Locations: Hyderabad

  • RCB విజయం.. తెలంగాణ సచివాలయం వద్ద ఫ్యాన్స్ సంబరాలు

    IPL-2025 విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) నిలిచింది. దీంతో హైదరాబాద్‌లో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. RCB, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వేలాదిగా రోడ్లపైకి తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ సచివాలయం, ట్యాంక్‌బండ్‌, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, ఎల్పీనగర్‌, హయత్‌నగర్‌ సహా పలుచోట్ల సందడి వాతావరణం నెలకొంది. బైక్‌ ర్యాలీ తీసి, బాణసంచా కాలుస్తూ ఎంజాయ్‌ చేశారు.

  • ‘భూకబ్జా ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలి’

    HYD: వంద ఏళ్ల నాటి కురుమ కులస్థుల స్మశాన వాటికను భూకబ్జాదారులు నకిలీ ధ్రువపత్రాలతో ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని అడ్డుకోవాలని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూకబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జెడ్సీ రవికిరణ్, ఎమ్మార్వో పాండు నాయక్, హైడ్రా ఏసీపీ తిరుమల్‌లకు వినతి పత్రాలు సమర్పించారు.

  • ముగింపు దశలో ఫార్ములా-ఈ రేసు దర్యాప్తు!

    HYD: ఫార్ములా-ఈ రేసు కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. ఈ నెలాఖరులోపు అభియోగపత్రాలు దాఖలు చేయాలని అవినీతి నిరోధకశాఖ(ACB) అధికారులు భావిస్తున్నారు. విచారణకు రమ్మని మాజీ మంత్రి KTRకు నోటీసులు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఇదేనని తెలుస్తోంది.  ఇందులో ప్రధాన నిందితునిగా ఉన్న KTR ద్వారా మిగతా వివరాలు రాబట్టి అనంతరం అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

  • ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

    మేడ్చల్: పోచారం మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ ఆఫీస్‌లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఘట్కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వినోద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో మేలు జరుగుతుందని, సంక్షేమ పథకాలు సమృద్ధిగా అందుతున్నాయన్నారు.

  • 10 నుంచి వినతుల స్వీకరణ

    HYD: ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మొదట ఈ నెల 10 నుంచి ప్రతిరోజూ ఇద్దరేసి కార్పొరేషన్ల ఛైర్మన్లు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గాంధీభవన్‌లో సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. వాటిని సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి చొరవ తీసుకుంటారు.

  • ‘బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలి’

    HYD: వారాసిగూడలోని చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కార్పొరేటర్ సామల హేమ, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారమివ్వకుండా బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మతపెద్దలు, పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, తదితరులు పాల్గొన్నారు.

  • RCB విజయం.. కోహ్లీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చూడండి!

    IPL-2025లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో RCB విజయం సాధించింది. IPL చరిత్రలో తొలిసారి కప్పు కొట్టింది. దీంతో RCB, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న రాత్రి RCB గెలిచిన అనంతరం ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలోని షాద్‌నగర్‌లో కోహ్లీ ఫ్యాన్స్ టపాసులు పేలుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.

  • సంస్థాగతంగా కాంగ్రెస్‌ బలోపేతంపై మీనాక్షి దృష్టి

    HYD: సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ దృష్టి సారించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని పార్టీ కమిటీల ఏర్పాటు కోసం గతంలో జిల్లాకు ఇద్దరు చొప్పున నియమించిన పరిశీలకులతో బుధవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.  ఈ మేరకు జిల్లాల పరిశీలకులకు గాంధీభవన్‌ నుంచి సమాచారం వెళ్లింది.

     

     

  • పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ

    HYD: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరమత్తులు నిర్వహించి హైదరాబాద్ పోలీసులకు తిరిగి అప్పగించిన సికింద్రాబాద్‌ జేమ్స్ స్ట్రీట్‌లోని చారిత్రక భవనం రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సందర్శించారు. సీపీ మాట్లాడుతూ..1900నుంచి 2016వరకు 116ఏళ్ల పాటు రక్షకబట నిలయంగా సేవలందించిందని, 2016లోనే మరమత్తుల నిమిత్తం అద్దె భవనంలోకి పోలీస్‌స్టేషన్‌ను తరలించడం జరిగిందన్నారు.

  • ప్రతిభ చాటి.. ఐదు స్వర్ణాలు సాధించి

    HYD: JNTU 13వ స్నాతకోత్సవం వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ECE విద్యార్థిని పాలడుగు నవ్యశ్రీ ఐదు పతకాలు అందుకున్నారు. ECE విభాగంలో ఉత్తమ ప్రతిభకు ఒకటి, డీవీపీ నరసరాజు స్మారక ఎండోమెంట్‌ పతకంతోపాటు, వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఉత్తమ విద్యార్థిని విభాగంలో ప్రతిభ కనబరిచినందుకు వేదవతి బంగారు పతకం, మరికొన్ని పతకాలు సాధించారు.