HYD: మృగశిర కార్తెను సందర్భంగా పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈనెల8న ఉదయం9గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై 9నఉదయం9 వరకు కొనసాగనుంది. ఈసారి 42 క్యూ లైన్లను ఏర్పాటుచేశారు. ఫిషరీస్‌శాఖ లక్ష చేప పిల్లలను సిద్ధంగా ఉంచింది. కార్యక్రమాన్ని స్పీకర్ ప్రసాద్‌రావు ప్రారంభిస్తారని, మంత్రి పొన్నం తదితరులు పాల్గొంటున్నట్లు నిర్వహకులు తెలిపారు.
Locations: Hyderabad
-
ఆలయంలో చోరీ..
మేడ్చల్: గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి చోరీ చేసిన ఘటన షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లక్ష్మాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు గ్రామంలో ఉన్న ఎల్లమ్మ, రామాలయం ఆలయంలోకి చొరబడి హుండీలను కొంత ఆభరణాలను దోచుకెళ్లారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటన స్థలానికి షామీర్‌పేట్ సీఐ శ్రీనాథ్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.
-
పెళ్లికి ఆభరణాలు కూడబెడితే.. కుమారుడు మాయం చేశాడు
HYD: తల్లి కూడబెట్టిన ఆభరణాలను స్నేహితుడితో కలిసి కుమారుడు అపహరించిన ఘటన ముషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. భోలక్‌పూర్ గుల్షన్‌నగర్‌కు చెందిన రుక్సానా బేగం భర్త చనిపోవడంతో ఫంక్షన్‌హాల్‌లో కూలీగా పనిచేస్తోంది. కుమార్తె పెళ్లికి 30 గ్రాముల స్వర్ణాభరణాలను, 817 గ్రాముల వెండి తయారు చేయించింది. చిన్నకుమారుడు మహ్మద్ అల్తాఫ్(22)ను విచారించగా.. తన స్నేహితుడు, ఆటో డ్రైవర్ మహ్మద్ గౌస్(29)తో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించాడు.
-
పనులను పరిశీలించిన కార్పొరేటర్
మేడ్చల్: ఉప్పల్‌లోని భరత్ నగర్‌లో రూ.30 లక్షలతో చేపడుతున్న ఉప్పల్ కురుమ సంఘం రెండవ అంతస్తు భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి శనివారం పనులను ఉప్పల్ కురుమ సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యేను కలిసిన కార్మికులు
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద ఫ్లెమింగ్ ల్యాబరేటరీ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్మిక ఒప్పంద అగ్రిమెంట్‌కు కృషిచేసిన సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్‌ను సన్మానించారు. అనంతరం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం ప్రజలకు, కార్మిక కర్షకులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని హామీనిచ్చారు.
-
గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
HYD: గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ స్వల్పంగా మంటలు రావడంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆస్పత్రిలోని పేషంట్లు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు వీఐపీలు ఎక్కువగా చికిత్స తీసుకునే ఆస్పత్రిలో ఇలా జరగడంతో ఫైర్ సేఫ్టీపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
హనీమూన్‌కు వెళ్తుండగా ప్రమాదం..
HYD: వరంగల్‌కు చెందిన సాయి(28) మూడునెలల క్రితం వివాహం చేసుకున్నాడు. హనీమూన్ కోసం భార్య, బావమరిది, స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. వాటర్‌బాటిల్ కోసం రైలు దిగగా, రైలు కదిలింది. స్నేహితులు చైన్ లాగడంతో పోలీసులు వారిని దించారు. సాయి పోలీసులతో మాట్లాడి రైలు ఎక్కబోతుండగా రైలు, ప్లాట్‌ఫాం మధ్య పడిపోయాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందాడు. -
ప్రత్యేక రూపంలో ఖైరతాబాద్ గణేశ్
HYD: ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తిగా ఖైరతాబాద్ మహాగణపతి 69 అడుగుల ఎత్తైన విగ్రహంతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 71వ సంవత్సరం సందర్భంగామహాగణపతికి కుడి వైపు శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దర్శనమిస్తే, ఎడమవైపు బలిత త్రిపురసుందరీ, శ్రీ గజ్జలమ్మదేవి కొలువై ఉంటారు. ఖైరతాబాద్ మహాగణపతి నమూనా ఆలయ సభ్యులు విడుదల చేశారు. -
‘కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి’
మేడ్చల్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సలహాలతో ఉత్తమ్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మేకల రాము యాదవ్ తెలిపారు. ఉత్తమ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశమైన ఆయన కాలనీవాసుల వినతి పత్రం స్వీకరించారు. స్థానిక కార్పొరేటర్ మేకల సునీతతో కలిసి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు చేపడతామన్నారు. -
భార్యను చంపాలనుకొని పక్కింటి మహిళపై దాడి!
TG: భార్యను చంపాలనుకొని మరో మహిళపై వ్యక్తి దాడి చేసిన ఘటన కాటేదాన్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి తాగిన మైకంలో సలాం అనే వ్యక్తి తన ఇల్లు అనుకొని పక్కింట్లోకి వెళ్లి నిద్రిస్తున్న మహిళను కత్తితో పొడిచాడు. స్థానికులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.