HYD: నగరంలోని ఆర్టిలరీ సెంటర్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న అయిదో బ్యాచ్‌కు చెందిన అగ్నివీరుల పాసింగ్‌ఔట్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించినట్లు రక్షణ పౌరసంబంధాల అధికారులు ప్రకటనలో తెలిపారు. పలని పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమానికి ఆర్టిలరీ సెంటర్ కమాండెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్ట్రక్టర్ బ్రిగేడియర్ రాహుల్ తప్లియాల్ వీర సైనికుల స్మారకస్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబరచిన అగ్నివీరులకు బ్యాడ్జిలను అందజేశారు.
Locations: Hyderabad
-
కుమార్తెను వేధిస్తున్నాడని.. బాలుడి హత్య
HYD: కాప్రాలో ఓ కుటుంబం తమ కూతురిని వేధిస్తున్నాడన్న అనుమానంతో 16 ఏళ్ల బాలుడు ఆయాన్‌ను ట్రాప్ చేసి హత్య చేశారు. బాలుడిని కాప్రా వద్దకు పిలిపించి కుటుంబం మొత్తం మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. తీవ్ర గాయాలైన ఆయాన్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
-
VIDEO: హైడ్రా కూల్చివేతలు
HYD: సికింద్రాబాద్‌లోని బేగంపేట, ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నాలా విస్తీర్ణం కుంచించుకుపోవడంతో వర్షం వస్తే కాలనీల్లోకి వరద నీరు చేరుతోందని స్థానికులు కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాలతో బుల్డోజర్ల సహాయంతో నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గనున్నాయి.
-
భారీగా తగ్గిన మామిడి ధరలు
HYD: హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మామిడి ధరలు భారీగా తగ్గాయి. వేసవిలో కిలో రూ.100-120గా ఉన్న మామిడి ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.50 నుంచి రూ.60 చొప్పున అమ్ముతున్నారు. వేసవి ముగియడం, మిగిలిన స్టాక్‌పై నష్టం రావచ్చనే అవకాశం ఉండడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
-
అవుటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 11 వద్ద నిలిచిన వాహనాన్ని డీసీఎం ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన యాదగిరి(40) డీసీఎం వాహనంలో కోళ్ల ఫీడ్‌లోడ్ చేయించి డ్రైవర్ గణేష్‌తో కలిసి ఇబ్రహీంపట్నం ప్రాంతానికి వస్తుండగా రహదారిలో నిలిపి ఉన్న వాహనాన్ని డ్రైవర్ గమనించకుండా ఢీకొట్టడంతో యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు.
-
వరద ముంపు సమస్యలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం
HYD: వరద ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్‌నాయక్, జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. హస్మత్‌పేట్‌లోని పికెట్ నాలాను తనిఖీ చేసిన రంగనాథ్ ప్యాట్నీ వద్ద 17 మీటర్ల నాలా ఎగువన 6-7 మీటర్లకు కుంచించుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మా నగర్ ఫేజ్-1లో చంద్ర ప్రియ(16) అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆల్విన్ కాలనీలోని విజేత జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న చంద్ర ప్రియ నాలుగు సబ్జెట్లలో ఫెయిల్ అవ్వటంతో మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో సూసైడ్ నోట్ లభ్యంమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
సికింద్రాబాద్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటన
HYD: జీహెచ్ఎంసీ కమిషనర్ RV కర్ణన్ గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల గురించి ట్రాఫిక్ ఏసీపీ జీ. శంకర్ రాజు, గోపాల పురం ట్రాఫిక్ ఎస్ఐ సతీష్‌రెడ్డి, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు కమిషనర్‌లకు వివరించారు. స్టేషన్‌కు ఎదురుగా ఉన్న బస్‌స్టాండ్‌ను HMRL పాత గాంధీ ఆసుపత్రికి మార్చాలని కోరినట్లు తెలిపారు.
-
‘ప్లాస్టిక్ భూతం’పై ప్రజా అవగాహన ప్రదర్శన
HYD: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రాణాంతక ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిలువరించాలి, పర్యావరణాన్ని కాపాడాలి’ అని కాప్రాలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంతో కలుగుతున్న నష్టం, పర్యావణానికి కలుగుతున్న చేటుపై ప్రదర్శన చేశారు. ఈసీఐఎల్, ఏపీఐఐసీ కాలనీ, కమలానగర్‌లో భారీ ప్రదర్శన చేపట్టారు.
-
హైలైఫ్ ఎగ్జిబిషన్..
హైదరాబాద్: నగరంలోని నొవాటెల్‌లో జూన్ 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు హైలైఫ్ ఎగ్జిబిషన్ ఈవెంట్ నిర్వహించనున్నారు. 350 మందికిపైగా డిజైనర్స్ రూపొందించిన డిజైన్లను ఈ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైలైఫ్ ఎగ్జిబిషన్ ఈవెంట్ తేదీలను ప్రకటించారు. నటి దివి, మిస్ తెలంగాణ-2023 ఉర్మిళా చైహాన్, మరికొంత మంది ఫ్యాషన్ లవర్స్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.