Locations: Hyderabad

  • యువతిపై లైంగిక దాడి

    HYD: మహారాష్ట్రకు చెందిన 22ఏళ్ల యువతి ఇష్టంలేని పెళ్లి నుంచి పారిపోయి హైదరాబాద్‌ చేరుకుంది. జూబ్లీహిల్స్‌లో ఒంటరిగా ఉండగా, మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి ఆమెను మాటలతో ఆశ్రయం ఇస్తానని తన గదికి తీసుకెళ్లి, అన్నం పెట్టాడు. ఆ తర్వాత లైంగిక దాడికి యత్నించగా, ఆమె కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు.

  • కొత్త బస్ పాస్‌లకు గ్రీన్ సిగ్నల్

    HYD: విద్యార్థులకు టీజీఆర్టీసీ శుభవార్తను పలికింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఈనెల 12 నుంచి కొత్త బస్‌పాస్‌లను జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగర వ్యాప్తంగానున్న 40 ఆర్టీసీకేంద్రాల్లో విద్యార్థులు ఈ బస్‌పాస్‌లను పొందవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కొత్త బస్‌పాస్‌ల కోసం.. వెబ్‌సైట్‌లో అప్లై చేసుకుని అప్లికేషన్ ఫామ్‌ను బస్‌పాస్ కౌంటర్లలో ఇస్తే.. స్టూడెంట్ బస్‌పాస్  జారీ అందజేస్తారని అధికారులు తెలిపారు.

     

  • శామీర్‌పేట్‌లో వ్యక్తి అదృశ్యం

    మేడ్చల్: శామీర్‌పేట్ మండలం తూంకుంటకు చెందిన హరీష్ కుమార్ రెడ్డి (32) ఈ నెల 8న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. సోదరుడి ఫిర్యాదు మేరకు శామీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హరీష్ కర్కపట్లలోని ఓ కంపెనీలో పనిచేస్తూ, భార్యతో కలిసి తూంకుంటలో నివసిస్తున్నాడు. సమాచారం ఉన్నవారు శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. 

  • ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన తలసాని

    HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాదాపూర్‌లోని గోపీనాథ్ నివాసంలో మహమూద్ అలీతో కలిసి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. 1992 నుండి గోపీనాథ్‌తో సోదరభావంతో కలిసి పనిచేశామని, ఆయన మృతి దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. గోపీనాథ్ అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

  • గుర్తుతెలియని మృతదేహం లభ్యం

    మేడ్చల్: మేడ్చల్ మండల పరధిలోని ఐడిఏ ప్రాంతంలో శ్రీనాథ్ స్పిన్నర్స్ సమీపంలో 55-60 ఏళ్ల గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని ఎడమ చేతిపై ‘టి.స్వామి సమ్మయ్య’, కుడి చేతిపై ‘శ్రీ’ అని పచ్చబొట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే మేడ్చల్ పీఎస్‌లో సంప్రదించాలని ఎస్ఐ అశోక్ తెలిపారు. 

  • ఆహార కల్తీ‌కి చెక్.. రంగంలోకి దిగిన అధికారులు

    HYD: ఆహార పదార్థాల కల్తీ నియంత్రణకు జీహెచ్‌ఎంసీ పటిష్టమైన చర్యలు తీసుకోనుంది. ఆహార కల్తీని నియంత్రించడానికి జీహెచ్ఎంసీ ఆహార భద్రత విభాగం ద్వారా 2024 సంవత్సరంలో 1887 శాంపిళ్లను సేకరించింది. వాటిలో 95 నమూనాలను ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఉల్లంఘించినట్లు తేలింది. ఆహార ఉత్పత్తుల కల్తీకి పాల్పడిన వ్యాపారులపై రూ.30.60 లక్షల జరిమానా విధించింది.

     

  • సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు

    TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్‌రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎలాంటి ఆదేశాల మేరకు దర్యాప్తు జరిగిందన్న విషయాలపై ప్రభాకర్‌రావును లోతుగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • నెక్లెస్‌ రోడ్‌లో తెలంగాణా రన్‌ 2025

    HYD: సొసైటీ ఫర్‌ తెలంగాణ రన్నర్స్‌ ఆధ్వర్యంలో రన్‌– 2025 పేరుతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి 3కే, 5కే, 10కే, హాఫ్‌ మారథాన్‌ ఆదివారం నిర్వహించారు.  మారథాన్‌లో వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి రన్నర్లు భారీగా  పాల్గొన్నారు. మారథాన్, రన్‌ను డిప్యూటీ డ్రగ్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ ఏ రామ్‌కిషన్, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏపీ జితేందర్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

     

  • వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్

    HYD: వనస్థలిపురంలో నారాయణ అనే అడ్వకేట్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. SNR అపార్ట్‌మెట్ నుంచి ఆయనను ఎత్తుకెళ్లారు. నారాయణను వదిలిపెట్టాలంటే తమకు రూ.కోటి ఇవ్వాలని ఆయన భార్యకు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. అయితే ఈ కిడ్నాప్‌నకు భూ వివాదాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • హెచ్‌ఎండీఏలో పరిపాలన జోన్లు

    HYD: HMDAను త్వరలో పరిపాలన సౌలభ్యం కోసం వికేంద్రీకరణ చేసే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ప్రణాళిక విభాగంలో ఆరు జోన్లు ఉన్నాయి. త్వరలో మరో 3 వేల కి.మీ.ల మేరకు పెరగనుంది. ప్రాంతీయ రింగ్‌రోడ్డు దాటిన తర్వాత 2 కి.మీ.ల వరకు హెచ్‌ఎండీఏ గ్రోత్‌ కారిడార్‌ కింద రానుంది.  రానున్న మెగా మాస్టర్‌ ప్లాన్‌తోపాటు పరిపాలన వికేంద్రీకరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.