Locations: Hyderabad

  • బయో గ్యాస్ మూసివేతపై నిరసన

    HYD: బోయిన్‌పల్లిలోని బీఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డ్‌లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూరగాయల వ్యర్థాలతో బయో గ్యాస్ తయారు చేసేందుకు గ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాలు చేసింది. ఈ ప్లాంట్‌ను గతంలో ప్రధాని మోదీ సైతం అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిర్వీరం చేసే ప్రయత్నంలో భాగంగా మూసివేసిందంటూ బీఆర్‌ఎస్ నిరసన తెలిపారు. వెంటనే ప్లాంట్‌ను తెరవాలని వారు ఛైర్మన్‌ను కోరారు.

  • హైదరాబాద్‌కు మిస్‌ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా

     

    TG: మిస్‌ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌ నగరం ముస్తాబైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన అందాల భామలు నగరానికి చేరుకున్నారు. ‘మిస్‌ వరల్డ్‌- 2024’ విజేతగా నిలిచిన క్రిస్టినా పిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) శుక్రవారం వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న క్రిస్టినాకు తెలంగాణ అధికారులు ఘనస్వాగతం పలికారు.

  • మందుబాబులతో స్థానికులు ఇబ్బందులు

    HYD: పార్సిగుట్ట చౌరస్తా మందుబాబులకు అడ్డాగా మారింది. రెండు మద్యం దుకాణాలు, రెండుబార్లు ఉండడంతో ఈ ప్రాంతంతో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. వాటిని అక్కడి నుంచి తొలగించాలని స్థానికులు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. గొడవపెట్టుకోవడం, భయాందోళనకు గురిచేయడం వంటివి చేస్తుండటంతో మందుబాబులతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మద్యం షాపు యజమానులకు నోటీసులు ఇచ్చామని అడిషనల్ డీసీపీ నర్సయ్య తెలిపారు.

  • ఎమ్మెల్యేను కలిసిన నూతన కమిటీ సభ్యులు

    హైదరాబాద్: ఇటీవల నూతనంగా ఎన్నికైన సనత్‌నగర్‌లోని సుందర్ నగర్ కాలనీ అసోసియేషన్ కమిటీ సభ్యులు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలోని సమస్యలను తన వద్దకు తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామని తలసాని హామీ ఇచ్చారు.

  • అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

    HYD: తుకారాం గేట్ జేఎల్పీఎస్ నగర్‌లోని నల్లపోచమ్మ, శ్రీ మహంకాళి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని ఆకాంక్షించారు.