Locations: Hyderabad

  • పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ

    HYD: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరమత్తులు నిర్వహించి హైదరాబాద్ పోలీసులకు తిరిగి అప్పగించిన సికింద్రాబాద్‌ జేమ్స్ స్ట్రీట్‌లోని చారిత్రక భవనం రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సందర్శించారు. సీపీ మాట్లాడుతూ..1900నుంచి 2016వరకు 116ఏళ్ల పాటు రక్షకబట నిలయంగా సేవలందించిందని, 2016లోనే మరమత్తుల నిమిత్తం అద్దె భవనంలోకి పోలీస్‌స్టేషన్‌ను తరలించడం జరిగిందన్నారు.

  • ప్రతిభ చాటి.. ఐదు స్వర్ణాలు సాధించి

    HYD: JNTU 13వ స్నాతకోత్సవం వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ECE విద్యార్థిని పాలడుగు నవ్యశ్రీ ఐదు పతకాలు అందుకున్నారు. ECE విభాగంలో ఉత్తమ ప్రతిభకు ఒకటి, డీవీపీ నరసరాజు స్మారక ఎండోమెంట్‌ పతకంతోపాటు, వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఉత్తమ విద్యార్థిని విభాగంలో ప్రతిభ కనబరిచినందుకు వేదవతి బంగారు పతకం, మరికొన్ని పతకాలు సాధించారు.

  • మూడు మార్గాలు సుగమమయ్యేనా?

    TG: మెట్రోరైలు రెండోదశ ‘బి’ భాగం డీపీఆర్‌లను ఈనెల 5న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. మూడు మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)లను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు లిమిటెడ్‌(హెచ్‌ఏఎంఎల్‌) రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదమే తరువాయి డీపీఆర్‌లు కేంద్రానికి చేరనున్నాయి.

  • సైకిల్ ట్రాక్‌లపై జీహెచ్‌ఎంసీ నిర్వహణ లోపం

    HYD: నగరంలో సైకిల్‌ ట్రాక్‌లు ఎక్కువగా లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ ప్రధాన రహదారులకు ఇరువైపులా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సైక్లిస్ట్‌ల సౌకర్యార్థం ప్రత్యేక మార్కింగ్‌లతో చేశారు. నెక్లెస్‌ రోడ్డు చుట్టూ కూడా ట్రాక్‌ మార్కింగ్‌లు చేశారు. జీహెచ్‌ఎంసీ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆయా ట్రాక్‌లు పార్కింగ్‌ కేంద్రాలుగా, తోపుడు బండ్లకు అడ్డాగా మారాయి.

  • హైదరాబాద్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధరలు

    HYD: నగరంలో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,110కి చేరింది. ఇదే ఆల్ టైమ్ గరిష్ట స్థాయి. ఏప్రిల్ 22న ఇది రూ.1,00,015గా ఉండగా, గణనీయమైన పెరుగుదల నమోదైందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్, దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం పట్ల ఆకర్షణ డిమాండ్‌ను పెంచుతోంది.

  • మరో 2-3 రోజుల్లో ట్రాఫిక్ క్లియర్

    HYD: మలక్‌పేట్ అక్బర్ ప్లాజా వద్ద డ్రైనేజీ లీకేజీ కారణంగా మూడు రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం నుంచి మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తి చేయడానికి మరో 2-3 రోజులు పట్టవచ్చని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తెలిపారు. ప్రధాన సమస్య పరిష్కారమైన వెంటనే ఈమార్గంలో కొత్త రోడ్డు వేయనున్నట్లు చెప్పారు. రద్దీ దృష్ట్యా ప్రస్తుతం వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు.

  • కూకట్‌పల్లిలో అంతరాష్ట్ర డ్రగ్స్‌ ముఠా అరెస్ట్

    మేడ్చల్: కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఆంధ్రప్రదేశ్‌లోని అద్దంకికి చెందిన 5మంది అంతరాష్ట్ర డ్రగ్స్ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 800గ్రాముల డ్రగ్స్, 5మొబైల్ ఫోన్లు, రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు వారి వద్ద దొరికిన డ్రగ్స్ మార్కెట్ విలువ సుమారు 2కోట్ల రూపాయలు. పరారీలో ఉన్న ఆరో వ్యక్తి తిరుపతికి చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు.

  • ORRపై ప్రమాదం జరిగితే.. వెంటనే కాల్ చేయండి

    HYD: ORRపై ప్రమాదానికి గురైన వెంటనే ట్రామా సెంటర్లలో ఎమర్జెన్సీ వైద్యం అందించడం ద్వారా అనేక మందికి ప్రాణాలు నిలబడుతున్నాయి. 158 కిలోమీటర్ల పొడవు కలిగిన ORRపై ప్రమాదం జరిగితే వెంటనే 1066, 14449, 100కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. కాల్ చేసిన వెంటనే స్పందించి, గోల్డెన్ హవర్‌లో వైద్యం అందించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

  • కవిత ఇంటి ముందు ఫ్లెక్సీలో ఇంట్రెస్టింగ్ కొటేషన్

    కొన్నిరోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ నేతలే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు కవిత వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనికి తాజాగా హైదరాబాద్‌లోని కవిత ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’’ అనే కొటేషన్ అందరి దృష్టికి ఆకర్షిస్తోంది.

  • ప్రిజమ్ పబ్‌లో హీరోయిన్‌పై దాడి

    HYD: ప్రిజమ్ క్లబ్ సిబ్బంది సినీ నటి కల్పికపై దాడి చేశారు. బర్త్ డే కేక్ విషయంలో కల్పికకు, సిబ్బందికి వాగ్వాదం మొదలైంది. దీంతో పబ్ సిబ్బంది కల్పికపై బూతులతో రెచ్చిపోయారు.కల్పిక ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆమె పై దాడికి దిగినట్లు తెలుస్తోంది.మరీ పబ్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై కల్పిక పోలీసులకు ఫిర్యాదు చేసిందా లేదా అన్న దానిపై సమాచారం లేదు.