Locations: Hyderabad

  • గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి అదృశ్యం

    HYD: గాంధీ హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చిన మహబూబ్‌నగర్ పాలకుర్తికి చెందిన భిక్షపతి(63) ఈనెల 5న అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ప్రయోజనం లేక పోవడంతో అతడి కూతురు దుర్గా ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు. నలుపురంగు టీషర్ట్, నేవీ‌బ్లూ ప్యాంట్ ధరించి ఉన్నాడని చెప్పారు. ఆచూకీ తెలిసిన వాళ్ళు పీఎస్‌కు సంప్రదించాలని కోరారు.

  • నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

    HYD: యూనియన్ బ్యాంక్, వరలక్ష్మీ ఫౌండేషన్ సహకారంతో స్వర్ణభారత్ ట్రస్ట్ రంగారెడ్డి, మేడ్చెల్, వికారాబాద్ జిల్లాల నిరుద్యోగులకు టైలరింగ్, సీసీటీవీ ప్రోగ్రాంలోనైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉచితశిక్షణ, వసతి,భోజన సౌకర్యం ఉంటుందని తెలిపింది. మరిన్ని వివరాలకు 9391487797,7893121143 నంబర్లలో సంప్రదించాలని కోరింది.

     

  • రెవెన్యూ సదస్సులకు హాజరుకానున్న కలెక్టర్లు

    రంగారెడ్డి: రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులకు రెండు జిల్లాల కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, గౌతమ్‌ హాజరవుతున్నారు. భూ భారతి సదస్సుల్లో సమర్పించే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పుల కారణంగా ఐదేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న రైతులు, భూయజమానుల వివరాలను సేకరించి ప్రాధాన్యపరంగా సమస్యలను తొలగించనున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు.

  • జంట సర్కిళ్లలో ప్రజావాణికి 10 అర్జీలు

    HYD: జంట సర్కిల్ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 10 అర్జీలు వచ్చాయి. కుత్బుల్లాపూర్,గాజులారామారం సర్కిళ్ల ఉప కమిషనర్లు నర్సింహ, మల్లారెడ్డి,  ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో మొత్తం 6 అర్జీలు రాగా, గాజులరామారం సర్కిల్‌లో 4 వినతులు వకచాయని అధికారులు తెలిపారు.

  • హెచ్ఎండీఏ పరిధిలో 4.5 కోట్ల మొక్కలు

    HYD: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలో ఏడాదంతా 4.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  దీనికి సంబంధించిన కసరత్తును హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో 4.5 కోట్ల మొక్కలు నాటనున్నారు. అయితే ఈమొక్కలను అత్యధికంగా హెచ్ఎండీఏ పరిధిలో 18 అర్బన్ ఫారెస్ట్ పార్కులు, రహదారుల వనాలు, ఫారెస్ట్ బ్లాకులు, ఆయా విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన మొక్కలను నాటాలని నిర్ణయించారు.

  • అక్రమ గంజాయి ముఠా అరెస్ట్

    HYD: నగరానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరు గంజాయి స్మగ్లర్లను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒడిశా మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన అమన్‌ హంతటి,  రైమాన్‌ గూటే, మల్కాన్‌గిరికి చెందిన గంజాయి విక్రేత జినోతోసంప్రదించి గంజాయిని వినోద్‌ సింగ్‌కు అప్పగించేందుకు ఓప్పందం కదుర్చుకుని అఫ్జల్‌గంజ్‌ వద్ద చేరుకోగా పోలీసులు నిందితుల నుంచి 11 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

  • మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు

    మేడ్చెల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట( శామీర్ పేట)లో 2025-26 సంవత్సరానికి అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇశ్రత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కళాశాలలో బీఎస్సీ, బికాం, బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు అర్హులు. ఈనెల 23 లోపు అభ్యర్థులు ద్రువపత్రాలతో కళాశాలో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు.

  • తండ్రి మందలించాడని.. విద్యార్థిని ఆత్మహత్య

    HYD: తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ సుభాష్‏నగర్‌లో నివసిస్తున్నా రాజేష్‏కుమార్‌ రెండవ కుమార్తె తేజస్విని(19) గౌతమి కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేసింది. తరుచూ ఫోన్‌ మాట్లాడుతుండడంతో తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన ఆమె సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • మార్చిలోనే టెన్త్‌ పరీక్షలు

    HYD: ఈ విద్యా సంవత్సరం 2025–26 టెన్త్‌ పరీక్షలను 2026 మార్చిలో నిర్వహించాలని విద్యాశా ఖ నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 10 లోపు మొత్తం సిలబస్‌ బోధన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. విద్యాశాఖ 2025–26 విద్యా సంవత్సరం కేలండర్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీన మొదలయ్యే పాఠశాలలు 2026 ఏప్రిల్‌ 23వరకు నడుస్తాయని, మొత్తం 230 పనిదినాలు ఉంటాయని వెల్ల డించింది.

  • ఉచిత మంచి నీటి షెడ్డు ప్రారంభోత్సవం

    HYD: మంచుకొండ ఫౌండేషన్ ఆధ్వర్యలో నిర్వహిస్తున్న ఉచిత మంచి నీటిని శుద్ధిచేసిన మంచినీటి షెడ్డు ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా రాజకుమారి, మంచుకొండ ఫౌండేషన్ ట్రస్టీ మంచుకొండ వరుణ్ కుమార్ చేతులమీదుగా ప్రారంభించారు. ఇలాంటి వాటర్ షెడ్డు లు మరిన్ని నిర్మించి వాటి బాధ్యత కూడా ఫౌండేషన్ తీసుకుంటుందని మంచుకొండ వరుణ్ కుమార్ పేర్కొన్నారు.