Locations: Hyderabad

  • ఘనంగా నాభిశీల బొడ్రాయి మహోత్సవం

    మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఔషాపూర్ గ్రామంలో నిర్వహిత నాభిశీల బొడ్రాయి మహోత్సవంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ మహోత్సవంలో ప్రజల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మహేష్ గౌడ్, ముల్లి పావని, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  • నగరంలో నకిలీ సర్టిఫికెట్లు

    HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు పెరుగుతున్నాయి. ఈ మధ్య నార్సింగ్ మున్సిపాలిటీల్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా బండారం బయట పడింది. ఇన్‌స్టంట్ అప్రూవల్ సిస్టం ఉండడంతో కొన్ని మీ సేవ కేంద్రాలు దీన్ని దుర్వినియోగం చేశాయని అధికారులు గుర్తించారు.

  • విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే

    మేడ్చల్: మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్మే చామకూర మల్లారెడ్డి కీసర మండల కేంద్రంలోని శ్రీ మరియమ్మ ఆలయంలో జరిగిన మరియమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో అందరూ మంచిగా ఉండాలని ఆకాంక్షించారు.
  • రైల్వే గేట్ సమస్యకు త్వరలో పరిష్కారం

    మేడ్చల్: గౌతమ్ నగర్‌లో దశాబ్దకాలంగా నెలకొన్న రైల్వే గేట్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఆర్‌యూబీ నిర్మాణ చర్యలు చేపడుతున్నట్లు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రైల్వే, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ప్రాజెక్టు అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్‌తో నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులు సమన్వయంతో త్వరగ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
  • పొడవైన మేక పోతులకు డిమాండ్

    HYD: బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ మెహదీపట్నం పరిధిలోని టోలిచౌకి, నానల్‌నగర్, రేతిబౌలి, జియాగూడ ప్రాంతాల్లో మేకలు, పొటేళ్లు, మేక పోతుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పొడవైన మేక పోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక్కో మేక పోతు ధర రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.

  • టెంపుల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

    HYD: సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొని కమిటీని సన్మానించారు. ఛైర్మన్‌గా ప్రభాకర్ యాదవ్, సభ్యులుగా నరేందర్ యాదవ్, జాజుల ఆంజనేయులు, నాగులపల్లి మల్లేశ్, వి.సంతోష్, రామ్ సాయికుమార్, బట్టు బిక్షపతి, నందికంటి నాగమణి నియమితులయ్యారు.
  • బ్రహ్మోత్సవాల్లో పోలీసుల సందడి

    HYD: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అదనపు డీసీపీ (ట్రాఫిక్-2) రామదాసు, సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్, బీజేవైఎం గోల్కొండ జిల్లా అధ్యక్షుడు నితిన్ నంద్కర్ నృత్యాలతో సందడి చేశారు. ఊరేగింపులో పాల్గొన్న పోలీసు అధికారులు శ్రీవారిపై తమ భక్తిని చాటుకున్నారు.
  • ‘ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రించకుంటే పర్యావరణానికి పెనుముప్పు’

    HYD: ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రించకుంటే పర్యావరణానికి పెనుముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. నాలాల ద్వారా అవి చెరువుల్లోకి చేరి పర్యావరణానికి సవాలగా మారుతున్నాయి. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ‘పొల్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్’ అంశంపై సదస్సు జరిగింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై, పలు సూచనలు చేశారు.

     

  • నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

    HYD: మోతీనగర్ సమీపంలోని పీఆర్‌నగర్‌లో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నాయని ఆలయ ఈఓ గుమ్మడిదల సుధాకర్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో స్వామి శాంతికల్యాణం, పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. చివరి రోజు ఆదివారం ఉంటుందని వెల్లడించారు.
  • నేటి నుంచి బడిబాట

    HYD: 2025-26 విద్యా సంవత్సరానికి విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని నేటి నుంచి ఈ నెల 19 వరకు నిర్వహిస్తోంది. చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులు, బాల కార్మికులు, ఇతర కారణాలతో పాఠశాలకు రాని చిన్నారులను గుర్తించి, వారిని తిరిగి బడికి రప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. బంజారాహిల్స్ దేవరకొండ బస్తీలో గతేడాది బడి మానేసిన విద్యార్థుల ఇళ్లలో ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు.