HYD: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సందర్భంగా మంజు థియేటర్ లేన్ వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నపెల్టోఫోరం చెట్టును అక్కడి నుంచి తరలించి మరోచోట సురక్షితంగా నాటామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నార్త్‌జోన్ ఏసీపీ జి. శంకర్‌రాజు మాట్లాడుతూ.. చెట్టు కొమ్మలు వాహనాల గమనానికి అంతరాయం కలిగించడంతో చెట్టును మరోచోటుకు విజయవంతంగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
Locations: Hyderabad
-
పర్యావరణ దినోత్సవం.. 100 మొక్కలు
HYD: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలోని 6వ వార్డులోని ట్రాన్స్‌పోర్టు రోడ్డు ఆసియన్ పెయింట్స్ కాలనీ సమీపంలో చెత్త కుండి వద్ద ఉన్న చెత్తను తొలగించారు. అనంతరం సుమారు 100 మొక్కలను కంటోన్మెంట్ బోర్డ్ శానిటేషన్ ఇన్స్‌స్పెక్టర్ పుష్పెంధర్ గుప్తా, వాకింగ్ చేసే సభ్యులతో కలసి నాటారు.
-
సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
మేడ్చల్: రేపు తిరుమలాపూర్ తుర్కపల్లి మండలంలో జరగనున్న సీఎం బహిరంగ సభ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు పరిశీలించారు. అనంతరం సభ స్థలి ఏర్పాట్లు, భద్రత చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సందర్శించారు.
-
ఉరుములు, మెరుపులతో వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
మేడ్చల్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ మండిపోగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. కుషాయిగూడ, కాప్రా, ఈసీఐఎల్, ఏఎస్ రావ్ నగర్, చర్లపల్లి, చక్రీపురం, నాగారం, రాంపల్లి, కీసర తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షంతో ఈసీఐఎల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. వర్షం కారణంగా రోడ్లపైకి వరదనీరు చేరడంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది.
-
యువకుడి అదృశ్యం
మేడ్చల్: తమ్ముడికి తన ఫోన్‌ను రిపేర్ చేయడానికి బయటకు వెళ్తున్నానని చెప్పి అన్న అదృశ్యమైన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. తమ్ముడు మణికంఠకు తన మొబైల్ ఫోన్ రిపేర్ చేయడానికి బయటకు వెళ్తున్నానని దొంత వెంకట రమణ (19) చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత
HYD: మొక్కలు నాటడం వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గాంధీ సూపరింటెండెంట్ డా. రాజకుమారి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఆమె ఆసుపత్రి ఆవరణలో వైద్యులు, సిబ్బందితో కలసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహణ కల్పిస్తూ విద్యార్థులతో కలసి ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహణ కల్పించాలన్నారు.
-
కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే
HYD: బస్తీల అభివృద్దిలో భాగంగా ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్ది పేదలకు పక్కా ఇండ్ల నిర్మాణం చేయడమే రేవంత్ ప్రభుత్వ ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. స్థలం ఎంపిక కోసం ఎమ్మెల్యే గురువారం రెవెన్యూ అధికారులతో కలిసి మోండా డివిజన్ మారేడ్‌పల్లి, అంబేద్కర్‌నగర్‌లో పర్యటించి స్థలాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు.
-
రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్లు
మేడ్చల్: తూంకుంట మున్సిపల్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తూంకుంట మున్సిపల్ పరిధి శామీర్‌పేట్‌లో ఓ వ్యక్తికి సంబంధిన రెండు ఇండ్లకు సంబంధించి రూ.20వేల లంచం తీసుకుంటుండగా బిల్ కలెక్టర్లు రామ్ రెడ్డి, శ్రావణ్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.
-
గంజాయి విక్రయ కేసులో కానిస్టేబుల్ అరెస్టు
రంగారెడ్డి: గంజాయిని ఓ వ్యక్తి ద్వారా విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ దొరికిపోయిన ఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. తాండూరులో పనిచేస్తున్న గులాం సుల్తాన్‌అహ్మద్ సీజ్ చేసిన కిలోన్నర గంజాయిని తన బంధువైన అంజాద్ ద్వారా అమ్మడానికి ప్రయత్నించాడు. తనిఖీలు చేస్తున్న క్రమంలో అంజాద్‌ను అరెస్ట్ చేసి విచారించగా కానిస్టేబుల్ వ్యవహారం బయటపడింది. ఇద్దరిని రిమాండ్‌కి తరలించినట్టు సీఐ విజయ్ కుమార్ తెలిపారు.
-
ఆలయపూజలో మాజీ కేంద్ర మంత్రి
HYD: ఓల్డ్‌బోయిన్‌పల్లి, హస్మత్ పేట్‌లోని శివ దుర్గ ఎల్లమ్మ సమేత దేవాలయ నిర్మాణ పనులలో భాగంగా గురువారం జరిగిన గడప పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ బండి రమేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి పూనుకున్న పీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరిని, ఆలయ కమిటీ ప్రతినిధులను వారు అభినందించారు.