HYD: ఇది షార్క్ ఫైర్ ఫైటింగ్ రోబో. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మనిషి వెళ్లలేని ప్రాంతాల్లోకి అవలీలగా దూసుకెళుతుంది. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఈ రోబో ఏ భవనం మెట్లు అయినా సులభంగా ఎక్కగలదు. ఈ రోబో మంటలను ఆర్పేందుకు నీటిని చల్లడంతోపాటు వేడిని తట్టుకునేందుకు తనపైన కూడా నీటిని చల్లుకుంటూ ముందుకు వెళుతుందని హైదరాబాద్‌లోని హైకోర్టు ఫైర్‌స్టేషన్‌కు చెందిన టెక్నికల్ ఫైర్‌ఫైటర్ కొమరెల్లి తెలిపారు.
Locations: Hyderabad
-
మహానిమజ్జనం.. సర్వం సిద్ధం
TG: గణేశ్ ఉత్సవాలకు ముగింపు పలుకుతూ హైదరాబాద్‌లో నేడు నిమజ్జనోత్సవం ఘనంగా జరగనుంది. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర, బాలాపూర్ లడ్డూ వేలం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సిటీలోని భారీ విగ్రహాలు ఊరేగింపుగా గంగఒడికి చేరనున్నాయి. లక్షలాది మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొననున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
-
రూ.2.3కోట్లు పలికిన గణేశ్ లడ్డూ
TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సన్ సిటీలో ఉన్న రిచ్‌మండ్ విల్లాస్‌లో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో రికార్డు నమోదైంది. ఈ లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది. ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటలో స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పాల్గొన్నారు. ఈసారి వేలం రూ. కోటి నుంచి ప్రారంభమైనట్లు సమాచారం.
-
ఆరోజు ఆలయాలు మూసివేత
HYD: సెప్టెంబర్ 7న (ఆదివారం) చంద్ర గ్రహణం సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. ఆలయం మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు తిరిగి తెరుచుకుంటుందని చెప్పారు. అదేవిధంగా, చిలుకూరు బాలాజీ ఆలయం ఆదివారం సాయంత్రం 4 గంటలకు మూసివేసి, సోమవారం ఉదయం 8 గంటలకు తెరుచుకుంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
-
రేపు నగరమంతా గణపతి శోభయాత్ర
HYD : గణపతి నిమజ్జన ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. వేలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమయ్యాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హైదరాబాద్ చేరుకున్నారు. సుమారు 40 లక్షల మంది ప్రజలు ఈ నిమజ్జనాన్ని వీక్షించే అవకాశం ఉందని గణేశ్ ఉత్సవ సమితి తెలిపింది.
-
రిచ్ మాక్స్‌లో ఘనంగా ఓనం సెలబ్రేషన్స్
HYD: రిచ్‌మాక్స్ ఫిన్‌వెస్ట్ గోల్డ్ లోన్ కంపెనీ రాష్ట్రంలోని 15 శాఖల్లో ఓనం వేడుకలను ఘనంగా నిర్వహించింది. జోనల్ హెడ్ అలెక్స్, సంస్థ పీఆర్వో సీహెచ్ భద్ర ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని రీజినల్ కార్యాలయంలో పండుగను జరిపారు. దేశవ్యాప్తంగా 150 శాఖల్లో ఓనం ఘనంగా జరిగినట్లు ఛైర్మన్ జార్జ్ జాన్ తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. మేనేజర్ ఉపేందర్ పాల్గొన్నారు.
-
గణేశ్ నిమజ్జనానికి హైదరాబాద్ సర్వం సిద్ధం
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకకు జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం జరగనున్న ఈ మహోత్సవం కోసం రూ.54 కోట్లు కేటాయించింది. హుస్సేన్ సాగర్‌తో పాటు, నగరవ్యాప్తంగా 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాట్లు చేసింది. ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథులతో సహా సుమారు 50 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఇందుకోసం 15 వేల మంది సిబ్బంది, 393 క్రేన్లను బల్దియా సిద్ధం చేసింది.
-
పోలీసుల అత్యుత్సాహం.. యువకులపై దాష్టీకం
మేడ్చల్: సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల అత్యుత్సాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయిబాబానగర్‌లోని వినాయక మండపాల వద్ద ఉన్న యువకులపై పోలీసులు రాత్రిపూట దాష్టీకంగా లాఠీచార్జ్ చేశారు. గల్లీల్లో పరుగెత్తించి కొట్టడం సీసీ టీవీలలో రికార్డయింది. ఈ దాడిలో అస్లాం(31), సంతోష్ (28) అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, సురారంలో ఎలాంటి లాఠీచార్జ్ జరగలేదని ఎస్.హెచ్.ఓ తెలిపారు.
-
పసుపు, గాజులతో బల్కంపేట్ రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక అలంకరణ
హైదరాబాద్: బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం కావడంతో ఉదయం నుంచే అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పసుపు కొమ్ములు, రంగురంగుల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. పసుపు పచ్చని కాంతులు, గాజుల చప్పుళ్లు, అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.