Locations: Hyderabad

  • నిర్మాణాలకు భూమి పూజ

    మేడ్చల్: మచ్చ బొల్లారం డివిజన్ మార్కెట్ యాడ్ గణేశుని దేవాలయం ప్రాంగణంలో అదనపు గదుల నిర్మాణాలకు శుక్రవారం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజేంద్రనాథ్ భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడుంటానని ఈ సందర్భంగా మైనంపల్లి తెలిపారు. బొబ్బిలి సురేందర్ రెడ్డి మొదటగా గణేశుని దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజలో పాల్గొన్నారు.

  • యువతి అదృశ్యం.. కేసు నమోదు

    మేడ్చల్: ఇంటి నుంచి బయటకు వెళ్ళిన యువతి అదృశ్యమైన ఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధి దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైదయ్య ప్రకారం.. దమ్మాయిగూడలోని సాయిబాబా నగర్‌లో కటకోళ్ల శివరామకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. గత నెల30న మెట్టుగూడలో బంధువుల వివాహానికి కుటుంబ సభ్యులతో హాజరై వచ్చారు. కుమార్తె బిందు(17) బాత్‌రూమ్‌కి వెళ్ళి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

  • సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి

    మేడ్చల్: ప్రభుత్వ స్థలాల్లో సూచిక బోర్డులకు రక్షణే లేకుండా పోయింది. జవహర్ నగర్ కార్పొరేషన్‌లోని సర్వే నెం 510లో నందనవనం పార్కులో రెవెన్యూ యంత్రంగం గత నెలలో ప్రభుత్వ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. పార్కును కబ్జాచేయాలని యత్నిస్తున్న కబ్జాదారులు రాత్రికి రాత్రే బోర్డును ధ్వంసం చేసి కిందపడేసి వెళ్ళారు. సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

  • రెవెన్యూ సదస్సులో తహసీల్దారు తీరుపై విమర్శలు

    మేడ్చల్‌: ఫోనే లోకమన్నట్టు వ్యవహరించిన అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. తూముకుంట మున్సిపల్ పరిధిలోని బొమ్మరాసిపేట్ గ్రామంలో రెవెన్యూ సదస్సలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుంది. ఇంత ప్రాధాన్యత ఉన్న రెవెన్యూ సదస్సు లక్ష్యంగా నీరు గార్చేలా తహసీల్దారు యాదగిరి రెడ్డి వ్యవహరించారు. ప్రజల సమస్యల వినకుండా ఫోన్‌లోనే మాట్లాడుతూ కనిపించాడు.

  • రసాయన ట్యాంకర్‌ పట్టివేత

    మేడ్చల్‌: అక్రమంగా రసాయన వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్‌ పీఎస్ పరిధిలో అక్రమంగా ప్రమాదరక రసాయన వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను నిఘా పెట్టి పట్టుకున్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • VIDEO: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి

    TG: పటాన్‌చెరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న TGSRTC బస్సు (రూట్ నెం. 219)లో ఓ ప్రయాణికుడు బాలానగర్‌లోని శోభన థియేటర్ వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. బస్సు శోభన థియేటర్ సమీపంలోకి రాగానే అతను కుప్పకూలినట్లు సహప్రయాణికులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

     

  • పిల్లలతో కలసి సినిమా చూసిన కార్పొరేటర్

    HYD: కవాడిగూడలోని సత్వా మాల్‌లో ‘ఎక్స్ రోడ్స్’ సినిమాను రెజిమెంటల్ బజార్‌లోని ఆశ్రయ్ రెయిన్‌బో హోమ్స్ విద్యార్థులతో కలిసి మోండా కార్పొరేటర్ కొంతం దీపిక వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  X రోడ్స్ చిత్రాన్ని ప్రోత్సహించడానికి, ప్రచారం చేయడానికి సినిమా చూడడం జరిగిందని తెలిపారు. చిత్ర దర్శకుడు నిర్మాత, శశి ప్రీతంతో పాటు సినిమా సిబ్బందిని కలిసే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తంచేశారు.

  • భారీగా డిఫెన్స్ లిక్కర్ బాటిల్స్ పట్టివేత

    రంగారెడ్డి: మియాపూర్‌లో భారీగా డిఫెన్స్‌కు సంబంధించిన లిక్కర్ బాటిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ మాతృశ్రీ నగర్ ఓ రేకుల షెడ్‌లో భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్ల అక్రమ నిలువ ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.5 లక్షల విలువచేసే వివిధ బ్రాండ్‌లకు సంబంధించిన 160 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితుడు మన్నవ గాంధీ(65) ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌కు తరలించారు.

  • ‘ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’

    HYD: మెట్టుగూడ డివిజన్‌లోని దుధ్ బాయి బస్తీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీ నిధుల నుంచి ఇటీవల నిర్మితమైన కమ్యూనిటీ హాల్ భవనానికి బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఆదర్శ్ ముదిరాజ్ 40కుర్చీలను సొంత నిధులతో వితరణ చేశారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు, బీజేపీ నాయకులు ఆదర్శ్ ముదిరాజ్‌కు అభినందనలు తెలిపారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

  • ఖైరతాబాద్‌లో శ్రీవిశ్వశాంతి మహాశక్తి గణపతి.. ఘనంగా తొలిపూజ

    HYD: ఖైరతాబాద్‌ మహాగణపతి ఈ ఏడాది శ్రీవిశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మహాగణపతి 71వ వేడుకలకు శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్భంగా కర్రపూజ (తొలిపూజ) జరిగింది. ఈ ఏడాది విగ్రహనమూనా చిత్రాన్ని విడుదల చేశారు. 69 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానంనాగేందర్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, పాల్గొన్నారు.