Locations: Hyderabad

  • బోనాల మహోత్సవ కార్యక్రమం

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 125 డివిజన్ దేవేందర్ నగర్‌లోని తమిళ్ బస్తీ శ్రీ మరియమ్మ తల్లి బోనాల మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ:సంతోషాలతో ఉండాలని కోరారు.

  • సమాజంలో న్యాయవాద వృత్తికి ప్రత్యేక స్థానం ఉంది: ఎమ్మెల్యే

    HYD: సమాజంలో న్యాయవాద వృత్తికి ప్రత్యేక స్థానం ఉందని, ఆ దిశగా న్యాయం కోసం పరితపిస్తూ ముందుకెళ్లటం అభినందనీయమని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు శంకర్‌పల్లిలో సీనియర్ న్యాయవాది ఉపేందర్ రెడ్డి, జీతేందర్ రెడ్డి లు ఏర్పాటు చేసిన నూతన ‘యూ జె’లా ఛాంబర్‌ని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు.

  • ఫాల్కన్ కేసు.. ప్రధాన నిందితుడి అరెస్ట్

    HYD: ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకేసులో సందీప్ కుమార్ కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సైబారాబాద్‌లో కేసు నమోదైన తర్వాత సందీప్ కుమార్ పారిపోయాడు. ఈ ఘటనలో ఇప్పటికే సందీప్‌ కుటంబం సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి రూ.2.5 కోట్లు విలువైన మూడు కార్లు, 14 స్ధిరాస్తుల పత్రాలు, 3సెల్ ఫొన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

  • కలుషితాహారం ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

    హైదరాబాద్‌: ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో కలుషితాహారం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఆసుపత్రిలో ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్‌ జైపాల్‌రెడ్డిని తొలగిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజను సస్పెండ్‌ చేసింది. ఘటనలో ఒక రోగి మృతి చెందగా, 92 మంది అస్వస్థతకు గురయ్యారు.

  • ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

    HYD: బీజేపీ పార్టీ నిర్వహించిన ప్రజా సమస్యలపై బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం ప్రతినిధి బృందం బుధవారం వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వహణపై చట్టబద్ధ నియంత్రణ అవసరం ఉందని అందులో పేర్కొన్నారు.

  • రైలు పట్టాలపై వ్యక్తి అనుమానస్పద మృతి

    మేడ్చల్: రైలు పట్టాలపై వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన ఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రైల్వే పట్టాలపై వ్యక్తి అనుమానాస్పద మృతి చెందిన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి చేతికి ఆరు వేళ్ళు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి రైల్వే పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్‌న్యూస్

    • రంగారెడ్డి: భూ సమస్యలను పరిష్కరించండి.. రైతుల నిరసన
    • ఘోర రోడ్డు ప్రమాదం..ట్రాలీ ఆటో, కారు ‘ఢీ’
    • అత్తాపూర్ పీఎస్ పరిధిలో బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి
    • ఘట్కేసర్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు..
    • గోవుల అక్రమ రవాణా.. డీఎస్పీకి ఫిర్యాదు
    • వికారాబాద్: ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
  • హైదరాబాద్ జిల్లా టాప్‌న్యూస్

    • పెళ్లి పేరుతో బాలికపై లైంగికదాడి.. పోక్సో కేసు నమోదు
    • చైన్ స్నాచింగ్స్, దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
    • నకిలీ ఏసీ వైర్లపై టాస్క్ ఫోర్స్ రైడ్స్
    • నోరున్న కార్పొరేటర్లకే నిధులిచ్చే పద్ధతి మారాలి: ఎంపీ ఈటల
    • బాచుపల్లి పీఎస్ పరిధిలో దారుణం.. బ్యాగ్‌‌లో కుళ్లిన మహిళ మృతదేహం
  • మంత్రి ఈటలను కలిసిన బీజేపీ నాయకులు

    మేడ్చల్: మల్కాజిగిరి ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం ఈటల రాజేందర్‌ని జిల్లా బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు ఈటెల రాజేందర్‌ను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లంపేట్ జగన్ గౌడ్ , మేడ్చల్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాఘవ రెడ్డి, తదితరులు ఉన్నారు.

  • పెళ్లి పేరుతో బాలికపై లైంగికదాడి.. పోక్సో కేసు నమోదు

    HYD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(17)పై లైంగికదాడికి పాల్పడిన సునీల్‌ యాదవ్‌(21)పై బంజారాహిల్స్‌ పోలీసులు పోక్సోకేసు నమోదు చేశారు. బీహార్ నుంచి వచ్చి గచ్చిబౌలిలో నివసిస్తున్న సునీల్‌, ఏడాదిగా బాలికను మాయమాటలతో లోబర్చుకొని, స్నేహితుడి గదికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువతితో సంబంధం ఉన్నట్లు తెలిసి బాధితురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు.