Locations: Hyderabad

  • గణేష్ పూజలో బండ చంద్రారెడ్డి

    HYD: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సీతాఫల్మండిలోని క్రాంతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు బండ చంద్రారెడ్డి సందర్శించారు. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులైన సందీప్ రాజు, రాజు సాగర్, నరహరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

  • పేరెంట్స్ జన్మనిస్తే.. టీచర్స్ జీవితాన్ని ఇస్తారు: స్పీకర్

    వికారాబాద్: తల్లిదండ్రులు జన్మనిస్తే, ఉపాధ్యాయులు జీవితాన్ని ఇస్తారని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో సహా సమాజంలోని అన్ని రంగాల నిపుణులను తయారు చేసేది ఉపాధ్యాయులే అని తెలిపారు. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు, నిర్మాతలని చెప్పారు. అనంతరం, జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 50 మందిని ఆయన సత్కరించారు.

  • ఖైరతాబాద్‌కు పోటెత్తిన భక్తులు

    హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాగణపతి దర్శనం నిలిపివేసినప్పటికీ శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో గణనాథుడిని దూరం నుంచి చూసేందుకు నిర్వాహకులు అనుమతిస్తున్నారు. మరోవైపు శనివారం మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పది: PCC చీఫ్

    HYD: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర గణనీయమైనదని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మహబూబ్ కాలేజీలో జరిగిన గురుపూజోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన, 1862లో ప్రారంభమైన ఈ కళాశాల ఎంతోమంది ప్రముఖులను తయారు చేసిందని పేర్కొన్నారు. ప్రపంచ సదస్సుకు వెళ్లే ముందు స్వామి వివేకానంద ఈ కళాశాలను సందర్శించారని గుర్తు చేశారు.

  • చోరీకి యత్నం.. చితకబాది పోలీసులకు అప్పగింత

    హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్‌లో ఓ దొంగను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. శుక్రవారం ఒక ఇంట్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని గమనించిన ప్రజలు అతడిని పట్టుకున్నారు. ప్రశ్నించగా తడబడటంతో చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Yamaha R15 సిరీస్‌కు కొత్త కలర్ ఆప్షన్లు..

    యమహా మోటార్ తన ప్రసిద్ధ R15 సిరీస్ బైక్‌లకు కొత్త రంగులను తీసుకొచ్చింది. R15M ఇప్పుడు మెటాలిక్ గ్రే, R15 వెర్షన్ 4 మెటాలిక్ బ్లాక్, అంతర్జాతీయంగా ఉన్న మ్యాట్ పెర్ల్ వైట్‌ రంగులలో లభిస్తాయి. R15S వెర్మిలియన్ వీల్స్‌తో మ్యాట్ బ్లాక్ రంగులో విడుదలయ్యింది. ఇంజిన్, ఫీచర్లలో ఎటువంటి మార్పులు లేవు. వీటి ధరలు రూ.1.67 లక్షల(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతాయి.

  • నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ఎట్టి పరిస్థితుల్లో వాటికి అనుమతి లేదు: CP

    HYD: గణేష్ నిమజ్జనం కోసం పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటుచేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 40 గంటల పాటు సాగే నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జన బందోబస్తుకు 30 వేలమంది పోలీసులు 3షిఫ్టుల్లో పనిచేస్తారని, నిఘా కోసం 250 సీసీ కెమెరాలు, 6 డ్రోన్‌లు ఉపయోగిస్తున్నామని తెలిపారు. క్రౌడ్ కంట్రోల్‌కు మహిళా మౌంటెడ్ పోలీసులను మొదటిసారిగా ఉపయోగిస్తామని వివరించారు.

  • గణేష్ నిమజ్జనం.. రేపు 66 చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు

    HYD: గణపతి శోభాయాత్ర సందర్భంగా శనివారం నగరవ్యాప్తంగా 66 చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ నిబంధనలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని, అవసరమైతే పొడిగిస్తామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రజలు తమ సొంత వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సులు, మెట్రోరైల్, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించాలని ఆయన కోరారు.

     

  • వాటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఇక నుంచి అలా కుదరదు

    గ్రేటర్ హైదరాబాద్‌లో మీటర్లు లేని నల్లా కనెక్షన్లపై జలమండలి కఠిన చర్యలకు సిద్ధమైంది. ఉచిత తాగునీటి పథకం కారణంగా ఆదాయం తగ్గడంతో, అన్ని కనెక్షన్లకు మీటర్లను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. మీటర్లు లేని కనెక్షన్ల యజమానులకు గడువు ఇచ్చి, ఆ తర్వాత జరిమానా విధించనున్నారు. ఈ చర్యల ద్వారా నీటి వృథాను తగ్గించి, జలమండలి ఆదాయాన్ని పెంచుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

  • రేపటి ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

    HYD: గణేష్ నిమజ్జన వేడుక సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నగరంలో ఎక్కడికక్కడ వాహనాలను మళ్లించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ప్రజలు 9010203626, 8712660600, 040-27852485 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పోలీసులు తెలిపారు.