మేడ్చల్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట ప్రారంభమైంది. జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లి దండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
Locations: Hyderabad
-
వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ
మేడ్చల్: నేరెడ్‌మెట్‌లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత నాలుగు రోజులుగా తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శ్రీబాలాజీ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం బ్రహ్మోత్సవాల ముగింపు రోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు.
-
పండ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ
మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి జన్మదిన సందర్భంగా వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొంగళ్ళ బాలేష్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు తన ట్రస్టు ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామన్నారు.
-
నూతన హాస్పిటల్ ప్రారంభం
మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత సాయి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ముందుగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లేష్, డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు.
-
ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత
HYD: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల ఫీజుల నియంత్రణకై చట్టం చేయాలని కోరుతూ బాలల హక్కుల పరిరక్షణ వేదిక(సీఆర్పీఎఫ్), తల్లుల సంఘం ప్రతినిధులు శుక్రవారం తుకారాంగేట్‌లోని ఉన్న నివాసంలో ఎమ్మల్యే శ్రీగణేష్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. పన్ను మినహాయింపు పొందుతూ సేవా దృక్పథంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా సంస్థలు వ్యాపార దృక్పథంతో పని చేస్తున్నాయని తెలిపారు.
-
‘అక్రమ నిర్మాణాలు ఆపండి’
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని సర్వే నెంబర్ 326, 307లలో గత కొంతకాలంగా యథేచ్చగా జరిగిన అక్రమ నిర్మాణాలు ఆగిపోయాయి. కానీ మళ్ళీ వారంరోజుల నుంచి ఎలాంటి భయం లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని మండల రెవెన్యూ కార్యాలయంలో ఆర్‌ఐ కరీముల్లాకి సీపీఐ నాయకత్వం వినతిపత్రం అందజేశారు. అక్రమనిర్మాణాలను కూల్చివేయ్యకపోతే స్వయంగా ప్రజలను తీసుకొచ్చి గుడిసెలు వేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి స్వామి పాల్గొన్నారు.
-
వృద్ధ దంపతుల దారుణహత్య.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు
HYD: రాజేంద్రనగర్‌లో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపింది. జనచైతన్య ఫేజ్ -2లో నివసించే షేక్ అబ్దుల్లా, అతని భార్య రిజ్వానా దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరినీ గొంతు కోసి దుండగులు హతమార్చారు. కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.షేక్ అబ్దుల్లా ఎస్‌బీఐ విశ్రాంత ఉద్యోగి కాగా భార్య రిజ్వానా విశ్రాంత లెక్చరర్. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకబృందాలను రంగంలోకి దించారు.
-
ఖైరతాబాద్ మహా గణపతికి కర్రపూజ
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతికి నేడు కర్రపూజ జరిగింది. 71వ గణేష్ ఉత్సవాల కోసం కర్రపూజతో ఉత్సవ ఏర్పాట్లను మొదలుపెట్టారు నిర్వహకులు. కాగా ఈ ఏడాది 71 అడుగుల ఎత్తైన విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నగర మేయర్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. చెన్నైకి చెందిన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో 150 మంది కళాకారులు ఈ నిర్మాణంలో పాల్గొంటున్నారు.
-
చికెన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఆకస్మిక తనిఖీలు
మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు చికెన్, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌సీ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, సుగుణ, అక్బర్ చికెన్ సెంటర్‌లో వంటగదులు, సరుకుల నాణ్యత పరిశీలించారు. అనంతరం నాణ్యత లేని కారణంగా వాటిని సీజ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కల్తీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి షాపు నిర్వాహకులకు వివరించారు.
-
చెరువుల అభివృద్ధిపై సమావేశం
HYD: రామన్నకుంట, తిరుమలగిరి చెరువుల అభివృద్ధిపై కంటోన్మెంట్ బోర్డులో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్, ఈఈ హరికృష్ణ, సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు అధికారులతో ఎమ్మెల్యే శ్రీగణేష్ అత్యవసర సమావేశం నిర్వహించారు. చెరువుల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను గురించి సమగ్రంగా చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెరువుల అభివృద్ధికి కావలసిన ప్రాజెక్ట్ రిపోర్టులు కూడా సిద్ధమయ్యాయని పేర్కొన్నారు.