Locations: Hyderabad

  • నూతన శివరేజ్ పైప్‌లైన్ ప్రారంభం

    మేడ్చల్: బాలకృష్ణ నగర్ ఎల్లమ్మ గుడి లైన్‌లో డివిజన్ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.18 లక్షలతో నూతన శివరేజ్ పైప్‌లైన్‌ను కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ప్రారంభించారు. త్వరలో మరో 500 మీటర్ల పైప్‌లైన్ పనులు ప్రారంభిస్తామని, రామంతపూర్ బగాయత్‌లో పూర్తిస్థాయి శివరేజ్ లైన్ వేయిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పడిగం నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

  • దేవాలయ ముఖద్వారం ప్రారంభోత్సవం

    మేడ్చల్: హస్మత్ పేట పరిధిలో శ్రీ దుర్గామాత, పరమేశ్వర సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వహకుడు దండగుల యాదగిరి ఆధ్వర్యంలో భక్తులకు అన్న వితరణ నిర్వహించారు.

  • బీజేపీ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిజాంపేటలోని జడ్పీహెచ్‌ఎస్ స్కూల్, శ్రీరాములకుంట పార్క్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి,
    నిజాంపేట అధ్యక్షులు బిక్షపతి యాదవ్, బాచుపల్లి అధ్యక్షులు ప్రసాద్ రాజు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • సూట్‌కేసులో యువతి మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు

    మేడ్చల్: బాచుపల్లిలో బుధవారం కలకలం రేపిన ట్రావెల్‌ బ్యాగ్‌లో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతదేహం నేపాల్‌కు చెందిన యువతిగా గుర్తించారు. సీసీ కెమారాల ఆధారంగా నిందితుడు నేపాల్‌కు చెందిన విజయ్‌గా గుర్తించిన్నట్టు పోలీసులు తెలిపారు. మే 23న యువతిని హత్య చేసి, ట్రావెల్‌ బ్యాగ్‌లో పెట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేపీహెచ్‌బీలో సూట్‌కేసు కొనుగోలు చేసినట్టు గుర్తించారు.

  • ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం.. స్థానికుల ఆందోళన

    మేడ్చల్:  టెంపుల్ అల్వాల్ బండబస్తీ వీధి మధ్యలోని ఓ పాత విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది. వర్షాకాలంలో విద్యుదాఘాతం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వీధిలోని పలు స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ ఈ స్తంభాన్ని మార్చకుండా వదిలేశారు. అధికారులు వెంటనే స్పందించి, స్తంభాన్ని సిమెంట్ స్తంభంతో భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

  • పీఎస్‌ను సందర్శించిన కోటిరెడ్డి

    మేడ్చల్: జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను డీసీపీ కోటిరెడ్డి గురువారం సందర్శించారు. స్టేషన్‌లోని రికార్డులను తనిఖీ చేసి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కొత్తగ నిర్మాణమవుతున్న పీఎస్‌ను పరిశీలించారు. అదేవిధంగా బక్రీద్ పండుగ సందర్భంగా సిద్దిపేట్ – హైదరాబాద్ రాజీవ్ రహదారి అచ్చాయిపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్‌ను సందర్శించారు.

  • చెత్త నిల్వతో వాహానదారుల ఇబ్బందులు

    మేడ్చల్: గౌతంనగర్ డివిజన్ ఉత్తమ నగర్-ఏవోసీ మార్గంలో రోజులు తరబడి చెత్త నిల్వలు పేరుకుపోయాయి దుర్వాసన వెదజల్లుతోంది. అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, ఉదయం వేళల్లో నడకకు వేళ్లే స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని చెత్త నిల్వలను డంపింగ్ యార్డుకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

  • ఆలయ వార్షిక మహోత్సవం

    మేడ్చల్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ – వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన, శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో బీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి’

    HYD: రేణుకనగర్ – సైనిక విహార్ ప్రధాన రహదారిలో మ్యాన్ హోల్ నుంచి మురుగు నీరు పొంగి రోడ్డుపై పారుతోంది. దీంతో బాటసారులు, వాహన దారులు ఇబ్బందులు పడుతు న్నారు. చాలా రోజులుగా సమస్య వేధిస్తున్నా.. అధికారులు తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారని స్థానికులు తెలిపారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: మంత్రి

    హైదరాబాద్: పర్యావరణాన్ని పరిరక్షించుకొని భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మన అందరిపై ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. పీసీబీ కార్యాలయంలో వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే వేడుకల్లో మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.