HYD: మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా నగరంలోని దస్పల్లా హోటల్ వేదికగా సాష్ నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఈ సాష్ ఈవెంట్‌లో తమ క్యాట్ వాక్‌తో అలరించారు. మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ల కోసం పోటీదారులుగా ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఎంపిక కాగా.. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది అలరించారు.
Locations: Hyderabad
-
నూతన ఏసీపీకి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
HYD: చిలకలగూడ డివిజన్ ఏసీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శేషంక్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక శాంతిభద్రతల సమస్యలు, సమస్యాత్మక ప్రాంతాల గురించి వివరించారు. సంఘ విద్రోహ శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏసీపీ శేషంక్ రెడ్డి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
HYD: బాలంరాయిలోని ఎంఎస్ మెకానిక్ షాప్ ముందు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు రాంగోపాల్‌పేట్ నివాసి మొహమ్మద్ యూసుఫ్ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి ఎడమ చేయి మధ్య వేళ్లు చిన్నగా ఉన్నట్లు, యాచకుడై ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ శంకర్ తెలిపారు.
-
సొంత నిధులతో మహనీయుల విగ్రహాలు
HYD: సితాఫలమండీ కూడలిలో బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌ల కొత్త విగ్రహాలను తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. కార్పొరేటర్లు, అధికారులతో కలిసి విగ్రహాల ఏర్పాటు ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, పరిసరాల సుందరీకరణతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
-
నేడు ఉచిత వైద్య శిబిరం
HYD: బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సహకారంతో బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గం, మోండా డివిజన్, టీచర్ కాలనీ, అంబేద్కర్ నగర్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకురాలు సీ వైష్ణవి యాదవ్ తెలిపారు. వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
-
భవన నిర్మాణ కూలీ అనుమానాస్పద మృతి
HYD: బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.మహారాష్ట్రకు చెందిన చిన్నతోకట నివాసి భవన నిర్మాణం కూలీ బీహార్ పరిక(47) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి తనయుడు భవన నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ శంకర్ తెలిపారు.
-
RCB విజయం.. తెలంగాణ సచివాలయం వద్ద ఫ్యాన్స్ సంబరాలు
IPL-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచింది. దీంతో హైదరాబాద్‌లో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. RCB, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వేలాదిగా రోడ్లపైకి తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ సచివాలయం, ట్యాంక్‌బండ్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్పీనగర్, హయత్‌నగర్ సహా పలుచోట్ల సందడి వాతావరణం నెలకొంది. బైక్ ర్యాలీ తీసి, బాణసంచా కాలుస్తూ ఎంజాయ్ చేశారు.
-
‘భూకబ్జా ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలి’
HYD: వంద ఏళ్ల నాటి కురుమ కులస్థుల స్మశాన వాటికను భూకబ్జాదారులు నకిలీ ధ్రువపత్రాలతో ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని అడ్డుకోవాలని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూకబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జెడ్సీ రవికిరణ్, ఎమ్మార్వో పాండు నాయక్, హైడ్రా ఏసీపీ తిరుమల్‌లకు వినతి పత్రాలు సమర్పించారు.
-
ముగింపు దశలో ఫార్ములా-ఈ రేసు దర్యాప్తు!
HYD: ఫార్ములా-ఈ రేసు కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. ఈ నెలాఖరులోపు అభియోగపత్రాలు దాఖలు చేయాలని అవినీతి నిరోధకశాఖ(ACB) అధికారులు భావిస్తున్నారు. విచారణకు రమ్మని మాజీ మంత్రి KTRకు నోటీసులు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఇదేనని తెలుస్తోంది. ఇందులో ప్రధాన నిందితునిగా ఉన్న KTR ద్వారా మిగతా వివరాలు రాబట్టి అనంతరం అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
-
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ
మేడ్చల్: పోచారం మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ ఆఫీస్‌లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఘట్కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వినోద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో మేలు జరుగుతుందని, సంక్షేమ పథకాలు సమృద్ధిగా అందుతున్నాయన్నారు.