Locations: Hyderabad

  • భూ భారతి సదస్సులో మాజీ ఛైర్‌పర్సన్

    మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపల్ కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి సదస్సులో  ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరయ్యారు.  ఆయన మాట్లాడుతూ..  భూ భారతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి, భూమి సంబంధిత సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. జూన్3 నుంచి జూన్20 వరకు కొనసాగుతుందని తెలిపారు. రైతులు సమస్యలను ఫారాల ద్వారా అధికారులకు తెలియజేయాలని సూచించారు.

  • సెవెరేజ్ లైన్ పనుల పరిశీలన

    మేడ్చల్: హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేష్‌నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సెవెరేజ్ లైన్ పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, HMWSSB ఏఈ , GHMC ఏఈ, కాలనీవాసులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ.. పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు.

  • ఘనంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

    మేడ్చల్: మూసాపేట జనతా నగర్‌లోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో బుధవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులను బండి రమేష్ అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముక్కల వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.

  • మంచినీటి పైప్‌లైన్ జంక్షన్‌ల ఏర్పాటుకు చర్యలు

    మేడ్చల్: బోడుప్పల్ నగరపాలక సంస్థ 21డివిజన్ మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్, డివిజన్‌లో మంచినీటి పైప్‌లైన్ జంక్షన్‌ల ఏర్పాటు కోసం HMWSSB జనరల్ మేనేజర్ సునీల్ కుమార్‌ను కోరారు. దీంతో మేనేజర్ మమత, ఆమె బృందంతో కలిసి పరిశీలన చేశారు. మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తామని, మిగిలిన పనులను  పూర్తిచేస్తామని వారు హామీఇచ్చారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు ఎలిగొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

  • ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్‌.. స్పందించిన మంత్రి

    HYD: ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ విచారాణ వ్యక్తం చేశారు. ఇందులో 92మంది అనారోగ్యానికి గురవ్వగా.. 18మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, మిగతా వారికి 6 వైద్యబృందాలు చికిత్స అందిస్తున్నాయి. డైట్ కాంట్రాక్టర్‌ను తొలగించి, కమిటీ విచారణకు ఆదేశించారు. డైయిట్ కారణంగానే ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా తెలుస్తుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

     

  • జీహెచ్‌ఎంసీలో డీజిల్ దోపిడీ

    HYD: దోమల నివారణ కార్యక్రమాల పేరిట జీహెచ్‌ఎంసీ అధికారులు రోజూ వేలాది లీటర్ల డీజిల్‌ను దోచుకుంటున్నారు. ఏటా రూ.20 కోట్ల ప్రజాధనం స్వాహా అవుతోంది. ‘వన్ డే.. వన్ డివిజన్’ కార్యక్రమంతో డీజిల్ చోరీ తగ్గకపోగా మరింత పెరిగింది. గతంలో డివిజన్ సూపర్‌వైజర్లు, సిబ్బంది మాత్రమే వాటాలు తీసుకోగా, ఇప్పుడు సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్ల సిబ్బంది ఇంధన కొనుగోళ్లలో పోటీపడుతున్నారు.

  • బక్రీద్ కోఆర్డినేషన్ సమావేశం

    HYD: రానున్న బక్రీదు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, మతపెద్దలు, ఆయా శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్, శానిటేషన్ రూల్స్ పాటించాలని సూచించారు. అత్యవసరమైతే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ అనుదీప్, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూమ్ ప్రారంభోత్సవం

    మేడ్చల్: డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లో నూతనంగా ఏర్పాటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి, వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
  • విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

    మేడ్చల్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ గూడ్స్ రోడ్‌లో శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవాలయంలో పోచమ్మ, ఎల్లమ్మ, బంగారు మైసమ్మ,ముత్యాలమ్మ, ఉప్పలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన ఇంఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు జిల్ల జీత్ రావు, బాబురావు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

  • బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన

    HYD: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు. నగర వ్యాప్తంగా వీధిలైట్లు వెలగకపోవడం, రోడ్లు దెబ్బతినడం, తరచూ సీవరేజ్, డ్రైనేజీ సమస్యలు తలెత్తడంతో లాంతర్లు, పారిశుద్ధ సిబ్బంది వేషధారణలో నిరసన తెలిపారు. ప్రభుత్వం మారినా సమస్యలు అలాగే ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే ఆయా డివిజన్ల పరిధిలోని సమస్యలను సుమోటోగా స్వీకరించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.