మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బాలనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పాపయ్య యాదవ్ నగర్‌కు చెందిన గడ్డం ప్రకాష్ రావు(45) ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి తీవ్రవాంతులు కావటంతో కుటుంబ సభ్యులు హాస్పటల్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అతడు మృతి చెందినట్లు ప్రకటించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Locations: Hyderabad
-
కీసర అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్న ఆస్ట్రేలియా బృందం
మేడ్చల్: దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర మండల కేంద్రంలో 175 వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆస్ట్రేలియా డెలిగేషన్ మినిస్టర్, పార్లమెంట్‌సెక్రటరీ పాల్గొని అంబేద్కర్ విగ్రహం పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో బోనాలు, బతుకమ్మలతో ఆస్ట్రేలియా బృందానికి కీసర ఆడపడుచులు ఘనంగా స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా షీనా ఎంపీకి మాజీ మంత్రి మల్లారెడ్డి బోనంబతుకమ్మ ఎత్తారు.
-
‘కీసర వార్డు కార్యాలయం మాకే ఉండాలి’.. ప్రధాన కూడలిలో ధర్నా
మేడ్చల్: కీసర వార్డు కార్యాలయాన్ని కీసర నుండి తొలగించొద్దు అని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. మా కీసర వార్డు కార్యాలయం మాకే ఉండాలి అంటూ ధర్నా చేస్తూ కీసర ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కీసర మండలాన్ని ప్రత్యేకమున్సిపాలిటీగా చేయలేదు. కీసర వార్డు కార్యాలయాన్ని కూడా కీసర నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమన్నారు.
-
మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం: మాజీ మంత్రి
HYD: జూబ్లిహిల్స్ మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన గోపినాథ్ మరణ వార్త తెలుసుకొని ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తు, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
-
చేప మందు వేసుకున్న మంత్రి పొన్నం
HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప మందు ప్రసాదం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రారంభించారు. మంత్రికి చేప ప్రసాదాన్ని బత్తిని కుటుంబ సభ్యులు స్వయంగా అందించారు. ఈ కార్యక్రమానికి అస్తమా రోగులు భారీగా హాజరయ్యారు. పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.
-
మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎమ్మెల్యే
మేడ్చల్: నా తోటి స్నేహితుడు, మాకు అత్యంత ఆప్తులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం నన్ను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో మేమిద్దరం కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటన్నారు.
-
చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించిన మంత్రి
HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కి బత్తిని అమరనాథ్ చేప ప్రసాదం వేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, మధుయాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
HYD: మృగశిర కార్తె సందర్భంగా బత్తిన బ్రదర్స్ ఏటా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ఆదివారం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తెలంగాణ, ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు 42 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
-
మాగంటి మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం
HYD: జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ మృతి పట్ల సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తీవ్ర దిగ్భంతి వ్యక్తం చేశారు. మూడు సార్లు శాసనసభ్యునిగా విజయం సాధించి ప్రధానంగా పేద వర్గాల సంక్షేమానికి నిరంతరం మాగంటి శ్రమించారని పేర్కొన్నారు. తనకు సుదీర్ఘ కాలంగా వ్యక్తిగత అనుబంధం ఉందని, కార్యకర్తలు, అభిమానుల మన్ననలను ఆయన పొందారని తెలిపారు.
-
మాగంటి గోపీనాథ్ మృతిపై ఎమ్మెల్యే సంతాపం
మేడ్చల్: మాగంటి గోపీనాథ్ మృతిపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంతాపం తెలిపారు. జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.