HYD: బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 760 పెరిగి రూ.1,07,620గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ. 98,650గా పలుకుతోంది. ఇటు కేజీ వెండి ధర 100 తగ్గి రూ. 1,36,000 వద్ద కొనసాగుతుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
Locations: Hyderabad
-
భారీగా పెరిగిన బంగారం ధరలు
-
HYDలో 1000 ఏళ్ల రామయ్య విగ్రహం
HYD: శంషాబాద్ పట్టణంలో గల అమ్మపల్లి రామాలయం 13వ శతాబ్దంలో వేంగి రాజులచే నిర్మించబడింది. ఈఆలయ విగ్రహం మాత్రం 1000 సంవత్సరాల పురాతనమైనది. 7అంతస్తుల గోపురం, నల్లటిరాతితో చెక్కిన సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడి ప్రత్యేకతలు. హనుమంతుడి విగ్రహం గర్భగుడిలో కాకుండా ధ్వజస్తంభం వద్ద ఉంటుంది. ఇక్కడ ఉన్న కోనేరు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకు ఇది ఒక ఇష్టమైన ప్రదేశం.
-
అలర్ట్.. వైద్య పరీక్షలన్ని అక్కడ ఫ్రీ..
ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో వేల రూపాయలు ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా, నగరంలోని ప్రభుత్వాసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో 40 రకాల వైద్యపరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. బీపీ, డయాబెటిక్, డెంగీ, టైఫాయిడ్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి ముఖ్యమైన పరీక్షలు వీటిలో ఉన్నాయి. ఈకేంద్రాల్లో ఉదయం నుంచి నమూనాలు సేకరించి, వాటిని నారాయణగూడలోని ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపుతారు. పరీక్షల ఫలితాలను రోగుల ఫోన్ నంబరుకు పంపిస్తారు.
-
HYDకి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్ వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసమావేశంలో కాళేశ్వరం వ్యవహారంతో సహా వివిధ కేసులపై చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీబీఐ డైరెక్టర్ పర్యటన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కీలకంగా మారింది.
-
ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణంలోకి దూసుకొచ్చిన భక్తజనం
HYD: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రేపు శోభాయాత్ర జరగనున్న నేపథ్యంలో గురువారం రాత్రి నుంచే భక్తులకు దర్శనం నిలిపివేశారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన వెళ్లగానే భక్తులు ఒక్కసారిగా వినాయకుడి ప్రాంగణంలోకి దూసుకువచ్చారు. వారిని పోలీసులు నిలువరించలేకపోవడంతో ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో తొలగింపు పనులు ఆలస్యం అవ్వనున్నాయి.
-
గణేష్ నిమజ్జనం స్పెషల్.. HYD మెట్రో నాన్ స్టాప్ సర్వీసులు
HYD: గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నిరంతరాయంగా నడుస్తాయని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. లక్షలాది మంది భక్తులు శోభాయాత్రను వీక్షించేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.
-
HYD @30.3 డిగ్రీలు
HYD: రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో వైపు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరగా నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.2 డిగ్రీలు, గాలిలో తేమ 63 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
-
మహిళా వర్సిటీలో 100 మంది విద్యార్థినుల ఫోన్లు హ్యాక్
HYD: కోఠీలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థినుల ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దాదాపు 100 మంది విద్యార్థినులకు ఫోన్ చేసి, మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో భయాందోళనలకు గురైన విద్యార్థినులు విషయాన్ని వర్సిటీ వీసీ ప్రొ.సూర్య ధనుంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె సూచనతో సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
బహిరంగ ప్రదేశాల్లో బయోవ్యర్థాలు.. పట్టించుకునేవారేరి.?
హైదరాబాద్‌లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, చిన్న క్లినిక్‌ల నిర్వాహకులు జీవవ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా పడేస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరగడంతో, రోగుల తాకిడి ఎక్కువై బయో వ్యర్థాలు పెద్ద మొత్తంలో పోగవుతున్నాయి. దీనివల్ల పారిశుద్ధ్య కార్మికులకు, ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఈసమస్యపై కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
మరో వారంలో పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ చేసుకోండి
SBI ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) మెయిన్స్ పరీక్ష అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 13న జరగనున్న మెయిన్స్ పరీక్షకోసం అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదేసమయంలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్(సీడీఎస్) పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈపరీక్షలు సెప్టెంబర్14న దేశవ్యాప్తంగా నిర్వహించబడతాయి.