Locations: Hyderabad

  • రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

    HYD: హిమాయత్ నగర్‌లో 60లక్షలతో రోడ్డు పనులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. అనంతరం ఆదర్శ్‌నగర్‌లో 150మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. కాంగ్రెస్‌లో కమిట్మెంట్ లేదని, పనిచేసేవారికే పదవులు దక్కుతాయని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని, రాహుల్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

     

  • ఘనంగా యువజన నాయకులు నిఖిల్ జన్మదిన వేడుకలు

    మేడ్చల్: శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ యువజన నాయకుడు డీ.నిఖిల్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా PAC ఛైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ నిఖిల్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

  • “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు

    రంగారెడ్డి: షాద్‌నగర్‌లో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజమైన సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
  • నివాళులర్పించిన మాజీ మంత్రి

    మేడ్చల్: షామీర్‌పేట, తుర్కపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన తలసాని శంకర్ యాదవ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తలసాని శంకర్‌యాదవ్ కార్మికుల సంక్షేమం కోసం చేసిన కృషిని కొనియాడారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి హరీష్‌రావు, తలసాని శంకర్ యాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. 
  • నాంపల్లి కోర్టుకు ప్రభాకర్‌రావు.. కారణం ఇదే!

    ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు .. నాంపల్లి కోర్టుకు వెళ్లారు. గతంలో ప్రొక్లయిమ్డ్‌ అఫెండర్‌గా ప్రభాకర్‌రావును ప్రకటించేందుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 20లోపు తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ కోర్టుకు ప్రభాకర్‌రావు హాజరయ్యారు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.

  • సైబరాబాద్ పరిధిలో 13వ తేదీ వరకు నిషేధాజ్ఞలు

    రంగారెడ్డి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి 13వ తేదీ వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధజ్ఞలు విధిస్తున్నట్లు సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఎక్కువమంది గుమికూడరాదని, జిరాక్స్, ఇంటర్ నెట్ కేంద్రాలు మూసి ఉంచాలన్నారు.

  • బోనాల సంబరాలు ఎప్పటినుంచంటే.?

    HYD: ఈ నెల 26వ తేదీ నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపద్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు బోనాల జాతరను జరుపుకునేందుకు రెడీ అవుతున్నాయి. అయితే మొదటి రోజు గురువారం రావడంతో జూన్ 26 నుంచే బోనాల సంబురాలు ప్రారంభం కానున్నాయి. బోనాల ఏర్పాట్ల గురించి రివ్యూ మీటింగులో మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులకు  పలు సూచనలు చేశారు.

  • అనుమానంతో భార్యని హత్య చేసిన భర్త

    HYD: తూర్పుగోదావరి జిల్లా కొమ్మనపల్లి గ్రామానికి చెందిన మరియాదాస్(35), భార్య అమృత(30) సరూర్‌నగర్‌లోని భాగ్యనగర్ కాలనీలో నివసిస్తున్నారు. అక్రమ సంబంధాలపై గొడవలతో ఉదయం ఇంటికి వచ్చిన మరియాదాస్, ఫోన్‌లో మాట్లాడుతున్నావని భార్యను చున్నీతో బిగించి హత్య చేశాడు. మామ అర్జున్‌కు సమాచారం అందించగా, తండ్రి కూతురు మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • ‘పారిశుద్ధ్య పనులు చేపట్టాలి’

    HYD: నగరంలో రహదారులు, కాలిబాటలు, బస్టాపులు చెత్తకుప్పలుగా మారుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లపై ఊడ్చిన చెత్తను బస్టాపులు, రోడ్డు విభాగినిలపై కుప్పలుగా పోస్తున్నారు. వరదనీటితో కొట్టుకొచ్చిన బురద, మట్టిని కాలిబాటల పక్కన వదిలేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.  

  • రుణ ఒత్తిడితో కూలీ ఆత్మహత్య

    HYD: పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలో రూ.5లక్షల అప్పు తీర్చలేదని నిర్బంధించడంతో ఒడిశాకు చెందిన సాగర్ అలియాస్ ఫాగునే కర్జీ(57) ఆత్మహత్య చేసుకున్నాడు. మేస్త్రీ నర్సింహులు, స్నేహితులు యూసుఫ్, ఖాసీం కలిసి అప్పుకోసం బాండు రాయాలని ఒత్తిడి చేశారు. మనస్తాపానికి గురైన సాగర్ యూసుఫ్ ఇంటి బాత్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడికి వచ్చిన ముగ్గురు నిందితులు సాగర్‌ను కిందకు దించి పరారయ్యారు.