HYD: వందల సంవత్సరాల నాటి భూ దస్త్రాలు కలిగిన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (రాజ్యాభిలేఖ పరిశోధనాలయం) లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తార్నాకలోని ఈ పరిశోధనాలయంలో పనిచేసే సిబ్బందిలో కొందరు భూ కబ్జాదారులతో కుమ్మక్కయి విలువైన పత్రాలను దారిమళ్లిస్తున్నారన్న ఆరోపణలతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్పందించిన విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Locations: Hyderabad
-
మూడు రోజులపాటు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
HYD: బీకేగూడ-ఎస్‌ఆర్‌నగర్ ప్రధాన రహదారిలోని బల్కంపేట శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక ప్రత్యేక అలంకరణలో స్వామివారు బహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. దేవస్థానం ఫౌండర్ ఛైర్మన్ బొడ్డు కుమార్ గౌడ్, కార్యనిర్వహణాధికారి ఎస్. నరేందర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈవో తెలిపారు.
-
మొక్కలు నాటి కాలుష్యంపై యుద్ధం చేద్దాం: డా. భద్ర పిలుపు
HYD: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగస్వామ్యం అవ్వాలని ప్రపంచ పర్యావరణ సంస్థ(WEO) అధ్యక్షులు డా.సీహెచ్ భద్ర పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో సంస్థ బృందంతో కలిసి ఆయన మొక్కలు నాటారు. పర్యావరణానికి, జీవ కోటికి హాని కలిగించే కాలుష్య కారక ప్లాస్టిక్‌పై యుద్ధం చేయాలన్నారు. ఈసందర్భంగా ప్లాస్టిక్ రహిత భూగోళాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేశారు.
-
మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం
HYD: మహబూబ్ మాన్షన్ మార్కెట్లోని గరుడ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 6 నుంచి 8 వరకు మహాకుంభాభిషేకం, సీతారాముల కల్యాణ మహోత్సవం కరపత్రం ఆవిష్కరణలో ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్ చేగూరి వెంకటరమణ తెలిపారు. మార్కెట్‌లోని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రిట్రేడర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉత్సవ వివరాల తెలిపారు. వెంకటరమణ మాట్లాడుతూ.. మూడురోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు.
-
తల్వార్‌తో హల్‌చల్.. బీఆర్ఎస్ నేతపై కేసు
మేడ్చల్: జవహర్ నగర్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్‌పై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బాలాజీనగర్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలలో తల్వార్ తిప్పుతూ హల్‌చల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేక్‌ను తల్వార్‌తో కట్ చేసి సామాజిక మాధ్యమాలలో వీడియోలు పోస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ కానిస్టేబుల్స్ అరెస్టు
మేడ్చల్: కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో ఏపీకి చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ అరెస్టయ్యారు. తిరుపతి టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ గుణశేఖర్ (40), హెడ్‌కానిస్టేబుల్ రామచంద్ర అనే ఇద్దరిని సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ను బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ కేసులో సుమారు రూ. 2 కోట్ల విలువైన 820 గ్రాముల డ్రగ్, డిజిటల్ వెయిట్‌మిషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
ఉచిత వైద్య శిబిరం
మేడ్చల్: వాసిరెడ్డి మెడికేర్ క్లినిక్ పదో వార్షికోత్సవం సందర్భంగా గురు, శుక్ర వారాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. నిజాంపేట భవ్యాస్ ఆనందం సమీపంలోని ఆసు పత్రిలో రెండు రోజుల పాటు నిర్వహించే కార్య క్రమంలో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహిస్తామని ఆసుపత్రి అధినేత డాక్టర్ వాసిరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని పరిసరవాసులు వినియోగించుకోవాలని సూచించారు.
-
బక్రీద్ పండుగ.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
HYD: బక్రీద్ పండుగ సందర్భంగా పాతబస్తీ మీర్ ఆలం ఈద్గా నమాజుకు వచ్చే వారి కొసం వసతుల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, వక్ఫ్ బొర్డ్ ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని పరిశీలించారు. వారితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు వసతుల ఏర్పాట్లను సమీక్షించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
-
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
మేడ్చల్: కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన వీరయ్య రెడ్డమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ: 1 .50 లక్షల చెక్కును గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు చేతుల మీదుగా అందుకున్నారు. చెక్కు అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపారు.
-
కార్పొరేటర్‌కు నివాళులు అర్పించిన నేతలు
మేడ్చల్: GHMC కౌన్సిల్ సమావేశం అనంతరం అస్వస్థతకు గురై గుండెపోటుతో మృత చెందిన AIMIM కార్పొరేటర్ మహమ్మద్ ముజఫర్ హుస్సేన్‌కి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ బొంతుశ్రీదేవి యాదవ్ నివాళులర్పించారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఛాతిలో చిన్ననొప్పి రావడంతో కౌన్సిల్ సమావేశం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటి నుంచి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మరణించారు.