్ పోటీలు సాయంత్రం 4 నుంచి రాత్రి 9:30 వరకు జరుగుతాయి. ఈ పోటీలకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారు.
-
ఘనంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు
HYD: బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ వద్ద రోగుల సహాయకులు, బంధువులకు బిర్యానీ పొట్లాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో బీసీ యువజన సంఘం కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు కుందారం గణేష్ చారి, నాయకులు నరేష్ ప్రజపతి,తదితరులు పాల్గొన్నారు.
-
వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించిన పోలీసులు
రంగారెడ్డి: రాజేంద్రనగర్ జన చైతన్య కాలనీలో జూన్ 5న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ షకీల్ సల్మాన్, అతని స్నేహితుడు మొహమ్మద్ ముజీబుద్దిన్‌లను మెదక్‌లో అరెస్ట్ చేశారు. గతంలో షకీల్ దంపతుల వద్ద డ్రైవర్‌గా పనిచేసి,విభేదాల కారణంగా కక్షతో బుర్ఖా ధరించి, ఫేక్ ఐడీతో ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
-
ప్రముఖ న్యాయవాదికి బెదిరింపులు
HYD: నగరంలోని ప్రముఖ న్యాయవాది శైలేష్ సక్సేనాను గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించి, ఆయుధంతో బెదిరించారు. ల్యాండ్ కేసుల వల్ల శత్రువులు ఉన్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని బంజారాహిల్స్ పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. గతంలో ఫోర్జరీ కేసులో శైలేష్ అరెస్టయిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరా దృశ్యాలతో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
-
యోగా శిక్షణ కార్యక్రమం
మేడ్చల్: బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ నినాదంతో మండల పరిధిలోని అత్వెల్లి ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో యోగా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శైలజ మాట్లాడుతూ.. ఆరోగ్యం గొప్ప ఆస్తి అని, యోగాను ఇంటింటికీ తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మూడు రోజుల ఉచిత శిక్షణకు స్థానికులు హాజరవుతున్నారు. ఆరోగ్య సాధన కోసం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని శైలజ ఆకాంక్షించారు.
-
ఘనంగా బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలు
మేడ్చల్: నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా జ్యోతిర్మయ క్యాటరింగ్ అధినేత బలుసు సుధీర్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ యువనేత పృథ్వి చౌదరి, టీడీపీ తెలుగు యువత నాయకుడు ఆర్కే చౌదరి, కొసరాజు రాము, గణేష్, రాము, నాని తదితరులు పాల్గొన్నారు.
-
అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే
మేడ్చల్: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి బాలానగర్ డివిజన్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా దిల్‌ఖుష్‌నగర్‌లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా విద్యుత్ హైటెన్షన్ లైన్ల సమస్య మరియు డ్రైనేజీ వ్యవస్థ గురించి ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు అక్కడికక్కడే సూచనలు జారీ చేశారు. -
తెలంగాణ సైనిక్ స్కూల్ విద్యార్థులకు అన్యాయం
HYD: తెలంగాణ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్స్‌లో నాన్-లోకల్స్‌గా పరిగణించడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సైనిక పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, పోచయ్య, సాగర్‌లు విలేకరుల సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా 67% లోకల్ కోటాలో విద్యార్థులకు న్యాయం చేయాలని, తెలంగాణలో సైనికపాఠశాలు ఏర్పాటు చేయాలని సీఎంని కోరారు.