Locations: Hyderabad

  • ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

    HYD: బీజేపీ పార్టీ నిర్వహించిన ప్రజా సమస్యలపై బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం ప్రతినిధి బృందం బుధవారం వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వహణపై చట్టబద్ధ నియంత్రణ అవసరం ఉందని అందులో పేర్కొన్నారు.

  • రైలు పట్టాలపై వ్యక్తి అనుమానస్పద మృతి

    మేడ్చల్: రైలు పట్టాలపై వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన ఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రైల్వే పట్టాలపై వ్యక్తి అనుమానాస్పద మృతి చెందిన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి చేతికి ఆరు వేళ్ళు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి రైల్వే పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్‌న్యూస్

    • రంగారెడ్డి: భూ సమస్యలను పరిష్కరించండి.. రైతుల నిరసన
    • ఘోర రోడ్డు ప్రమాదం..ట్రాలీ ఆటో, కారు ‘ఢీ’
    • అత్తాపూర్ పీఎస్ పరిధిలో బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి
    • ఘట్కేసర్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు..
    • గోవుల అక్రమ రవాణా.. డీఎస్పీకి ఫిర్యాదు
    • వికారాబాద్: ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
  • హైదరాబాద్ జిల్లా టాప్‌న్యూస్

    • పెళ్లి పేరుతో బాలికపై లైంగికదాడి.. పోక్సో కేసు నమోదు
    • చైన్ స్నాచింగ్స్, దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
    • నకిలీ ఏసీ వైర్లపై టాస్క్ ఫోర్స్ రైడ్స్
    • నోరున్న కార్పొరేటర్లకే నిధులిచ్చే పద్ధతి మారాలి: ఎంపీ ఈటల
    • బాచుపల్లి పీఎస్ పరిధిలో దారుణం.. బ్యాగ్‌‌లో కుళ్లిన మహిళ మృతదేహం
  • మంత్రి ఈటలను కలిసిన బీజేపీ నాయకులు

    మేడ్చల్: మల్కాజిగిరి ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం ఈటల రాజేందర్‌ని జిల్లా బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు ఈటెల రాజేందర్‌ను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లంపేట్ జగన్ గౌడ్ , మేడ్చల్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాఘవ రెడ్డి, తదితరులు ఉన్నారు.

  • పెళ్లి పేరుతో బాలికపై లైంగికదాడి.. పోక్సో కేసు నమోదు

    HYD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(17)పై లైంగికదాడికి పాల్పడిన సునీల్‌ యాదవ్‌(21)పై బంజారాహిల్స్‌ పోలీసులు పోక్సోకేసు నమోదు చేశారు. బీహార్ నుంచి వచ్చి గచ్చిబౌలిలో నివసిస్తున్న సునీల్‌, ఏడాదిగా బాలికను మాయమాటలతో లోబర్చుకొని, స్నేహితుడి గదికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువతితో సంబంధం ఉన్నట్లు తెలిసి బాధితురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు.

  • చైన్ స్నాచింగ్స్, దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు

    HYD: సికింద్రాబాద్ రైల్వే పోలీసులు 4 చైన్ స్నాచింగ్స్, 2 దొంగతనాల కేసులను ఛేదించారు. కొత్తగూడెం నుంచి తంబళ్ల నితిన్, నిజామాబాద్ నుంచి ఇందిరాల రాజేశ్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11.45లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్లుగా పనిచేస్తూ గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్, చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేశారని డీఎస్పీ ఎస్ఎన్‌.జావేద్ వెల్లడించారు.

  • నకిలీ ఏసీ వైర్లపై టాస్క్ ఫోర్స్ రైడ్స్

    HYD: కోఠి ట్రూప్ బజార్‌లోని ఎలక్ట్రికల్ వైర్స్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ ప్రమాదానికి నకిలీ ఏసీ వైర్లు కారణమని నివేదిక రావడంతో ఈ చర్యలు చేపట్టారు. గోల్డ్ మెడల్ కంపెనీ పేరిట నకిలీ వైర్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి, రెండు షాపులలో నకిలీ వైర్లను సీజ్ చేశారు. 

  • ఏఆర్ ఆధారిత ఓపీడీ సేవలు..

    HYD: ప్రపంచంలోనే మొట్ట మొదటి ఏఆర్ ఆధారిత ఓపీడీ సేవలు కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో అందుబాటులోకి వచ్చాయని హాస్పిటల్ ఎండీ డా. గురువా రెడ్డి తెలిపారు. బేగంపేటలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఆర్ ఆధారిత ఓపీడీ సేవలను గురించి వైద్యులకు వివరించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఆధారిత ప్రిస్క్రిప్షన్ ఓపీడీలో రోగి విద్య కోసం ఏఆర్ టెక్నాలజీతో హాస్పిటల్‌లో ప్రవేశ పెట్టినట్లు పేర్కొన్నారు.

  • నోరున్న కార్పొరేటర్లకే నిధులిచ్చే పద్ధతి మారాలి: ఎంపీ

    హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా కొనసాగుతోంది. నగరంలో సమస్యలపై కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు, అధికారులంతా కలిసి చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వీధదీపాలు,  ట్రాఫిక్‌ ఇబ్బందులు పలు అంశాలపై ప్రశ్నలు, సమాధానాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. నోరున్న కార్పొరేటర్లకే నిధులిచ్చే పద్ధతికాకుండా.. పార్టీలతో సంబంధం లేకుండా సమస్యలు ఉన్న అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు.