Locations: Hyderabad

  • జస్టిస్‌ శ్రీసుధకు ఘన వీడ్కోలు

    HYD: : బదిలీపై కర్నాటక హైకోర్టుకు వెళ్తున్న తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్‌ పి.శ్రీసుధకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. చీఫ్‌ జస్టిస్‌ సుజయ్​పాల్‌ అధ్యక్షతనలో   ఆమెకు వీడ్కోలు పలికింది.  జస్టిస్‌ పి.శ్రీసుధ 5,055 కేసులను పరిష్కరించారని జస్టిస్‌ సుజయ్‌పాల్‌ చెప్పారు. జస్టిస్‌ శ్రీసుధ మాట్లాడుతూ.. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు సహా పలు ప్రధాన కేసుల తీర్పుల విచారణ, తీర్పులో భాగస్వామి కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

     

  • బల్కంపేట ఎల్లమ్మకు యాపిల్స్‌ అలంకరణ

    HYD: నగరంలోని బల్కంపేటలోని ప్రసిద్ధ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయంలో పండితులు వేదమంత్రాలతో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని యాపిల్స్, వివిధ రకాల పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

  • బోధన సమస్యలు రాకుండా చర్యలు

    వికారాబాద్: గతేడాది బోధన సమస్యలు పునరావృతం కాకుండా ఈ విద్యా సంవత్సరంలో చదువులు సజావుగా సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సమీప పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. బషీరాబాద్ మండలంలో ఒక పాఠశాలలో 52 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు, కోట్‌పల్లి, ధారూరు మండలాల్లో ఆరు బడుల్లో 30కిపైగా విద్యార్థులకు ఒక్కో ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. 
  • సీబీఐ పేరుతో రూ.1.34కోట్ల స్కామ్

    మేడ్చల్: ఉప్పల్‌కు చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ సివేంద్రనాథ్ రాయ్‌ను సీబీఐ అధికారుల పేరుతో సైబర్ నేరస్తులు మోసం చేశారు.  టెలీకమ్యూనికేషన్, సీబీఐ అధికారులుగా మాట్లాడి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు చేస్తూ ఫోన్ చేశారు. డబ్బును సుప్రీంకోర్టు ద్వారా తిరిగి ఇస్తామని చెప్పి రెండు దఫాలుగా రూ.1.34కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయించారు. బాధితుడు ఎల్బీనగర్‌లోని రాచకొండ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు.

  • నేడు గ్యాస్ట్రో ఎంట్రాలజీపై అవగాహన

    మేడ్చల్: వివేకానందనగర్ సీనియర్ సీటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈనెల 10న గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ రెడ్డి తొండపు, ఎంబీబీ ఎస్, ఎండీ, డీఎం పాల్గొని అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వడ్డేపల్లి కమలమ్మ సీనియర్ సీటిజన్ హాల్‌లో సాయంత్రం 5.30 గంటలకు ఉంటుందని, పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వారు సూచించారు.

  • ముంపు సమస్యకు చెక్.. రిటర్నింగ్ వాల్ నిర్మాణం

    మేడ్చల్: ఉప్పల్ డివిజన్‌లోని శేషసాయి నగర్, మల్లిఖార్జున నగర్ కాలనీలలో ముంపు సమస్య పరిష్కారానికి రూ.1.98కోట్లతో నాలాకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపడతామని కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఇంఛార్జ్ పరమేశ్వర్ రెడ్డితో కలిసి ఆమె కాలనీల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. త్వరలో శేషసాయి నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

  • బంగారం కోసమే వృద్ధురాలి హత్య

    HYD: నార్సింగి పోలీసులు ఖానాపూర్‌ గ్రామానికి చెందిన రామేశ్వరం బాలమ్మ(75) హత్య కేసును చేధించారు. బంగారం, వెండి కోసం పరిగి అనిత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసింది. బాలమ్మ కోడలు లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు అనితను వికారాబాద్‌లో అరెస్టు చేశారు. కండ్లపల్లి అడవిలో పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు అనితను అరెస్టు చేశారు.

  • ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

    మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్ది హామీల అమలులో భాగంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు 5 లక్షల రూపాయల సహాయంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైంది. బోడుప్పల్‌లోని 13, 27, 28 డివిజన్లలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోగుల నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • కెమికల్ ట్యాంకర్‌‌లో మంటలు..

    మేడ్చల్: శామీర్‌పేట్ పీఎస్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై కెమికల్ ట్యాంకర్ కింద పడింది. ఈ ట్యాంకర్‌ను క్రేన్‌తో తొలగిస్తుండగా  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ట్రాఫిక్ సీఐ హనుమాన్ గౌడ్ వాహనాల రాకపోకలను నియంత్రించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • కూతురికి వాతలు పెట్టిన తండ్రి

    HYD: కన్నకూతురిపై ఓ తండ్రి దాడికి పాల్పడిన ఘటన సుబ్రమణ్యనగర్‌లో జరిగింది. మరొకరితో బాలిక చనువుగా ఉంటుందని  ఆమె తండ్రికి తెలిసింది. దీంతో ఆగ్రహానికి లోనైన తండ్రి హర్యా.. బాలిక ముఖం, చేతులపై వాతలు పెట్టాడు. తీవ్ర గాయాలైన బాలికను ఆమె తల్లి ఉస్మానియా ఆస్పత్రికిి తీసుకెళ్లింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.