హైదరాబాద్‌లో కల్తీ టీ వ్యాపారాన్ని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. 42 టీ పౌడర్ యూనిట్లు, టీ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, 19 నమూనాలను ల్యాబ్‌కు పంపారు నివేదికలు వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్తీ టీ పౌడర్ తడి గుడ్డపై రుద్దినప్పుడు పసుపు కలర్‌లో మారుతుందని తెలిపారు. కల్తీ పౌడర్ కలిపిన నీళ్లు వెంటనే డార్క్ రెడ్ కలర్ లోకి మారుతాయని పేర్కొన్నారు.