Locations: Hyderabad

  • చర్లపల్లిలో పర్యటించిన కార్పొరేటర్

    మేడ్చల్: చర్లపల్లిలో ఎస్పీడీసీఎల్ ఏఈ బాబురావు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవీ యాదవ్‌తో కలిసి పర్యటించారు. వేలాడుతున్న వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల లోటుపాట్లను పరిశీలించి, వంగిపోయిన స్తంభాలను వెంటనే మార్చాలని ఆదేశించారు. 2-3 రోజుల్లో స్తంభాలు మార్చి సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నాగిళ్ల బాల్ రెడ్డి, బుడిగ ప్రభు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

  • సర్దార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

    HYD: బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్ పరామర్శించారు. సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్‌ను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని, ఇప్పటికైనా అరెస్టు చేయకపోతే బోరబండలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. 

  • అయోధ్య రామ్‌దర్బార్‌ ఆలయాలకు ద్వారాల ఏర్పాటు

    HYD : అయోధ్య రామమందిరం భవనంలోని పైఅంతస్తులో గురువారం ప్రారంభం కానున్న రామ్‌ దర్బార్‌ మందిరానికి సంబందించి ద్వారాలను తయారు చేసి అక్కడ ఏర్పాటు చేసినట్లు కార్ఖానాలోని అనురాధ టింబర్‌ ఎస్టేట్‌ నిర్వాహకుడు చదలవాడ శరత్‌బాబు తెలిపారు. ఇదివరకే ప్రధాన ద్వారాన్ని తమ సంస్థ ఆధ్వర్యంలోనే తయారు చేసి ఏర్పాటు చేశామని, దీనికి ప్రధాని మోదీ ప్రశంసలు లభించడం సంతోషంగా ఉందన్నారు.

  • నావికాదళంలో అత్యున్నత అధికారిగా భాగ్యనగరం కుర్రాడు..!

    HYD: నగరానికి చెందిన ఓ యువకుడు భారత నావికాదళంలో సబ్‌ లెఫ్టినెంట్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని MJCET నుంచి మహ్మద్‌ అబూబకర్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌ అయ్యారు. అబూబకర్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(SSB)లో అర్హత సాధించారు. కేరళలోని ఎజిమలలోని ఇండియన్‌ నావల్‌ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న అతను అధికారికంగా భారత నావికాదళంలో అధికారిగా చేరారు.

  • లైసెన్సు ఉన్న పెంపుడు శునకాలకు మాత్రమే అనుమతి

    HYD: కేబీఆర్ పార్క్‌లో లైసెన్సు ఉన్న పెంపుడు శునకాలను మాత్రమే అనుమతించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కేబీఆర్‌ పార్కులో చేపట్టిన పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఉదయపు నడకకు వచ్చేవారి కోసం పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. పార్క్ చుట్టూ హెచ్‌సిటీ కోసం పైవంతెనలు, అండర్‌పాస్‌లు కోర్టు ఆదేశాలతో సున్నిత ప్రాంత పరిధిలో చేస్తున్నట్లు ప్రాజెక్టు ఇంజినీర్లు వివరించారు.
  • నేడు GHMC కౌన్సిల్‌ మీటింగ్.. ప్రశ్నల దాడికి కార్పొరేటర్లు రెడీ

    HYD: ప్రశ్నలు.. ప్రజా సమస్యలే ఎజెండాగా నిలదీయడానికి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం జరిగే GHMC సాధారణ సర్వసభ్య సమావేశంలో చర్చించడానికి 146మంది సభ్యులు.. 121 ప్రశ్నలకు సమాధానాలు అడిగారు. కానీ మేయర్ మాత్రం 24ప్రశ్నలను మాత్రమే ఎంపిక చేశారు. వీటిలో ఎక్కువగా ఇంజినీరింగ్ విభాగంలోని రోడ్ల నిర్వహణపై ఉన్నాయని తెలిసింది. దీంతోపాటు టౌన్ ప్లానింగ్, దోమలు, కుక్కలు, శానిటేషన్ అంశాలపై ప్రశ్నలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

  • ‘వాక్‌వే పనులు వేగవంతం చేయాలని’

    HYD: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్  కేబీఆర్ పార్క్‌ వాక్‌వే పనులను పరిశీలించి, వాటిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లైసెన్స్‌ తీసుకున్న పెట్‌ డాగ్స్‌ను మాత్రమే పార్క్‌లోకి అనుమతించాలని సూచించారు. పార్క్ పనులు సెన్సిటివ్‌ జోన్‌ పరిధిలోనే చేపడుతున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ సుభద్రా దేవి, డీసీ సమ్మయ్య, ఎస్‌ఈ శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
  • ఎర్రగడ్డలో ఆసుపత్రిలో కలుషితాహారం ఘటన.. 18 మంది ఉస్మానియాకు తరలింపు

    HYD : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషితాహారం ఘటనలో మంగళవారం ఒక రోగి మృతి చెందడంతో పాటు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. బుధవారం కూడా పలువురు రోగులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో 18 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషితాహార ఘటనపై ఎర్రగడ్డ ఆసుపత్రిలో డీఎంఈ, డీఎంహెచ్‌వో, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడుల పెంపు

    HYD: ప్రభుత్వ పెద్దాస్పత్రుల్లో అవయవ మార్పిడులను పెంచాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం సర్కారు దవాఖానాల్లో ప్రత్యేక అవయవమార్పిడి విభాగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా దవాఖానాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ప్రత్యేక అవయవ మార్పిడి సర్జరీ విభాగాన్ని ఏర్పాటు చేసి, విభాగాధిపతిని నియమించనున్నారు.  ఆ తర్వాత వాటిలో కనీసం ఐదారు పోస్టుగ్రాడ్యుయేట్‌ సీట్ల కోసం NMCకి దరఖాస్తు చేయనున్నారు.

  • GHMCలో బార్లకు భారీగా దరఖాస్తులు.. ఇంకా మూడు రోజులే గడువు

    HYD : GHMCలో 24 బార్లకు మిగిలిన మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని అంచనాలు ఉన్నాయని, దరఖాస్తులు తీసుకోవడానికి నాంపల్లి కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ దశరథ్‌ తెలిపారు. ఈ మధ్యనే రూరల్‌లోని బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. GHMCతో కలుపుకొని 28 బార్లను పునరుద్ధరణకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రస్తుతం GHMC పరిధిలో 24 బార్లకు 356 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.