Locations: Hyderabad

  • ‘వాక్‌వే పనులు వేగవంతం చేయాలని’

    HYD: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్  కేబీఆర్ పార్క్‌ వాక్‌వే పనులను పరిశీలించి, వాటిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లైసెన్స్‌ తీసుకున్న పెట్‌ డాగ్స్‌ను మాత్రమే పార్క్‌లోకి అనుమతించాలని సూచించారు. పార్క్ పనులు సెన్సిటివ్‌ జోన్‌ పరిధిలోనే చేపడుతున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ సుభద్రా దేవి, డీసీ సమ్మయ్య, ఎస్‌ఈ శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
  • ఎర్రగడ్డలో ఆసుపత్రిలో కలుషితాహారం ఘటన.. 18 మంది ఉస్మానియాకు తరలింపు

    HYD : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషితాహారం ఘటనలో మంగళవారం ఒక రోగి మృతి చెందడంతో పాటు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. బుధవారం కూడా పలువురు రోగులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో 18 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషితాహార ఘటనపై ఎర్రగడ్డ ఆసుపత్రిలో డీఎంఈ, డీఎంహెచ్‌వో, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడుల పెంపు

    HYD: ప్రభుత్వ పెద్దాస్పత్రుల్లో అవయవ మార్పిడులను పెంచాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం సర్కారు దవాఖానాల్లో ప్రత్యేక అవయవమార్పిడి విభాగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా దవాఖానాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ప్రత్యేక అవయవ మార్పిడి సర్జరీ విభాగాన్ని ఏర్పాటు చేసి, విభాగాధిపతిని నియమించనున్నారు.  ఆ తర్వాత వాటిలో కనీసం ఐదారు పోస్టుగ్రాడ్యుయేట్‌ సీట్ల కోసం NMCకి దరఖాస్తు చేయనున్నారు.

  • GHMCలో బార్లకు భారీగా దరఖాస్తులు.. ఇంకా మూడు రోజులే గడువు

    HYD : GHMCలో 24 బార్లకు మిగిలిన మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని అంచనాలు ఉన్నాయని, దరఖాస్తులు తీసుకోవడానికి నాంపల్లి కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ దశరథ్‌ తెలిపారు. ఈ మధ్యనే రూరల్‌లోని బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. GHMCతో కలుపుకొని 28 బార్లను పునరుద్ధరణకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రస్తుతం GHMC పరిధిలో 24 బార్లకు 356 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.

     

  • మిస్‌ యూనివర్స్‌ సన్నాహకాలు

    HYD: మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భాగంగా నగరంలోని దస్పల్లా హోటల్‌ వేదికగా సాష్‌ నిర్వహించారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఈ సాష్‌ ఈవెంట్‌లో తమ క్యాట్‌ వాక్‌తో అలరించారు. మిస్‌ యూనివర్స్‌ తెలంగాణ, మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్ల కోసం పోటీదారులుగా ప్రతి రాష్ట్రం నుంచి 15 మంది ఎంపిక కాగా.. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది అలరించారు.

  • నూతన ఏసీపీకి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

    HYD: చిలకలగూడ డివిజన్ ఏసీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శేషంక్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక శాంతిభద్రతల సమస్యలు, సమస్యాత్మక ప్రాంతాల గురించి వివరించారు. సంఘ విద్రోహ శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏసీపీ శేషంక్ రెడ్డి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
  • గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

    HYD: బాలంరాయిలోని ఎంఎస్ మెకానిక్ షాప్ ముందు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు రాంగోపాల్‌పేట్ నివాసి మొహమ్మద్ యూసుఫ్ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి ఎడమ చేయి మధ్య వేళ్లు చిన్నగా ఉన్నట్లు, యాచకుడై ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ శంకర్ తెలిపారు.

  • సొంత నిధులతో మహనీయుల విగ్రహాలు

    HYD: సితాఫలమండీ కూడలిలో బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌ల కొత్త విగ్రహాలను తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. కార్పొరేటర్లు, అధికారులతో కలిసి విగ్రహాల ఏర్పాటు ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, పరిసరాల సుందరీకరణతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

     

  • నేడు ఉచిత వైద్య శిబిరం

    HYD: బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సహకారంతో బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గం, మోండా డివిజన్, టీచర్ కాలనీ, అంబేద్కర్ నగర్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకురాలు సీ వైష్ణవి యాదవ్ తెలిపారు. వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

     

  • భవన నిర్మాణ కూలీ అనుమానాస్పద మృతి

    HYD: బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.మహారాష్ట్రకు చెందిన చిన్నతోకట నివాసి భవన నిర్మాణం కూలీ బీహార్ పరిక(47) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి తనయుడు భవన నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ శంకర్ తెలిపారు.