Locations: Hyderabad

  • ‘ఇక్కడి వారికి అవకాశం ఇవ్వడం లేదు’

    హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల పెత్తందారుల జులం ఏంటని తెలంగాణ లోకల్ క్యాబ్‌వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మల్లేష్ అన్నారు. బోరబండలో మీడియా సమావేశం నిర్వహించారు. హైటెక్ సిటీలో క్యాబ్‌వేండర్స్‌గా ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు ఇస్తూ.. ఇక్కడి వారికి అవకాశం ఇవ్వడంలేదని వాపోయారు. సమస్యలు తీరాలంటే  అసోసియేషన్ ఉండాలని దాదాపు 100 మందితో కూడిన అసోసియేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు.

  • హెల్త్‌క్యాంపులో పాల్గొన్న ఎమ్మెల్యే

    HYD: బిగ్ టీవీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకురాలు సీ. వైష్ణవీ యాదవ్, మెడికవర్, మాక్సివిజన్ సహకారంతో మోండా మార్కెట్ డివిజన్ అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మెగా హెల్త్‌క్యాంపులో ముఖ్యఅతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై ప్రారంభించారు. హెల్త్‌క్యాంప్ ఏర్పాటు చేసిన బిగ్ టీవీ యజమాన్యానికి అభినందనలు తెలిపారు. వార్తా ప్రసారాలతో పాటు హెల్త్‌క్యాంపులు చేస్తూ ప్రజలకు సాయం చేయడంపై సంతోషం వ్యక్తంచేశారు.

  • ఘట్కేసర్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు..

    మేడ్చల్: ఘట్కేసర్ పీఎస్ పరిధిలో బుధవారం బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో సీఐ పందిరి పరుశురామ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, దేవాలయం, మసీద్ , ఆర్టీసీ బసెస్, జన సమూహం కలిగినా షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది తనిఖీలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి..

    రంగారెడ్డి: మద్యం మత్తులో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. శివరాం పల్లిలో ఉండే అమిత్‌కుమార్ మద్యం సేవించి తన ఇంటికి రాగా ఒకటోంతస్తు నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయం కాగా స్థానికులు హాస్పటల్‌కు తరలించే లోపు మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు.

  • బ్యాగ్‌‌లో కుళ్లిన మహిళ మృతదేహం

    మేడ్చల్: బాచుపల్లి పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ గోడ దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతున్న బ్యాగ్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెరిచి చూడగా.. కుళ్లిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని మహిళ (25) మృతదేహం లభ్యమైంది. బాలనగర్ డీసీపీ సూచనలతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

     

  • భూ భారతి సదస్సులో మాజీ ఛైర్‌పర్సన్

    మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపల్ కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి సదస్సులో  ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరయ్యారు.  ఆయన మాట్లాడుతూ..  భూ భారతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి, భూమి సంబంధిత సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. జూన్3 నుంచి జూన్20 వరకు కొనసాగుతుందని తెలిపారు. రైతులు సమస్యలను ఫారాల ద్వారా అధికారులకు తెలియజేయాలని సూచించారు.

  • సెవెరేజ్ లైన్ పనుల పరిశీలన

    మేడ్చల్: హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేష్‌నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సెవెరేజ్ లైన్ పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, HMWSSB ఏఈ , GHMC ఏఈ, కాలనీవాసులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ.. పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు.

  • ఘనంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

    మేడ్చల్: మూసాపేట జనతా నగర్‌లోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో బుధవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులను బండి రమేష్ అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముక్కల వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.

  • మంచినీటి పైప్‌లైన్ జంక్షన్‌ల ఏర్పాటుకు చర్యలు

    మేడ్చల్: బోడుప్పల్ నగరపాలక సంస్థ 21డివిజన్ మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్, డివిజన్‌లో మంచినీటి పైప్‌లైన్ జంక్షన్‌ల ఏర్పాటు కోసం HMWSSB జనరల్ మేనేజర్ సునీల్ కుమార్‌ను కోరారు. దీంతో మేనేజర్ మమత, ఆమె బృందంతో కలిసి పరిశీలన చేశారు. మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తామని, మిగిలిన పనులను  పూర్తిచేస్తామని వారు హామీఇచ్చారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు ఎలిగొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

  • ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్‌.. స్పందించిన మంత్రి

    HYD: ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ విచారాణ వ్యక్తం చేశారు. ఇందులో 92మంది అనారోగ్యానికి గురవ్వగా.. 18మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, మిగతా వారికి 6 వైద్యబృందాలు చికిత్స అందిస్తున్నాయి. డైట్ కాంట్రాక్టర్‌ను తొలగించి, కమిటీ విచారణకు ఆదేశించారు. డైయిట్ కారణంగానే ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా తెలుస్తుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.