హైదరాబాద్‌కు చెందిన నిరంజన్ అనే యువకుడు తన తల్లిదండ్రుల పేదరికాన్ని అధిగమించి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించాడు. రోజువారీ కూలీలైన అతని తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ, నిరంజన్ తన ప్రతిభతో దాన్ని అధిగమించాడు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ పాఠశాలలో చదువుకున్న అతడు పగలు తరగతులకు, రాత్రిపూట ఆన్‌లైన్ శిక్షణ తరగతులకు హాజరయ్యేవాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1668 ర్యాంకు సాధించాడు.
Locations: Hyderabad
-
శ్రీకాంత్ చేసినవాటిలో ఆ సినిమాలంటే ఇష్టం: నటి ఊహ
టాలీవుడ్ జంట శ్రీకాంత్, ఊహలది ఆదర్శనీయమైన ప్రేమకథ. తాజాగా ఓఇంటర్వ్యూలో ఊహ తమ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ తన పేరును’ఊహ’గా మార్చారని తెలిపారు. శ్రీకాంత్‌తో కలిసి నటించిన మొదటిసినిమా ‘ఆమె’లోని పెళ్లి సీన్ తర్వాత నిజంగానే తామిద్దరం పెళ్లి చేసుకోవడం చిత్రంగా అనిపిస్తుందని చెప్పారు. శ్రీకాంత్ సినిమాలలో తనకు ‘తారకరాముడు’, ‘ఖడ్గం’ సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు.
-
యువకుడి హత్యకు దారితీసిన చిన్న గొడవ
మేడ్చల్: ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దాడిలో కూలీ మరణించాడు. మృతుడు చిన్నగవని భాస్కర్(30) బోయిగూడకు చెందినవాడు. అతనితో పాటు పనిచేసే సింగారం మణిదీప్ చిన్న కారణాలకే గొడవపడేవాడు. ఆదివారం రాత్రి వారి మధ్య గొడవ జరగగా..మణిదీప్ కత్తితో భాస్కర్‌ను పొడవటంతో తీవ్రంగా గాయపడగా.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
చర్లపల్లి అభివృద్ధి పనుల సమీక్ష
మేడ్చల్: GHMC స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవంతంగా పూర్తైన వినాయక నిమజ్జన కార్యక్రమంపై అధికారులను అభినందించారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పరిశుభ్రత పనులను సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆగిపోయిన పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
-
మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు
మేడ్చల్: యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీనియర్ పాత్రికేయుడు మెరుగు చంద్రమోహన్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఏఎస్ రావు నగర్‌లోని సెంచనరీ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో జిల్లా పాత్రికేయులందరూ పాల్గొని, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరారు.
-
ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
వికారాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 83 ఫిర్యాదులు అందాయి. పెన్షన్లు, భూ సమస్యలు, గృహనిర్మాణ శాఖ, వ్యవసాయం వంటి వాటిపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. మండలాల స్పెషల్ అధికారులు గ్రామాలో పరిశుభ్రత, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను పర్యవేక్షించాలని సూచించారు.
-
రోడ్డు పనులు పరిశీలించిన మాజీ మేయర్
మేడ్చల్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్, పర్వతాపూర్ పోచమ్మకుంటలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి పూర్తి కావడం ద్వారా పర్వతాపూర్, మేడిపల్లి, పీర్జాదిగూడ ప్రాంతాలకు రవాణా సులభతరం అవుతుందని ఆయన అన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు కోరారు.
-
ఆదుకున్న ఆర్.వి. ఫౌండేషన్
మేడ్చల్: పీర్జాదిగూడలోని భగత్ సింగ్ కాలనీలో ప్రమాదవశాత్తు ఒక గుడిసెలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, ఆర్.వి. ఫౌండేషన్ ద్వారా తక్షణ సాయంగా 50 కిలోల బియ్యాన్ని బాధితులకు అందజేశారు. కాలనీలో నీరు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు లేకపోవడం వంటి సమస్యలను గమనించి, వాటిని పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
-
నిన్న ముస్లిం యువకుడు.. నేడు క్రిస్టియన్ యువకుడు🤗
HYD: శ్రీరాంనగర్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. జవహర్‌నగర్‌లో ఇప్పటికే ఒక ముస్లిం యువకుడు గణేశ్ లడ్డూను దక్కించుకోగా..తాజాగా క్రిస్టియన్ యువకుడు డేవిడ్ అదే మార్గంలో నడిచాడు. అడ్డా బాయ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను డేవిడ్ వేలం పాటలో రూ.40 వేలకు దక్కించుకున్నాడు. బొట్టు పెట్టుకుని, ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అంటూ నినాదాలు చేసి మత సామరస్యాన్ని చాటాడు.
-
అమ్మ మాట కోసం జీవితాన్ని త్యాగం చేశా: నటి శ్రీలక్ష్మీ
తెలుగు తెరపై హాస్యనటిగా వెలుగొందిన శ్రీలక్ష్మి తనజీవితంలోని కష్టాలను బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తండ్రి అమర్‌నాథ్ నష్టపోవడం, అనారోగ్యం కారణంగా కుటుంబం ఆర్థికకష్టాల్లో పడిందని ఆమె తెలిపారు. కుటుంబం బతకడం కోసం తనజీవితాన్ని త్యాగం చేయమని తల్లి అడగడంతో, నటనపై దృష్టి పెట్టానని చెప్పారు. హీరోయిన్‌గా అవకాశం వచ్చిన ‘శుభోదయం’ సినిమా సమయంలోనే తండ్రి చనిపోవడంతో ఆఅవకాశం కోల్పోయానని శ్రీలక్ష్మి అన్నారు.